Tuesday, November 27, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదిహేనవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదిహేనవ అధ్యాయం

సూత ఉవాచ

ఏవం కృష్ణసఖః కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః

నానాశఙ్కాస్పదం రూపం కృష్ణవిశ్లేషకర్శితః

భ్రాత్రా రాజ్ఞ ఆవికల్పితః: ధర్మరాజు ఇన్ని రకాలుగా అడిగితే. కృష్ణవిశ్లేషకర్శితః : కృష్ణవియోగంతో చిక్కిపోయినవాడై ముఖము వాడిపోయింది

శోకేన శుష్యద్వదన హృత్సరోజో హతప్రభః

విభుం తమేవానుస్మరన్నాశక్నోత్ప్రతిభాషితుమ్

శుష్యత్ వదన :  కృష్ణవియోగంతో చిక్కిపోయినవాడై ముఖము వాడిపోయింది

హృత్సరోజో హతప్రభః హృదయపద్మం కూడా కంతిని తగ్గించుకుంది

విభుం తమేవానుస్మరన్నాశక్నోత్ప్రతిభాషితుమ్ - పరమాత్మనే స్మరిస్తూ మాటలు రాక నిలబడెను

కృచ్ఛ్రేణ సంస్తభ్య శుచః పాణినామృజ్య నేత్రయోః

పరోక్షేణ సమున్నద్ధ ప్రణయౌత్కణ్ఠ్యకాతరః

ఎంతో కష్టపడి దుఖాన్ని దిగమింగుకొని కనులు తుడుచుకొని

పరమాత్మ ఎదురుగా ఉన్నప్పుడు అతని మీద ఉన్న ఉత్సాహం చాటుగ ఉన్నప్పుడు ఎక్కువైంది. కాతర: దీనుడైపోయాడు

సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్

నృపమగ్రజమిత్యాహ బాష్పగద్గదయా గిరా

కృష్ణుణ్ణి తలచుకుంటే తలచుకోవాల్సింది సఖ్యం మైత్రీం సౌహృదం

ఈ  మూడితికీ తేడా ఉంది.సౌహృదం - హృదయాంతర్గంలో కూడా ఎదుటివాడిమేలు కోరడం. హృదయం కూడా 'సూ కావాలి. హృదయాంతర్గతం కూడా హితం కోరుకోవడము

మైత్రీం  - మిత్రత. తనవాడు అనుకున్నవాడి దోషాలని వివరించి సవరించే పని చెస్తే అది మైత్రీ

సఖ్యం  - ఖం అంటే ఇంద్రియాలు. స ఖ్యం అంటే సమానాన్ని. అంటే ఇంద్రియాలు సమానం. అంటే? అన్నిటిలో ఒకలా ఉండటం, పనిచేయడంలో, తినడంలో తిరగడంలో, అన్నిటిలో ఒకలా ఉండటం.

సారధ్యంలో సౌహృదాన్ని స్మరించాడు. యుధ్ధం జరిగిన 18 రోజులు కృష్ణుడు అర్జనునితోనే ఉన్నాడు. కృష్ణుని దృష్టి సాకే దూరంలోనే మిగతా నలుగురు పాండవులూ ఉన్నారు. ఒక వేళ కృష్ణుడు కూడా యుధ్ధం చేస్తే యుధ్ధం చేస్తూ పాండవుల యోగ క్షేమాన్ని కనిపెట్టడం కష్టమవుతుంది. సారధిగా ఉండి ఐదుగురినీ కాపాడాడు. ఒక సారి కర్ణుడి ప్రతాపం చూచి అర్జనుడే రథాన్ని వెనక్కి జరపమన్నాడు. అపుడు ధర్మరాజు ముందుకొచ్చి కర్ణున్ని అడ్డుకున్నాడు. ధర్మరాజులో తన శక్తిని నిక్షేపించాడు. ఒక సారి వీరిద్దరూ భయపడితే భీముడిలో నిక్షేపించాడు. అలాగే భగదత్తుడు వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురినీ కాపాడటానికి సహదేవున్ని పంపాడు. ఆయన శక్తిని సహదేవునిలో నిక్షేపించాడు

18 రోజుల యుధ్ధంలో సహదేవుడుకూడ ఒక రోజు మొత్తం కౌరవ సైన్యాన్ని ఆపాడు.

కృష్ణుడు వెంటలేనప్పుడు నలుగురు పాండవులు ఉండి కూడా అభిమన్యున్ని కాపాడలేకపోయారు

అలాగే రాయబారంలో ఆయన చూపిన మైత్రీ. ఇవన్నీ గుర్తుకుతెచ్చుకున్నాడు.

అర్జున ఉవాచ

వఞ్చితోऽహం మహారాజ హరిణా బన్ధురూపిణా

యేన మేऽపహృతం తేజో దేవవిస్మాపనం మహత్

ఓం నమో భగవతే వాసుదేవాయ

వఞ్చితోऽహం మహారాజ హరిణా బన్ధురూపిణా

యేన మేऽపహృతం తేజో దేవవిస్మాపనం మహత్

బంధువుగా ఉన్న శ్రీహరిచేత నేను మోసగింపబడ్డాను. ఇక్కడ మోసగించబడటం అంటే అనుఖొనిది జరగడం. అందరు కృష్ణుని యందు పరమాత్మ భావన కలిగి ఉన్నవారే.

ఎంతో కాలం నేను దేవతలను కూడా ఆశ్చర్యపరిచాను (దేవవిస్మాపనం ) నా తేజస్సుతో. అది అంతా నా తేజస్సు అని అనుకున్నాను. ఏ మహానుభావుని చేత దేవతలకి కూడా ఆశ్చర్యపరిచే నా పరాక్రమం అపహరించబడింది.

యస్య క్షణవియోగేన లోకో హ్యప్రియదర్శనః

ఉక్థేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథా

ఏ ప్రాణి అయిన ఏది ఉంటే ప్రకాశిస్తున్నారో ఏది లేకపోతే అంతకు ముందు ప్రేమించినవారంతా భయపడతారో అది ప్రాణం

ఏ మహానుభావుని యొక్క క్షణ కాల వియోగంతో ప్రపంచమంతా శూన్యంగా కనపడుతుందో, ఎలాగంటే ప్రాణం లేని దేహం లాగ.ఒక క్షణకాల వియోగానికే లోకమంతా అప్రియంగా కనపడుంది.

ఆయన లేని మనం ప్రాణం లేని దేహంతో సమానం

యత్సంశ్రయాద్ద్రుపదగేహముపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదుర్మదానామ్

తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణా

తను జీవితకాలం లో సాధించిన విజయాలని,

పాండవులు ఏమి ఏమి విజయాలు సాధించారో అవి అన్నీ చెబుతున్నాడు

ద్రౌపదీ స్వయం వరానికి అందరూ వచ్చారు. పాండవులు బ్రాహ్మణ వేషంతో ఉన్నారు. క్షత్రియులని చెప్పుకున్నవారందరు మత్స్య యంత్రాన్ని చేధించలేకపోయారు. అది అవమానం అని భావించి ద్రుపదుడు

"లక్ష్యన్ని కొట్టగలవారు, కొట్టినా చేసే పనిలో సౌహార్దం ఉండాలి తప్ప ద్వేషం ఉండకూడదు, చక్కని శాస్త్ర పాండిత్యం కలవారు అయి ఉండాలి. వేదాధ్యాయం చేసే బ్రాహ్మణులు కూడా రవొచ్చు" అని చెప్పగా అర్జనుడు వెళ్ళి కొట్టాడు. అది సహించలేని రాజులు మమ్మల్ని ఓడిస్తేనే నీవు గెలిచినట్లు అని అన్నారు, ద్రౌపది మీద కోరికతో. ఆ మదం తో వారు యుధ్ధానికి వస్తే

వారితేజస్సును నేను హరించాను. మత్స్యాన్ని కూడా కొట్టాను. (తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః )

ద్రౌపతిని కూడా పొందాను.ఇది అంతా నా ప్రతిభ చేత కాదు (యత్సంశ్రయా - ఎవరి ఆశ్రయం వల్ల)

స్వయంవరానికి కబురు పంపింది కృష్ణుడే

యత్సన్నిధావహము ఖాణ్డవమగ్నయేऽదామిన్ద్రం చ సామరగణం తరసా విజిత్య

లబ్ధా సభా మయకృతాద్భుతశిల్పమాయా దిగ్భ్యోऽహరన్నృపతయో బలిమధ్వరే తే

ఖాండవ వన దహనం లో ఇంద్రుని మీదే గెలిచాను. వాహ్యాళికి వెళ్ళినట్లు బయలుదేరించి అర్జనునికి ఆయుధాలిప్పించి ఇంద్రునితో యుధ్ధం చేసి వర్షం రాకుండా చేసి ఖాండవ వనం దహింపజేసాడు.

దేవతల గణాంతో కూడిన ఇంద్రున్ని గెలిచి (ఇన్ద్రం చ సామరగణం), అదే సమయంలో మయుడు కాపాడబడితే మయుడు ఒక సభను తయారు చేసి ఇచ్చాడు. కుంతీ స్తోత్రంలో చెప్పబడినట్లు అర్జనునికి గాండీవాన్ని తనకి సుదర్శనాన్ని ధర్మరాజుకు మయసభ ఇప్పించి ఇంద్రున్ని అర్జనుడు జయించాడన్న కీర్తి చాటించి  - ఆ మయ సభ వలనే భారతంలో మిగతా ఘట్టాలన్ని జరిగాయి. పాండవులకు అవమానం జరిగితేనే గానీ వారి మనసు క్షోభించదు, ధర్మాత్ముల మనసు క్షోభిస్తేనే గాని అధర్మం అంతరించదు.

కృష్ణుడు మయసభను ఇప్పించడంలో సూక్షం , దుర్యొధనునికి ఆ మయసభను విడిదిగా ఇప్పించమని ధర్మరాజుకు చెప్పడం ఇదంతా ఆయన సంకల్పమే

ఆ మయ సభలోనే సామంత రాజులంతా నీకు ధనాన్ని అర్పించారు

యత్తేజసా నృపశిరోऽఙ్ఘ్రిమహన్మఖార్థమార్యోऽనుజస్తవ గజాయుతసత్త్వవీర్యః

తేనాహృతాః ప్రమథనాథమఖాయ భూపా యన్మోచితాస్తదనయన్బలిమధ్వరే తే

ఈ మహానుభావుడు రాజసూయం చేయించి నీ తమ్ముడు నా అన్నగారైన  భీముడు (గజాయుతసత్త్వవీర్యః) పదివేల ఏనుగుల బలం గల జరాసంధున్ని ఓడించాడు. రాజసూయం శివ మయం అయిన యాగం  (ప్రమథనాథమఖాయ). అయితే రాజసూయం ఎవరు చేసిన సకలదేవత అర్పణం చేసి చివరి ఆహుతి శివునికి ఇస్తారు. యజ్ఞ్య రక్షకుడు విష్ణువు కాబట్టి శంకరునికి ఆహుతి చేసి, కృష్ణునికి అగ్రపూజ చేసారు. దాని వల్ల ధర్మరాజుకు చక్రవర్తి హోదా వచ్చింది. ఈ కీర్తిని మాకు వచ్చేట్లు చేసిన కృష్ణుడు

పత్న్యాస్తవాధిమఖక్లృప్తమహాభిషేక శ్లాఘిష్ఠచారుకబరం కితవైః సభాయామ్
స్పృష్టం వికీర్య పదయోః పతితాశ్రుముఖ్యా యస్తత్స్త్రియోऽకృతహతేశవిముక్తకేశాః

ఆ రజసూయమైన తరువాత జరిగిన అవభృత స్నానంతో పవిత్రమైన గంగా జలంతో (మఖక్లృప్తమహాభిషేక ) తడిసిన నీ పట్టపురాని (పత్న్యాస్తవా) కొనియాడబడే కేశములను ( శ్లాఘిష్ఠచారుకబరం) అసూయతో నీ శత్రువులు స్పృశించారు (కితవైః స్పృష్టం  - కపటులతో స్పృశించబడింది) . వారు స్పృశిస్తే వారి భార్యలు కేశములు ముడివేయలేని స్థితికి వచ్చారు.

యో నో జుగోప వన ఏత్య దురన్తకృచ్ఛ్రాద్దుర్వాససోऽరిరచితాదయుతాగ్రభుగ్యః
శాకాన్నశిష్టముపయుజ్య యతస్త్రిలోకీం తృప్తామమంస్త సలిలే వినిమగ్నసఙ్ఘః

అరణ్యవాసంలో కూడా దుర్యోధనుడు వదలక దుర్వాసున్ని పదివేలమంది శిష్యులతో సహా భోజనానికి పాండవుల వద్దకు పంపాడు. అక్ష్యపాత్రను అప్పుడే కడిగి పెట్టడంవల్ల మరునాడు ఉదయంవరకూ దానిని వాడటం కుదరదు. అప్పుడు ద్రౌపతి ధర్మరాజు తక్షణ కర్త్వ్యమేమిటని మధనపడుతుంటే ధర్మరాజు సలహా మేరకు ద్రౌపది కృష్ణుణ్ణి పిలిస్తే, వెంటనే కృష్ణుడు ఆకలవుతుందంటూ వస్తాడు. ద్రౌపతిని అక్షపాత్ర తీసుకు రమ్మని అందులో మూడు మెతుకులని చూపిస్తాడు.
మనం చాలా జాగ్రత్తగా పనిచేసాము అనుకున్న దాంట్లొ లొసుగులు ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం.
ఇంటికి వచ్చిన అథిది కి భోజనం పెట్టడానికి కూడా ఆయన కృపే కావల్సి వచ్చింది
పదివేలమందితో కలిసి భోజనానికి వచ్చిన దుర్వాసునికి కూరగాయలతో కలిపి ఉన్న అన్నంతో (కృష్ణుడు అప్పుడు చెప్పాడు - నేనే అన్నమును కావలంటే ఆవిర్భవిస్తాను వద్దనుకుంటే అంతర్ధానమవుతాను)

యత్తేజసాథ భగవాన్యుధి శూలపాణిర్విస్మాపితః సగిరిజోऽస్త్రమదాన్నిజం మే
అన్యేऽపి చాహమమునైవ కలేవరేణ ప్రాప్తో మహేన్ద్రభవనే మహదాసనార్ధమ్

అరణ్యవాసంలో ఉన్నప్పుడు వ్యాస భగవానుడు వచ్చి - అరణ్య అజ్ఞ్యాత వాసాలు ముగిసాక వారు రాజ్యం ఇవ్వకపోతే నీవు యుధ్ధం చేసి రాజ్యం సంపాదించాలి. వారి పక్షంలో 21సార్లు భూమడలాన్ని ని:క్షత్రియం చేసిన బీష్ముడిని, దృఒణున్ని, కర్ణుణ్ణి, కృపున్ని, అశ్వధ్ధామ ఉన్నారు. వారు అస్త్రబలం దేహబలం కాకుండా దివ్యాస్త్రబలం ఉన్నవారు. తపసుతో ఎందరినో ప్రసన్నం చేసుకుని దివ్యాస్త్రాలని పొందారు. నీవు అర్జనుని పంపి శంకరుని గూర్చి తపసు చేయమను. అర్జనున్ని శంకరుడు - నన్ను కొట్టి నీ వరాహాన్ని తీసుకో అంటే, అర్జనుడి అమ్ములపొదిలో ఎన్నడూ లేనివిధంగా బాణములు ఐపోయాయి, అప్పుడు ధనస్సుతో శనకుర్నిమీదకు వచ్చినపుడు, సమయస్పూర్థి ఉన్నవాడివి నీవు గెలిచావులే అన్నాడు. అర్జనునికి పాశుపశాస్త్రం ఇచ్చాడు. శంకరున్నే ఓడించాడన్న పేరు పొందడానికి ఎవరు కాలం .
అది పొందిన తరువాతే అర్జనుడు ఇంద్రునికి సాయం చేసి ఇంద్రుని ఆహవానంతో ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, వెళ్ళి అర్థాసనాన్ని పొందాడు. (అందరూ శరీరం వదిలి వెళితే అర్జనుడు కృష్ణుని వల్ల శరీరంతోటే స్వర్గానికి వెళ్ళాడు)

తత్రైవ మే విహరతో భుజదణ్డయుగ్మం గాణ్డీవలక్షణమరాతివధాయ దేవాః
సేన్ద్రాః శ్రితా యదనుభావితమాజమీఢ తేనాహమద్య ముషితః పురుషేణ భూమ్నా

ఎవరి సంకల్పానుగ్రహం వలన పొందిన అస్త్రాది బలంతో ఉన్న నేను దేవతలకి సాయం చేసి వరములు పొందాను. అలాంటివాడు నన్ను మోసం చేసాడు (ముషితః )

యద్బాన్ధవః కురుబలాబ్ధిమనన్తపారమేకో రథేన తతరేऽహమతీర్యసత్త్వమ్
ప్రత్యాహృతం బహు ధనం చ మయా పరేషాం తేజాస్పదం మణిమయం చ హృతం శిరోభ్యః
ఇది ఉత్తరగోగ్రహణానికి సంబంధించినది
దాటడానికి సరిపొయే బలం లేని నేను ఇంత పెద్ద కౌరవ సమూహాన్ని రథంతోటే దాటాను (కృష్ణుని సారధ్యం వల్ల).
ఉత్తర గోగ్రహణంలో అందరినీ ఓడించి వారి శిరస్సులకి గల పుత్తలికలను తీసుకు వచ్చాను కృష్ణుని అనుగ్రహంతో
(మనకి ఉత్తరగోగ్రహణంలో కృష్ణుడు కనపడడు. ఉత్తరకుమారుడు సారధ్యం చేయడానికి వెళ్తూ తన గదిలో కృష్ణపరమాత్మను ధ్యానం చేసి అనుగ్రహం కోరగా కృష్ణుడు వచ్చి అభయమిస్తాడు)

యో భీష్మకర్ణగురుశల్యచమూష్వదభ్ర రాజన్యవర్యరథమణ్డలమణ్డితాసు
అగ్రేచరో మమ విభో రథయూథపానామాయుర్మనాంసి చ దృశా సహ ఓజ ఆర్చ్ఛత్

కురుక్షేత్ర సంగ్రామంలో నాకంటే ముందు నిలిచి (ఆయుర్మనాంసి చ దృశా) శత్రువుల ఆయువును మనసును బలమును కంటి చూపుతోటే తీసుకున్నాడు. రావణున్ని చంపడానికి రాముడు నిమిత్తుడయ్యాడు. అతని చావు సీతమ్మవలనే జరిగింది. అలాగే భారత యుధ్ధంలో అందరి ప్రాణములని మనసును బలమును గుంజుకున్నాడు. చచ్చినవారు మళ్ళి పుట్టకూడదని తాను చూచాడు, యుధ్ధం చేస్తున్న వాళ్ళు గెలవకూడదని, వారి మనసులో ధర్మభీతి కలగడానికి చూచాడు. వారి మనసు పరాక్రమం ఆయ్షు హరించాడు. దానికితోడు వారికి మళ్ళీ పుట్టుక లేకుండా చేసాడు. వారు మోక్షానికి వెళ్ళడంతో వారి కుటుంబాలు కూడా తరించాయి. భారతంలో కృష్ణుడు భగవంతుడని తెలియని వాడు లేడు దుర్యోధనునితో సహా,

యద్దోఃషు మా ప్రణిహితం గురుభీష్మకర్ణ నప్తృత్రిగర్తశల్యసైన్ధవబాహ్లికాద్యైః
అస్త్రాణ్యమోఘమహిమాని నిరూపితాని నోపస్పృశుర్నృహరిదాసమివాసురాణి

పరమాత్మ భక్తున్ని రాక్షసులు ముట్టనట్టుగా కురుక్షేత్రంలో మహావీరులు ప్రయోగించిన అస్త్రములు నన్ను ముట్టకుండా కాపాడాడు. వారు వేసిన అస్త్రాలన్ని రథంలో నిక్షిప్తం చేసాడు. యుధ్ధం పూర్తి అయ్యేవరకూ అవి అన్ని రథంలోనే ఉన్నాయి. అవి నన్ను స్పృశించలేదు, ఎలాగంటే, విష్ణుభక్తున్ని రాక్షసులు స్పృశించలేనట్లు

సౌత్యే వృతః కుమతినాత్మద ఈశ్వరో మే యత్పాదపద్మమభవాయ భజన్తి భవ్యాః
మాం శ్రాన్తవాహమరయో రథినో భువిష్ఠం న ప్రాహరన్యదనుభావనిరస్తచిత్తాః

భారతమంతా చదివిన వారు బీష్మ దృఓణ కర్ణ శల్య సౌత్విక పర్వాలు చదవాలి. ఉన్నదంతా యుధ్ధమే అయినా ఉన్న సత్యమంతా అక్కడే ఉంది. మనం ఈ సంసారంతో ఎవరితో యుధ్ధం చేస్తున్నమో తెలుస్తుంది. అర్జనుని గుఱ్ఱాలు అలసిపోయి ఇక లాగలేమని మొండికేసాయి. అప్పుడు కృష్ణుడు వాటికి విశ్రాంతి ఇచ్చాడు. మళ్ళి గుఱ్ఱాలని రథాలకి తగిలించే దాకా ఎదురుగా ఉన్న వీరులందరూ ఒక్క బాణంకూడా వెయ్యలేదు గుఱ్ఱాలను పక్కన పెట్టి కూర్చున్నా. పరమాత్మ చూపుతో వారి మనసు హరించబడింది
సౌత్యే వృతః కుమతినా - అంత పెద్ద మహానుభావున్ని సారధిగా ఉండమని అడిగాను దుష్టబుధ్ధితో
అలాంటి సమయంలో కూడా (ఈశ్వరో మే యత్పాదపద్మమభవాయ భజన్తి భవ్యాః) సంసారంలో ఎవరి కాళ్ళు పట్టుకుని తరిస్తున్నారో అలాంటి వాడి భుజాలను నా పాదములతో తాకే ఉద్యోగం అతనికి ఇచ్చాను. దాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు.
గుఱ్ఱములు అలసిపోయి రథం విప్పి భూమి మీద నించుంటే (మాం శ్రాన్తవాహమరయో రథినో భువిష్ఠం) శత్రురాజులంతా ఆ మహానుభావుని వల్ల మనసు ఎక్కడికో పోయింది (న ప్రాహరన్ యద్ అనుభావనిరస్తచిత్తాః)

నర్మాణ్యుదారరుచిరస్మితశోభితాని హే పార్థ హేऽర్జున సఖే కురునన్దనేతి
సఞ్జల్పితాని నరదేవ హృదిస్పృశాని స్మర్తుర్లుఠన్తి హృదయం మమ మాధవస్య

ఆయన ఎప్పుడు కలిసినా హాస్యాన్ని సూచించేవి అయిన నర్మ గర్బితంగా అందమైన ఆయన నవ్వుతో మనసును హరించే హే పార్థ హేऽర్జున సఖే కురునందనా అనే మాటలతో హృదయాన్ని స్పృశించే ఆనందింప్చేసే పరిహాస ఉక్తులు ఇప్పుడు తలుచుకుంటే నా హృదయం హరించుకు పోతోంది

శయ్యాసనాటనవికత్థనభోజనాదిష్వైక్యాద్వయస్య ఋతవానితి విప్రలబ్ధః
సఖ్యుః సఖేవ పితృవత్తనయస్య సర్వం సేహే మహాన్మహితయా కుమతేరఘం మే

ఒక పక్క అతన్ని పరమాత్మ అంటూ, ఇంకో పక్క మహానుభావుడు అంటూ, రక్షకుడూ అంటున్నాం. వ్యవహారంలో ఆయనెప్పుడు నేను భగవంతున్ని అని వివక్ష చూపలేదు
కలిసి పడుకున్నాం భుజించాము ఆటలాడాము, (వికత్థన - నేను అర్జనున్ని అని గర్వించినపుడు), కూర్చున్నప్పుడు, మిత్రమా అని మాట్లాడాడు, మాట్లాడి మోసగించాడు (విప్రలబ్ధః). ఎన్నో సార్లు నా గర్వాన్ని ప్రకటించాను, దాన్ని కూడా ఆమోదించాడు (ఋతవానితి) అమోదించి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయతించాడు - ఒక తండ్రి కొడుకు తప్పుని, మిత్రుడు మిత్రుని తప్పును ఏ విధంగా సహిస్తారో అలా నా అపరాధాలు సహించాడు.
మహాన్మహితయా కుమతేరఘం మే - నేను మహా పాపం చేసాను. నేను గోపాలక పశుపాలక యాదవా అని పిలిచాను. హీనంగా మాట్లాడాను హీనంగా చూచాను. ఇవన్ని తండ్రిలాగ భరించి మిత్రుడిలాగ సహించాడు.

సోऽహం నృపేన్ద్ర రహితః పురుషోత్తమేన సఖ్యా ప్రియేణ సుహృదా హృదయేన శూన్యః
అధ్వన్యురుక్రమపరిగ్రహమఙ్గ రక్షన్గోపైరసద్భిరబలేవ వినిర్జితోऽస్మి

ఇప్పుడు ఆ పురుషోత్తమునితో వియోగాన్ని పొందాను. మిత్రుడు లేడు ప్రియుడు లేడు సుహృత్తూ లేడు. అంతెందుకు నా హృదయమే లేదు. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఆయాన నన్ను పిలిచి "ఒక్క నా భవనం తప్ప మిగతా అంతా సముద్రం ముంచి వేస్తుంది, వజ్రునికి పట్టభిషేకం చేయి, నా పరివారాన్ని నీవు వెంట తీసుకుని వెళ్ళు, నీవే వారికి రక్షకుడివి" అన్నాడు. ఆ స్త్రీ పరివారాన్ని తీసుకుని వెళ్తుంటే ఒక గొల్ల పిల్లవాడు చిన్న కట్టెతో నన్ను చాలా దూరం పారగొట్టాడు. గొల్ల పిల్లవాడితో ఓడిపోయాను. అప్పుడు గుర్తుకొచ్చింది ఈ గొల్లపిల్లవాడు లేడు అని. అప్పుడు జ్ఞ్యాపకం వచ్చింది నా తేజస్సు ఏమిటొ. ఇప్పుడు నా హృదయమే లేదు. దుర్మార్గులైన గోపబాలుని చేతిలో స్త్రీ వలే ఓడిపోయాను (అధ్వన్యురుక్రమపరిగ్రహమఙ్గ రక్షన్గోపైరసద్భిరబలేవ వినిర్జితోऽస్మి)

తద్వై ధనుస్త ఇషవః స రథో హయాస్తే సోऽహం రథీ నృపతయో యత ఆనమన్తి
సర్వం క్షణేన తదభూదసదీశరిక్తం భస్మన్హుతం కుహకరాద్ధమివోప్తమూష్యామ్

అదే ధనసు అదే గాండీవం పాశుపాశాస్త్రం, అదే బాణాలు అదే రథం అవే గుఋఋఆలు - నేనూ మారలేదు,ఎవరిని చూసి సకలలోక రాజు తల వచుతారో నేను మారలేదు. క్షణంలో అంతా లేనట్లుగా అయ్యింది ఎందువాలంటే కృష్ణుడు అక్కడ లేకపోవడం వల్ల (ఈశరిక్తం)
భస్మన్హుతం కుహకరాద్ధమివోప్తమూష్యామ్ - చవట నేలలో నాటిన విత్తనంలాగ. అదంతా రిక్తమయిపోయింది

రాజంస్త్వయానుపృష్టానాం సుహృదాం నః సుహృత్పురే
విప్రశాపవిమూఢానాం నిఘ్నతాం ముష్టిభిర్మిథః

నీవడిగిన వారందరు బ్రాహ్మణ శాపంతో ఒకరిని ఒకరు ముష్ఠిఘాతాలతో కొట్టుకున్నారు.

వారుణీం మదిరాం పీత్వా మదోన్మథితచేతసామ్
అజానతామివాన్యోన్యం చతుఃపఞ్చావశేషితాః

ఇంత పెద్ద యాదవ సైన్యం మద్యపానం చేసి ఆ మదంలో తన వారిని ఎదుటివారిని తేడా లేకుండా ఒకరినొకరు తెలియని వారిలా కొట్టుకున్నారు. నలుగురో అయిదుగురో మిగిలారు.(ఉద్దవుడు వజర్కుడు దారుకుడు...)

ప్రాయేణైతద్భగవత ఈశ్వరస్య విచేష్టితమ్
మిథో నిఘ్నన్తి భూతాని భావయన్తి చ యన్మిథః

ఎంత మద్యపానం చేసినా కొందరికైన బుధ్ధి పనిచెయలి కదా? అందరికీ లేకుండా పోయింది అంటే ఇది స్వామి సంకల్పం
ఆ పరమాతం సంకల్పంతోటే ఒకరినోకరు కొట్టుకుంటారు కలుసుకుంటారు.

జలౌకసాం జలే యద్వన్మహాన్తోऽదన్త్యణీయసః
దుర్బలాన్బలినో రాజన్మహాన్తో బలినో మిథః

నీళ్ళల్లోని చేపలు - చిన చేపలను పెద చేపలు తింటాయి. చేపలు భక్షింపబడినట్లుగా భక్షింపబడ్డారు

ఏవం బలిష్ఠైర్యదుభిర్మహద్భిరితరాన్విభుః
యదూన్యదుభిరన్యోన్యం భూభారాన్సఞ్జహార హ

ఇప్పుడు అనిపిస్తోంది అంత బాలాడ్యులైన యాదవులు అలాగే ఉంటే వారిని ఎవరు సమ్హరిస్తారు. కౌరవ బలానికి రెట్టింపు యాదవ బలం. స్వామి రక్షకుడు గా ఉండటం వలన వారిని ఎవరు నిర్మూలిస్తారు? ముల్లుని ముల్లుతో తీసి రెండు మూళ్ళనూ పారేసినట్లుగా.
అలాగే పరమాత్మ కూడా శరీరం దాల్చిన అధర్మాలను తీయడానికి వచ్చి ఆయన శరీరాన్ని కూడా చివరకు ఉపసమ్హరించుకున్న్నాడు

దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమాని చ
హరన్తి స్మరతశ్చిత్తం గోవిన్దాభిహితాని మే

ఆయా సమయాలలో సందర్భాలలో స్వామి అన్న మాటాలు ఇంకా జ్ఞ్యాపకం వస్తున్న్నాయి.

సూత ఉవాచ
ఏవం చిన్తయతో జిష్ణోః కృష్ణపాదసరోరుహమ్
సౌహార్దేనాతిగాఢేన శాన్తాసీద్విమలా మతిః

ఇలా పరిపైస్తూ ఆక్రోశిస్తూ బాధపడి ఆ పరమాత్మ కృపతోటే మనసు ప్రశాంతమయ్యింది. పరమాత్మ పాదాలను స్మరిస్తున్న అర్జనునికి మనసు శాంతించింది.

వాసుదేవాఙ్ఘ్ర్యనుధ్యాన పరిబృంహితరంహసా
భక్త్యా నిర్మథితాశేష కషాయధిషణోऽర్జునః

ఒక్కసారి తమ పుట్టుక నుంచీ ఇప్పటి వరకూ కృష్ణుడు చేసిన సహాయాలను ప్రేమను తలుచుకోవడం వల్ల ఆయన ధ్యానం వలన పెరిగిన భక్తితో బుధ్ధిలో ఉన్న అన్ని మురుకులూ కడిగివేయబడ్డాయి. పరమాత్మ పాదాలను స్మరించడంవలన బుధ్ధి నిర్మలం అయింది.

గీతం భగవతా జ్ఞానం యత్తత్సఙ్గ్రామమూర్ధని
కాలకర్మతమోరుద్ధం పునరధ్యగమత్ప్రభుః

పరమాత్మని గూర్చి ఇంతగా స్మరించుకుని బాధపడుతున్న అర్జనునికి యుధ్ధరంగంలో ఉపదేశించిన గానం చేసిన గీతా వాక్యం స్మరణకు వచ్చింది. ఇంత కాలం, కాలన్ని బట్టి కాలం వలన చేసిన కర్మలబట్టి దుఖాన్ని బట్టి అజ్ఞ్యానాన్ని బట్టి అణచివేయబడిన జ్ఞ్యానం స్పురణకి వచ్చింది.


విశోకో బ్రహ్మసమ్పత్త్యా సఞ్ఛిన్నద్వైతసంశయః
లీనప్రకృతినైర్గుణ్యాదలిఙ్గత్వాదసమ్భవః

బ్రహ్మసంపత్తితోటి దు:ఖాన్ని పోగొట్టుకున్నాడు. దాని వలన ద్వైత భావన పోయింది, (విశిష్ట)అద్వైతం గుర్తుకు వచ్చింది.
ప్ర్కృతిలో ఉన్న అన్ని గుణాలతో ఏర్పడిన ప్రపంచాన్ని మరచిపోవాలంటే ఆ గుణాలను ఎలా ప్రకృతిలో లీనం చేయాలో అలాగే అర్జనుడు కూడా దేహం మనసు బుధ్ధి చిత్తం అంత:కరణం అనే వాటిని పరమాత్మలో లీనం చేసాడు. నేను వేరు కృష్ణుడు వేరు అనే భావం అంతరించి , స్వరూప జ్ఞ్యానం కలిగింది

నిశమ్య భగవన్మార్గం సంస్థాం యదుకులస్య చ
స్వఃపథాయ మతిం చక్రే నిభృతాత్మా యుధిష్ఠిరః

పరమాత్మ వెళ్ళిన దారిని విన్న ధర్మరాజు నారదుని మాటలు గుర్తుచేసుకుని తాను కూడా బలయ్దేరడానికి సిద్దపడాడు.

పృథాప్యనుశ్రుత్య ధనఞ్జయోదితం నాశం యదూనాం భగవద్గతిం చ తామ్
ఏకాన్తభక్త్యా భగవత్యధోక్షజే నివేశితాత్మోపరరామ సంసృతేః

 కుంతి కూడా అర్జనుని మాటలు విని ఆ మహానుభావురాలు (ఏకాన్తభక్త్యా భగవత్యధోక్షజే ) అలాంటి పరమాత్మ మీద ఏకాంత భక్తితో యోగమార్గంలొ పరమాత్మలో ప్రవేశించింది
తల్లి ముందర పిల్లలను పంపడం మంచి కాదు కాబట్టి ముందు తల్లినే పంపారు.

యయాహరద్భువో భారం తాం తనుం విజహావజః
కణ్టకం కణ్టకేనేవ ద్వయం చాపీశితుః సమమ్

ఏ శరీరంతో భూభారాన్ని తగ్గించడానికి వచ్చాడో ఆ శరీరాన్ని ముల్లుని తీసిన తరువాత ఎలా ఐతే సహాయపడిన ముల్లుని కూడా పడేస్తామొ అలా

యథా మత్స్యాదిరూపాణి ధత్తే జహ్యాద్యథా నటః
భూభారః క్షపితో యేనజహౌ తచ్చ కలేవరమ్

నటుడు నాటకం వేసినపుడు, మత్స్య కూర్మ వరాహ అనే వేషం వేసిన తరువాత నాటంపూర్తి అయినాక ఆ వేషాన్ని వదిలిపెట్టినట్లు పరమాత్మ తెచ్చుకున్న రూపాన్ని దాని అవసరం తీరగానే వదిలిపెట్టాడు

యదా ముకున్దో భగవానిమాం మహీం జహౌ స్వతన్వా శ్రవణీయసత్కథః
తదాహరేవాప్రతిబుద్ధచేతసామభద్రహేతుః కలిరన్వవర్తత

ఎప్పుడైతే పరమాత్మ ఈ భూమి మీద తన దేహాన్ని విడిచిపెట్టాడొ, అదే అదనుగా కాచుకుని ఉన్న కలిపురుషుడు ఆ పూటే (ఒక పూట కూడా ఆగకుండా), వికసించని మనసులో అధర్మం కలిగించడానికి కారణమైన కలి అనుసరించాడు

యుధిష్ఠిరస్తత్పరిసర్పణం బుధః పురే చ రాష్ట్రే చ గృహే తథాత్మని
విభావ్య లోభానృతజిహ్మహింసనాద్యధర్మచక్రం గమనాయ పర్యధాత్

ధర్మ రాజు తన రాజ్యం లో కి కలి ప్రవేశించి సంచరించాడని జ్ఞ్యాని కాబట్టి తెలుస్కున్న అడు. తన పురంలో తన రాష్ట్రంలో తన ఇంటిలో చివరికి తనలో కూడా కలి ప్రవేశించాడని తెలుసుకొని. లోభం అబద్దం. కపటం, హింస (లోభానృతజిహ్మహింస) ఈ నాలుగు వచ్చాయని తెలుసుకున్నాడు. ఇంక ప్రస్థానం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు (గమనాయ పర్యధాత్)

స్వరాట్పౌత్రం వినయినమాత్మనః సుసమం గుణైః
తోయనీవ్యాః పతిం భూమేరభ్యషిఞ్చద్గజాహ్వయే
మథురాయాం తథా వజ్రం శూరసేనపతిం తతః
ప్రాజాపత్యాం నిరూప్యేష్టిమగ్నీనపిబదీశ్వరః

తన మన్వడైన పరీక్షిత్తుని, తన గుణాలతో సమానమైన గుణాలు కలిగినవాడిని అభిషేకించి. మధురకు వజ్రున్ని (సాంబుని కుమారుడు) రాజు గా చేసి.
వెళ్ళేముందు ప్రాజాపత్య హోమం చేసి ఆ అగ్నిని తనలో ఆవాహన చేసుకున్నాడు.

విసృజ్య తత్ర తత్సర్వం దుకూలవలయాదికమ్
నిర్మమో నిరహఙ్కారః సఞ్ఛిన్నాశేషబన్ధనః

పట్టు వస్త్రాలు అన్నీ వదిలిపెట్టి, మమకారంలేకుండా (నిర్మమో ) అహంకారం లేకుండా అన్ని బంధనాలను తెంచుకుని.

వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తమ్
మృత్యావపానం సోత్సర్గం తం పఞ్చత్వే హ్యజోహవీత్
త్రిత్వే హుత్వా చ పఞ్చత్వం తచ్చైకత్వే ఞ్జుహోన్మునిః
సర్వమాత్మన్యజుహవీద్బ్రహ్మణ్యాత్మానమవ్యయే

వాచం జుహావ మనసి - వాక్కును మనసులో నియమించాడు. ఆ  మనసును ప్రాణంలో ఉంచాడు
ఆ ప్రాణమును అపానంలో . అపానమును ఉదానంలో, ఉదానం వ్యానంలో, , అలా పంచ ప్రాణములను మూటిలో (త్రిగుణాల్లో) ఉంచి (సత్వం రజసు తమసు - ప్రకృతి - ఆత్మ), సర్వాన్ని ఆత్మలో ఉంచి ఆ ఆత్మను పరమాత్మలో ఉంచాడు

చీరవాసా నిరాహారో బద్ధవాఙ్ముక్తమూర్ధజః
దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్తపిశాచవత్
అనవేక్షమాణో నిరగాదశృణ్వన్బధిరో యథా
ఉదీచీం ప్రవివేశాశాం గతపూర్వాం మహాత్మభిః
హృది బ్రహ్మ పరం ధ్యాయన్నావర్తేత యతో గతః

నార వస్త్రాలు కట్టుకుని వాక్కుని మానివేసి వెంట్రుకలు ముడివేసుకోకుండా జడుడిలాగ, ఉన్మత్తునిలాగ తల వంచుకుని దిక్కులు చూడకుండా నడుచుకుంటూ పోయాడు. దేవతలతో కూడా సేవింపబడిన వాడు ఇలా అయ్యాడు
దేన్ని కోరకుండా ఎవరు ఏమి మాట్లాడుతున్న వినకుండా చూడకుండా ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. పరమాత్మను మళ్ళీ ధ్యానిస్తూ ఎక్కడికిపోతే మాల్లీ రారో అక్కడికే వెళ్ళాడు

సర్వే తమనునిర్జగ్ముర్భ్రాతరః కృతనిశ్చయాః
కలినాధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టాః ప్రజా భువి

మిగతా వారు కూడా నిశ్చయంగా అతనిని అనుసరించాడు. కలి పురుషుడు ప్రజలని తాకడంతో వారు వెళ్ళిపోయారు

తే సాధుకృతసర్వార్థా జ్ఞాత్వాత్యన్తికమాత్మనః
మనసా ధారయామాసుర్వైకుణ్ఠచరణామ్బుజమ్

తద్ధ్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధధిషణాః పరే
తస్మిన్నారాయణపదే ఏకాన్తమతయో గతిమ్


అవాపుర్దురవాపాం తే అసద్భిర్విషయాత్మభిః
విధూతకల్మషా స్థానం విరజేనాత్మనైవ హి

అన్నీ మంచి పనులు చేసారు కాబట్టి, ఆత్మ తత్వం తెలిసినవారు కాబట్టి పరమాత్మను పాదపద్మాలను ధ్యానిస్తూ పరిశుద్దమైన భక్తితో బుధ్ధి సుద్దమైంది. ఆయన యందు ఏకాంత బుధ్ధితో విషయములను కోరే దుర్జనులు పొందరాని స్థానాన్ని వారు పొందారు


విదురోऽపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః
కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ

ఇది తెలుస్కుని ప్రభాస తీర్థంలో కృష్ణుని యందు మనసు లగ్నం చేసి తన ఇంటికి వెళ్ళాడు (యమ లోకం)

ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతామ్
వాసుదేవే భగవతి హ్యేకాన్తమతిరాప తమ్

భర్తల ఆ వైరాగ్యాన్ని చూచిన ద్రౌపతి కృష్ణుని యందు మనసు లగ్నం చేసి భగవంతునే పొందింది

యః శ్రద్ధయైతద్భగవత్ప్రియాణాం పాణ్డోః సుతానామితి సమ్ప్రయాణమ్
శృణోత్యలం స్వస్త్యయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిముపైతి సిద్ధిమ్

సకల శుభాలకు మూలం (స్వస్త్యయనం ) అయిన భగవత్ప్రియులైన పాండు పుత్రుల ఈ మోక్ష మార్గాన్ని శ్రద్దతో విన్నవారు పరమాత్మ యందు భక్తినీ సిధ్ధినీ పొందుతారు

                                                          సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదునాల్గవ అధ్యాయం

సూత ఉవాచ
సమ్ప్రస్థితే ద్వారకాయాంజిష్ణౌ బన్ధుదిదృక్షయా
జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్
వ్యతీతాః కతిచిన్మాసాస్తదా నాయాత్తతోऽర్జునః
దదర్శ ఘోరరూపాణి నిమిత్తాని కురూద్వహః

అర్జనుడు ద్వారకకు వెళ్ళాడు బంధువులని చూడటానికి (బన్ధుదిదృక్షయా).
అనీ దుశ్శకునములు కలిగాయి.

కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తర్తుధర్మిణః
పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభానృతాత్మనామ్

కాలగతి మారింది. మానవుల మనసులో పాపబుధ్ధి కలుగుతోంది. కృఒధం లోభం అసత్యం పెరిగింది.

జిహ్మప్రాయం వ్యవహృతం శాఠ్యమిశ్రం చ సౌహృదమ్
పితృమాతృసుహృద్భ్రాతృదమ్పతీనాం చ కల్కనమ్

ప్రతీ వ్యవహారం కపటంతోనే (జిహ్మ) నడుస్తోంది. ప్రతీ స్నేహం మోసంతో కూడి ఉన్నది.
తల్లితండ్రులతోటి మిత్రులు సోదరులతోటి కలహించేవారు ఎక్కువ అయ్యారు.

నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వనుగతే నృణామ్
లోభాద్యధర్మప్రకృతిం దృష్ట్వోవాచానుజం నృపః

ఈ నిమిత్తాలు చూచి భీమునితో ధర్మరాజు

యుధిష్ఠిర ఉవాచ
సమ్ప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బన్ధుదిదృక్షయాజ్
ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్

బంధువులను చూడాలనే కోరికతో అర్జనుడు ద్వారకకు పంపబడ్డాడు కదా. కృష్ణపరమాత్మ ఏమి చేస్తున్నాడో తెలియబడిందనే అనుకుంటున్నాను.

గతాః సప్తాధునా మాసా భీమసేన తవానుజః
నాయాతి కస్య వా హేతోర్నాహం వేదేదమఞ్జసా

ఏడు నెలలు అయిన ఇంకా వారు రాలేదు. నేనీ విషయాన్ని తెలియలేకపోతున్నాను

అపి దేవర్షిణాదిష్టః స కాలోऽయముపస్థితః
యదాత్మనోऽఙ్గమాక్రీడం భగవానుత్సిసృక్షతి

నారదుడు కాలం వచ్చింది అన్నాడు. కృష్ణపరమాత్మ అవతారం చాలించాక మీరూ వెళ్ళండి అని చెప్పాడు. ఆ కాలం వచ్చిందా?
లీలకోసం క్రీడ కోసం ఈ భూలోకానికి తీసుకొచ్చిన శరీరం వదిలిపెట్టాలనుకుంటున్నాడా

యస్మాన్నః సమ్పదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః
ఆసన్సపత్నవిజయో లోకాశ్చ యదనుగ్రహాత్

మనం అంటూ ఉన్నాం అంటే అది ఆయన వల్ల. (సమ్పదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః)
శతృవిజయం కూడా ఆయన కటాక్షమే (ఆసన్సపత్నవిజయో ).

పశ్యోత్పాతాన్నరవ్యాఘ్ర దివ్యాన్భౌమాన్సదైహికాన్
దారుణాన్శంసతోऽదూరాద్భయం నో బుద్ధిమోహనమ్

ఎందుకు భయపడుతున్నానంటే ఆకాశంలో భూమిమీద శరీరం మీద ఉత్పాతాలు కనపడుతున్నాయి
ఇవన్నీ కలిపి త్వరలోనే (అదూరాత్)

ఊర్వక్షిబాహవో మహ్యం స్ఫురన్త్యఙ్గ పునః పునః
వేపథుశ్చాపి హృదయే ఆరాద్దాస్యన్తి విప్రియమ్

(ఎడమ) తొడ భుజము కన్నులు మాటిమాటికీ అదురుతున్నాయి. అనుకోకుండా హృదయంలో దడ పుడుతోంది.

శివైషోద్యన్తమాదిత్యమభిరౌత్యనలాననా
మామఙ్గ సారమేయోऽయమభిరేభత్యభీరువత్

శివ ఏష ఉద్యన్తం ఆదిత్యమభిరౌతి - ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నక్కలు అరుస్తున్నాయి
కుక్క కూడా నాకెదురుగా ఉండి అశ్లీలంగా ప్రవర్తిస్తోంది.

శస్తాః కుర్వన్తి మాం సవ్యం దక్షిణం పశవోऽపరే
వాహాంశ్చ పురుషవ్యాఘ్ర లక్షయే రుదతో మమ

పాల గరుడ పక్షులు దర్శనమిస్తే పని జరుగుతుంది. మిగిలిన పక్షులు ఎడమనుంచి కుడికి వెళ్ళాలి (తీర్చి కట్టుట) కుడి నుంచి ఎడమకు వెళ్ళడం మంచి శకునం కాదు (కట్టి తీర్చుట),
పశువులు పక్షులు నన్ను ఎడమకు చేసి కుడికి వెళ్తున్నాయి.
ఏనుగులు అశ్వములు ఏడుస్తున్నాయి.

మృత్యుదూతః కపోతోऽయములూకః కమ్పయన్మనః
ప్రత్యులూకశ్చ కుహ్వానైర్విశ్వం వై శూన్యమిచ్ఛతః

పావురం గుడ్లగూబ - ఈ రెండూ మృత్యు దూతలు. (వాటిని పొద్దున్నే చూస్తే వంద పాపాలు చేస్తారని ఉక్తి). అవి వినపడుతున్నాయి. నిద్రపోకుండా అవి అరుస్తున్నాయి. అంటే ప్రపంచం త్వరలో శూన్యం కాబోతోంది

ధూమ్రా దిశః పరిధయః కమ్పతే భూః సహాద్రిభిః
నిర్ఘాతశ్చ మహాంస్తాత సాకం చ స్తనయిత్నుభిః

సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టు పరివేశం (వరదగూడు )అకారణంగా వస్తున్నాయి.
భూమి పర్వతాలతో సహా కదులుతోంది మేఘంలేకుండా ఉరుములూ మెరుపులూ వస్తున్నాయి

వాయుర్వాతి ఖరస్పర్శో రజసా విసృజంస్తమః
అసృగ్వర్షన్తి జలదా బీభత్సమివ సర్వతః

ఖరకు గాలి వీస్తోంది. అందరి కళ్ళల్లో దుమ్ము పడుతోంది. మేఘాలు నెత్తురువానను కురిపిస్తున్నాయి

సూర్యం హతప్రభం పశ్య గ్రహమర్దం మిథో దివి
ససఙ్కులైర్భూతగణైర్జ్వలితే ఇవ రోదసీ

సూర్యుడు కాంతి హీనుడయ్యాడు. ఆకాశంలో గ్రహ యుధ్ధాలవుతున్నాయి. (సూర్యుని పరిధిలో బుధుడు తప్ప ఏ గ్రహం ఉన్నా అది అస్తవ్యస్తమే)
అన్ని భూతములు ఆకాశంలో కొట్లాడుతున్నట్లుగా ఉంది

నద్యో నదాశ్చ క్షుభితాః సరాంసి చ మనాంసి చ
న జ్వలత్యగ్నిరాజ్యేన కాలోऽయం కిం విధాస్యతి

నదులు నదములు క్షోభిస్తున్నాయి. సరసులు మన్సులు కల్లోలం అవుతున్నాయి
నెయ్యిపోస్తున్నా అగ్ని మండటంలేదు. ఈ కాలం ఏమి చేయడానికి వచ్చిందో

న పిబన్తి స్తనం వత్సా న దుహ్యన్తి చ మాతరః
రుదన్త్యశ్రుముఖా గావో న హృష్యన్త్యృషభా వ్రజే

దూడలు పాలు తాగడంలేదు తల్లులు పాలు ఇవ్వడం లేదు
ఆవులు కన్నీరుపెట్టుకుంటున్నాయి, దూడలుమందలో తిరగడంలేదు

దైవతాని రుదన్తీవ స్విద్యన్తి హ్యుచ్చలన్తి చ
ఇమే జనపదా గ్రామాః పురోద్యానాకరాశ్రమాః
భ్రష్టశ్రియో నిరానన్దాః కిమఘం దర్శయన్తి నః

విగ్రహాలనుండి కూడ చెమట వస్తోంది. కంటిమీద నీరు వస్తోంది.
ఆరామాలు ఉద్యానాలు అన్ని వినోదాలు కలిగించే ప్రదేశాలు శోభావిహీనాలు అయ్యాయి.
సంపద పోయింది ఆనందంలేకుండా అయింది. ఏదో మహా ఉత్పాతాన్నే చూపేట్లు ఉంది.

మన్య ఏతైర్మహోత్పాతైర్నూనం భగవతః పదైః
అనన్యపురుషశ్రీభిర్హీనా భూర్హతసౌభగా

పొరబాటున భూమికి భగవంతుని పాద వియోగం కలిగిందా?

ఇతి చిన్తయతస్తస్య దృష్టారిష్టేన చేతసా
రాజ్ఞః ప్రత్యాగమద్బ్రహ్మన్యదుపుర్యాః కపిధ్వజః

ఇలా ఉండగా అర్జనుడు వచ్చాడు.

తం పాదయోర్నిపతితమయథాపూర్వమాతురమ్
అధోవదనమబ్బిన్దూన్సృజన్తం నయనాబ్జయోః

ఇంతటి బాధతో ఉన్న అర్జనున్ని ధర్మరాజు ఇంతవరకూ చూడలేదు. తల కిందకు వచి కంటి నీరు కారుస్తూ ఉన్నాడు.

విలోక్యోద్విగ్నహృదయో విచ్ఛాయమనుజం నృపః
పృచ్ఛతి స్మ సుహృన్మధ్యే సంస్మరన్నారదేరితమ్

నారదుడు చెప్పిన దాన్ని తలచుకుంటూ అర్జనున్ని అడిగాడు

యుధిష్ఠిర ఉవాచ
కచ్చిదానర్తపుర్యాం నః స్వజనాః సుఖమాసతే
మధుభోజదశార్హార్హ సాత్వతాన్ధకవృష్ణయః

ద్వారకలో ఉన్నవారందరు బాగున్నార

శూరో మాతామహః కచ్చిత్స్వస్త్యాస్తే వాథ మారిషః
మాతులః సానుజః కచ్చిత్కుశల్యానకదున్దుభిః

మా మేనమామ (వసుదేవుడు) క్షేమంగా ఉన్నారా.

సప్త స్వసారస్తత్పత్న్యో మాతులాన్యః సహాత్మజాః
ఆసతే సస్నుషాః క్షేమందేవకీప్రముఖాః స్వయమ్

మేనమామ గారి భార్యలందరూ బాగున్నారా

కచ్చిద్రాజాహుకో జీవత్యసత్పుత్రోऽస్య చానుజః
హృదీకః ససుతోऽక్రూరో జయన్తగదసారణాః

ఆహుకుడు బాగున్నాడా (ఉగ్రసేనుడి అన్న). దుష్టపుత్రుడు ఉన్నవాడి తమ్ముడు బాగున్నాడా (ఉగ్రసేనుడు )
మన బంధువులందరూ బాగున్నారా.

ఆసతే కుశలం కచ్చిద్యే చ శత్రుజిదాదయః
కచ్చిదాస్తే సుఖం రామో భగవాన్సాత్వతాం ప్రభుః

బలరాముడు బాగున్నాడా. భగవానుడైన కృష్ణుడు బాగున్నాడా

ప్రద్యుమ్నః సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథః
గమ్భీరరయోऽనిరుద్ధో వర్ధతే భగవానుత
సుషేణశ్చారుదేష్ణశ్చ సామ్బో జామ్బవతీసుతః
అన్యే చ కార్ష్ణిప్రవరాః సపుత్రా ఋషభాదయః

కృష్ణ సంతానమంతా బాగున్నారా

తథైవానుచరాః శౌరేః శ్రుతదేవోద్ధవాదయః
సునన్దనన్దశీర్షణ్యా యే చాన్యే సాత్వతర్షభాః
అపి స్వస్త్యాసతే సర్వే రామకృష్ణభుజాశ్రయాః
అపి స్మరన్తి కుశలమస్మాకం బద్ధసౌహృదాః

కృష్ణుని మిత్రవర్గం బాగున్నారా
బాగున్న వారు మనని గుర్తుచేసుకుంటున్నారా

భగవానపి గోవిన్దో బ్రహ్మణ్యో భక్తవత్సలః
కచ్చిత్పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్వృతః

బ్రాహ్మణ ప్రియ్డు అయిన భగవంతుడు బాగున్నాడా. సుధర్మ సభలో ఆయన క్షేమంగా ఉన్నాడా

మఙ్గలాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ
ఆస్తే యదుకులామ్భోధావాద్యోऽనన్తసఖః పుమాన్

ఆయన వచ్చింది లోకాలకి మంగళం కలగడానికి. లోకానికి కవల్సినవి ఇచ్చి వాటిని కాపాడటానికి
ఈయన యాదవ కుల సముద్రంలో చంద్రుడిలా అనంతునితో అవతరించాడు.

యద్బాహుదణ్డగుప్తాయాం స్వపుర్యాం యదవోऽర్చితాః
క్రీడన్తి పరమానన్దం మహాపౌరుషికా ఇవ

మహా వీరుల్లాగ యాదవులందరూ వారి వారి ఇళ్ళల్లో నిర్భయంగా ఉన్నారు

యత్పాదశుశ్రూషణముఖ్యకర్మణా సత్యాదయో ద్వ్యష్టసహస్రయోషితః
నిర్జిత్య సఙ్ఖ్యే త్రిదశాంస్తదాశిషో హరన్తి వజ్రాయుధవల్లభోచితాః

ఏ మహానుభావుని పాదములని ఆశ్రయించడం వల్ల మహారాజులు సార్వభౌమాధికారాని పొందారో, సత్య్భామాది భార్యలు ఇంద్రలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారో

యద్బాహుదణ్డాభ్యుదయానుజీవినో యదుప్రవీరా హ్యకుతోభయా ముహుః
అధిక్రమన్త్యఙ్ఘ్రిభిరాహృతాం బలాత్సభాం సుధర్మాం సురసత్తమోచితామ్

ఎవరి బాహు బలాన్ని ఆశ్రయించిన్ యాదవులంతా ఎక్కడినుంచీ బయం లేకుండా ఉన్నారు
ఇంద్రుడి సభలో దేవతలు అధిరోహించడానికి అనువైన సుధర్మ అనే సభామండపాన్ని కాళ్ళతో హస్తములతో స్పృశిస్తూ ఆసీనులై సభని నిర్వహిస్తున్నారు. ఆ సుధర్మ కృష్ణునివల్లే వచ్చింది

కచ్చిత్తేऽనామయం తాత భ్రష్టతేజా విభాసి మే
అలబ్ధమానోऽవజ్ఞాతః కిం వా తాత చిరోషితః

నువ్వు బాగున్నావా. నీ ముఖం కాంతి విహీనమయింది.
చిన్నబోయి వచ్చావంటే అతి పరిచయం వల్ల వారు నిన్ను సరిగా చూచుకోలేదా

కచ్చిన్నాభిహతోऽభావైః శబ్దాదిభిరమఙ్గలైః
న దత్తముక్తమర్థిభ్య ఆశయా యత్ప్రతిశ్రుతమ్

కావలసిన విషయములని అందుకోలేదా. చెప్పకూడని అనుకోకూడని విషయాలయందు మనసు పెట్టావా. వినకూడని దాన్ని విన్నప్పుడు, తినకూడని దాన్ని తిన్నప్పుడు, చూడకూడని దాన్ని చూచినపుడు మనసు చిన్నబోతుంది. మనప్రమేయం లేకుండా ఇలాంటి విషయం మనకి అనుభవింపచేసాడంటే దానికి మనం చేసిన ఏ పాపం కారణమో అని అర్థం. అధర్మం ఆచరించే దగ్గర గాని, అధర్మం ఎక్కువగా ఉన్నపుడు గాని మన పుట్టుక ఉంటే మనం పాపం చేసిన వాళ్ళమే. ఇలాంటివి విన్నప్పుడో చూచినప్పుడో తిన్నప్పుడో పరమాత్మ నామాలని తలుచుకోవాలి
ఎమైనా ఇస్తానని చెప్పి ఇవ్వలేదా? వారి మనసులో ఆశ కల్పించి నీవు ఇవ్వలేదా?

కచ్చిత్త్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియమ్
శరణోపసృతం సత్త్వం నాత్యాక్షీః శరణప్రదః

అభయాన్ని ఇవ్వవలసిన నీవు - బ్రాహ్మణులకు బాలురకు గోవుని వృధ్ధున్ని రోగిష్టిని స్త్రీలను. వీరు శరణు కోరితే ఇవ్వలేదా

కచ్చిత్త్వం నాగమోऽగమ్యాం గమ్యాం వాసత్కృతాం స్త్రియమ్
పరాజితో వాథ భవాన్నోత్తమైర్నాసమైః పథి

పొందకూడని స్త్రీని వదిలిపెట్టావా. పొందవలసిన స్త్రీని వదిలిపెట్టావా
పొరబాటున దారిలో వస్తుంటే నీకన్నా తక్కువ వారితో ఓడిపోయావా

అపి స్విత్పర్యభుఙ్క్థాస్త్వం సమ్భోజ్యాన్వృద్ధబాలకాన్
జుగుప్సితం కర్మ కిఞ్చిత్కృతవాన్న యదక్షమమ్

తినవలసిన వృధ్ధులు పిల్లలు ఉండగా వారిని వదిలిపెట్టి తిన్నావా. ఆకలిగొన్న వారు ఉండగా వరిని వదిలి నీవు తిన్నావా. ద్వారంలో అథితి ఉండగా ఆపోశనం, నీరు తాగితే అది మద్యంతో సమానం.
పది మందీ అసహ్యించుకునే పని నీవు చేయదగని పనినీ చేసావా

కచ్చిత్ప్రేష్ఠతమేనాథ హృదయేనాత్మబన్ధునా
శూన్యోऽస్మి రహితో నిత్యం మన్యసే తేऽన్యథా న రుక్

నీకు బాగా ఇష్టమైన (ప్రేష్ఠతముడు ) వారితో ఎడబాటు పొందావా. ఇలాంటిదేదో లేకుంటే నీకు ఇల్లంటి బాధ కలగదు

Monday, November 26, 2012

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదమూడవ అధ్యాయం

సూత ఉవాచ
విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిమ్
జ్ఞాత్వాగాద్ధాస్తినపురం తయావాప్తవివిత్సితః

విదురుడు మైత్రేయుని వలన జరిగినదంతా తెలుసుకొని మిగతా విషయాలు తెలుస్కోవడానికి హస్తినాపురానికి వెళ్ళాడు

యావతః కృతవాన్ప్రశ్నాన్క్షత్తా కౌషారవాగ్రతః
జాతైకభక్తిర్గోవిన్దే తేభ్యశ్చోపరరామ హ

విదురుడు తనకెదురైన మైత్రేయున్ని ఎన్నో ప్రశ్నలు అడిగాడు.
కృష్ణపరమాత్మ మీద భక్తి ఉన్నవాడు కాబట్టి కృష్ణ నిర్యానం గురించి చెప్పలేదు

తం బన్ధుమాగతం దృష్ట్వా ధర్మపుత్రః సహానుజః
ధృతరాష్ట్రో యుయుత్సుశ్చ సూతః శారద్వతః పృథా
గాన్ధారీ ద్రౌపదీ బ్రహ్మన్సుభద్రా చోత్తరా కృపీ
అన్యాశ్చ జామయః పాణ్డోర్జ్ఞాతయః ససుతాః స్త్రియః
ప్రత్యుజ్జగ్ముః ప్రహర్షేణ ప్రాణం తన్వ ఇవాగతమ్
అభిసఙ్గమ్య విధివత్పరిష్వఙ్గాభివాదనైః

ధర్మరాజు అందరితో కలిసి విదురున్ని ఎదుర్కొన్నారు

ముముచుః ప్రేమబాష్పౌఘం విరహౌత్కణ్ఠ్యకాతరాః
రాజా తమర్హయాం చక్రే కృతాసనపరిగ్రహమ్

ఇంతకాలం విరహం వలన వచ్చిన దుఖాన్ని విడిచిపెట్టారు. విదురుడు భోజనంచేసి విశ్రమించాక

తం భుక్తవన్తం విశ్రాన్తమాసీనం సుఖమాసనే
ప్రశ్రయావనతో రాజా ప్రాహ తేషాం చ శృణ్వతామ్

అందరూ వింటుండగా అడిగాడు

యుధిష్ఠిర ఉవాచ
అపి స్మరథ నో యుష్మత్పక్షచ్ఛాయాసమేధితాన్
విపద్గణాద్విషాగ్న్యాదేర్మోచితా యత్సమాతృకాః

మీ చల్లని రెక్కల నీడలో పెరిగిన వారిని గుర్తుచేసుకున్నారా. శత్రువులనుండి ఆయుధాల నుండి వచ్చిన ఆపదలను మీ బుధ్ధి బలంతో తల్లితో సహా మమ్మల్ని కాపాడారు.

కయా వృత్త్యా వర్తితం వశ్చరద్భిః క్షితిమణ్డలమ్
తీర్థాని క్షేత్రముఖ్యాని సేవితానీహ భూతలే

ఏ వృత్తితో మీరు జీవించారు. ఈ భూమండలంలో ఏ ఏ తీర్థాలు సేవించారు

భవద్విధా భాగవతాస్తీర్థభూతాః స్వయం విభో
తీర్థీకుర్వన్తి తీర్థాని స్వాన్తఃస్థేన గదాభృతా

మీరే తీర్థాలతో సమానం. మీరు తీర్థయాత్రలకు వెళ్ళేది ఆ పుణ్య తీర్థాలనే తీర్థాలను చెయ్యడానికి. ఎందుకంటే మీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు.

అపి నః సుహృదస్తాత బాన్ధవాః కృష్ణదేవతాః
దృష్టాః శ్రుతా వా యదవః స్వపుర్యాం సుఖమాసతే

అన్నిచోట్లకూ పోయివచ్చి ఉంటారు కాబట్టి ద్వారకకి కూడా వెళ్ళివచ్చి ఉంటారు. మా మిత్రులని చూచార. కృష్ణుడు సుఖంగా ఉన్నాడా.

ఇత్యుక్తో ధర్మరాజేన సర్వం తత్సమవర్ణయత్
యథానుభూతం క్రమశో వినా యదుకులక్షయమ్

ఇలా అడిగితే విదురుడు తాను విన్నదన్నంతా చెప్పాడు ఒక్క యదుకులక్ష్యం తప్ప.

నన్వప్రియం దుర్విషహం నృణాం స్వయముపస్థితమ్
నావేదయత్సకరుణో దుఃఖితాన్ద్రష్టుమక్షమః

దు:ఖించేవారిని చూడజాలక (దుఃఖితాన్ద్రష్టుమక్షమః) పరమ అప్రియమైన ఆ వార్త ను చెప్పలేదు

కఞ్చిత్కాలమథావాత్సీత్సత్కృతో దేవవత్సుఖమ్
భ్రాతుర్జ్యేష్ఠస్య శ్రేయస్కృత్సర్వేషాం సుఖమావహన్

కొంతకాలం అక్కడివారికి ప్రీతికలిగించాలని అక్కడే ఉన్నాడు. తన అన్నగారికి శ్రేయస్సును కలిగించడానికి

అబిభ్రదర్యమా దణ్డం యథావదఘకారిషు
యావద్దధార శూద్రత్వం శాపాద్వర్షశతం యమః

 యముడే విదురుడిగా వచ్చాడు. అంతవరకూ సూర్యుడే యముడిగా పాపంచేసినవారిక్ దండిచే విధి నిర్వహించాడు.

యుధిష్ఠిరో లబ్ధరాజ్యో దృష్ట్వా పౌత్రం కులన్ధరమ్
భ్రాతృభిర్లోకపాలాభైర్ముముదే పరయా శ్రియా

ధర్మరాజుకూడా తన మనుమడు పరీక్షిత్తుని చూచి ఆనందంగా ఉన్నాడు.

ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా
అత్యక్రామదవిజ్ఞాతః కాలః పరమదుస్తరః

వీరందరికీ కాలం దగ్గరపడింది అని విదురుడు తెలుసుకున్నాడు.

విదురస్తదభిప్రేత్య ధృతరాష్ట్రమభాషత
రాజన్నిర్గమ్యతాం శీఘ్రం పశ్యేదం భయమాగతమ్

దృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: త్వరగా బయలుదేరి వెళ్ళండి. తప్పించుకోలేని భయంవచ్చింది.

ప్రతిక్రియా న యస్యేహ కుతశ్చిత్కర్హిచిత్ప్రభో
స ఏష భగవాన్కాలః సర్వేషాం నః సమాగతః

ప్రతీకారంలేని తప్పించుకోలేని ఆపద ఇది. అదే కాలం.

యేన చైవాభిపన్నోऽయం ప్రాణైః ప్రియతమైరపి
జనః సద్యో వియుజ్యేత కిముతాన్యైర్ధనాదిభిః

ఆ కాలం వస్తే అన్నిటికంటే ప్రియమైన ప్రాణాలే పోతాయి. అటువంటి ప్రాణాలే పోయెప్పుడు మిగతావాటి గురించి చెప్పల్సినదేముంది (కిముతాన్యైర్ధనాదిభిః)

పితృభ్రాతృసుహృత్పుత్రా హతాస్తే విగతం వయమ్
ఆత్మా చ జరయా గ్రస్తః పరగేహముపాససే

పితృభ్రాతృసుహృత్పుత్రా - వీరంతా పోయారు. నీ వయసుకూడా పొయింది. నీ శరీరానికి ముసలితనం వచ్చింది. నీకు ఇళ్ళుకూడా లేదు.

అన్ధః పురైవ వధిరో మన్దప్రజ్ఞాశ్చ సామ్ప్రతమ్
విశీర్ణదన్తో మన్దాగ్నిః సరాగః కఫముద్వహన్

అహో మహీయసీ జన్తోర్జీవితాశా యథా భవాన్
భీమాపవర్జితం పిణ్డమాదత్తే గృహపాలవత్

ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది జీవితం మీద ఆశ
ఈ వయసులో కూడా భీముడు పెట్టే పిండం తింటున్నావు కుక్కలాగ (గృహపాలవత్)

అగ్నిర్నిసృష్టో దత్తశ్చ గరో దారాశ్చ దూషితాః
హృతం క్షేత్రం ధనం యేషాం తద్దత్తైరసుభిః కియత్

నీకన్నంపెట్టే వారికి నీవు చేయని అపకారం ఉందా. ఉన్నైంటికి నిప్పు పెట్టావు, విషం పెట్టావు, అవమానించావు.
వాళ్ళ రాజ్యం ధనం హరించావు. ఈ ప్రాణాలు వాళ్ళు ఇచ్చిన్వి. ఇంకెన్నాళ్ళు ఉంటావు (తద్దత్తైరసుభిః కియత్).

తస్యాపి తవ దేహోऽయం కృపణస్య జిజీవిషోః
పరైత్యనిచ్ఛతో జీర్ణో జరయా వాససీ ఇవ

తెలివిగలవాడు చిరిగిన బట్టలను తనకు తానే అవతలపారేసినట్లు తన దేహాన్ని కూడా అలాగే పారేయాలి. పైలోకాల్లో కూడా సుఖమ్రాకుండా ఈ శరీరమే చేస్తుంది (పరైత్యనిచ్ఛతో )

గతస్వార్థమిమం దేహం విరక్తో ముక్తబన్ధనః
అవిజ్ఞాతగతిర్జహ్యాత్స వై ధీర ఉదాహృతః

ఎవరిని మనం జ్ఞ్యాని అంటాం అంటే - ఈ శరీరం దేనిగురించి వచ్చిందో ఎమి చెయ్యాలో అవి అయ్యాక నువ్వే వదిలిపెడితే సుఖం ఉంటుంది. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి (అవిజ్ఞాతగతి). అలా వెళ్ళినవాడే ధీరుడు.

యః స్వకాత్పరతో వేహ జాతనిర్వేద ఆత్మవాన్
హృది కృత్వా హరిం గేహాత్ప్రవ్రజేత్స నరోత్తమః

బుధ్ధిమంతుడైతే తనకి తానే వైరాగ్యం కలగాలి. లేదా ఇతరుల వల్ల కలగాలి.
పరమాత్మని మనసులో ఉంచుకుని బయలుదేరాలి. అతను ఉత్తముడు.

అథోదీచీం దిశం యాతు స్వైరజ్ఞాతగతిర్భవాన్
ఇతోऽర్వాక్ప్రాయశః కాలః పుంసాం గుణవికర్షణః

ఎవరికీ చెప్పకుండా ఉత్తరదిక్కుకు ప్రయాణం చెయ్యండి.

ఏవం రాజా విదురేణానుజేన ప్రజ్ఞాచక్షుర్బోధిత ఆజమీఢః
ఛిత్త్వా స్వేషు స్నేహపాశాన్ద్రఢిమ్నో నిశ్చక్రామ భ్రాతృసన్దర్శితాధ్వా

జ్ఞ్యాన నేత్రం విచ్చుకున్న విచ్చుకున్న రాజు స్నేహపాశాలను తెంచుకుని తమ్ముడు చూపిన దారిలో వెళ్ళాడు

పతిం ప్రయాన్తం సుబలస్య పుత్రీ పతివ్రతా చానుజగామ సాధ్వీ
హిమాలయం న్యస్తదణ్డప్రహర్షం మనస్వినామివ సత్సమ్ప్రహారః

భార్య కూడా వెళ్ళింది. జ్ఞ్యానులు ఎక్కడికి వెళ్ళి మోక్షం పొందుతారో అక్కడికి వెళ్ళాడు

అజాతశత్రుః కృతమైత్రో హుతాగ్నిర్విప్రాన్నత్వా తిలగోభూమిరుక్మైః
గృహం ప్రవిష్టో గురువన్దనాయ న చాపశ్యత్పితరౌ సౌబలీం చ

ధరమరాజు పొధ్ధున్నే లేచి బ్రాహ్మణులకి నమస్కరించి దృతరాష్ట్రల్ గాంధారులకి నమస్కరించడానికి వెళ్ళి వారు కనపడకపోవడంతో

తత్ర సఞ్జయమాసీనం పప్రచ్ఛోద్విగ్నమానసః
గావల్గణే క్వ నస్తాతో వృద్ధో హీనశ్చ నేత్రయోః

సంజయున్ని అడిగాడు.

అమ్బా చ హతపుత్రార్తా పితృవ్యః క్వ గతః సుహృత్
అపి మయ్యకృతప్రజ్ఞే హతబన్ధుః స భార్యయా
ఆశంసమానః శమలం గఙ్గాయాం దుఃఖితోऽపతత్
పితర్యుపరతే పాణ్డౌ సర్వాన్నః సుహృదః శిశూన్
అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ క్వ గతావితః

మమ్మల్ని ప్రేమతో పెంచి పెద్దచేసారు

సూత ఉవాచ
కృపయా స్నేహవైక్లవ్యాత్సూతో విరహకర్శితః
ఆత్మేశ్వరమచక్షాణో న ప్రత్యాహాతిపీడితః
విమృజ్యాశ్రూణి పాణిభ్యాం విష్టభ్యాత్మానమాత్మనా
అజాతశత్రుం ప్రత్యూచే ప్రభోః పాదావనుస్మరన్

అతను కూడా ఏమి తెలీక మనసుని నిగ్రహించుకుని పరమాత్మ పాదలలని స్మరిస్తూ

సఞ్జయ ఉవాచ
నాహం వేద వ్యవసితం పిత్రోర్వః కులనన్దన
గాన్ధార్యా వా మహాబాహో ముషితోऽస్మి మహాత్మభిః

మీ తల్లితండ్రులు ఏమి చెయ్యలనుకున్నారో నాకు తెలీదు. వీరు నన్ను మోసం చేసారు (ముషితోऽస్మి )

అథాజగామ భగవాన్నారదః సహతుమ్బురుః
ప్రత్యుత్థాయాభివాద్యాహ సానుజోऽభ్యర్చయన్మునిమ్

అప్పుడు నారద తుంబురులు వచ్చారు

యుధిష్ఠిర ఉవాచ
నాహం వేద గతిం పిత్రోర్భగవన్క్వ గతావితః
అమ్బా వా హతపుత్రార్తా క్వ గతా చ తపస్వినీ

అప్పుడు ధర్మరాజు - మా తల్లి ఎక్కడికి వెళ్ళింది

కర్ణధార ఇవాపారే భగవాన్పారదర్శకః
అథాబభాషే భగవాన్నారదో మునిసత్తమః

ప్రవాహంలో ఉన్న నావకు చుక్కాని దారి చూపించినట్లు నాకు దారిచూపండి

నారద ఉవాచ
మా కఞ్చన శుచో రాజన్యదీశ్వరవశం జగత్
లోకాః సపాలా యస్యేమే వహన్తి బలిమీశితుః
స సంయునక్తి భూతాని స ఏవ వియునక్తి చ

బాధపడకు (మా కఞ్చన శుచో రాజన్). ప్రపంచం ఈశ్వర వశం. అన్ని లోకాలు పాలకులు పరమాత్మ ఆజ్ఞ్యను వహించాలి.

యథా గావో నసి ప్రోతాస్తన్త్యాం బద్ధాశ్చ దామభిః
వాక్తన్త్యాం నామభిర్బద్ధా వహన్తి బలిమీశితుః

ఈయనే ప్రాణులని కలుపుతాడు విడదీస్తాడు. ఎంతబాగా శక్తి ఉన్నా మదించిన ఏనుగులను తాడుతో బంధిస్తారు అలాగే మనల్ని కర్మ బంధంతో బందిస్తాడు పరమాత్మ

యథా క్రీడోపస్కరాణాం సంయోగవిగమావిహ
ఇచ్ఛయా క్రీడితుః స్యాతాం తథైవేశేచ్ఛయా నృణామ్

మనదరం పరమాత్మకు ఆటవస్తువులం.

యన్మన్యసే ధ్రువం లోకమధ్రువం వా న చోభయమ్
సర్వథా న హి శోచ్యాస్తే స్నేహాదన్యత్ర మోహజాత్

ప్రపంచం నిత్యమనుకున్నా అనిత్యమనుకున్నా దానికి సంతాపం అవసరంలేదు. మోహం వల్ల కలిగే స్నేహం తప్ప దీనికి అర్థంలేదు

తస్మాజ్జహ్యఙ్గ వైక్లవ్యమజ్ఞానకృతమాత్మనః
కథం త్వనాథాః కృపణా వర్తేరంస్తే చ మాం వినా

అజ్ఞ్యానం వల్ల వచ్చే దైన్యాన్ని శోకాన్ని విడిచిపెట్టు

కాలకర్మగుణాధీనో దేహోऽయం పాఞ్చభౌతికః
కథమన్యాంస్తు గోపాయేత్సర్పగ్రస్తో యథా పరమ్

ఈ శరీరం పాంచభౌతికం. నీ శరీరమే నీ చేతుల్లో లేదు. అది నువ్ రప్పించుకోనూలేవు. పాము కాటేసిన నీవు ఇతరులని ఎలా కాపాడతావు

అహస్తాని సహస్తానామపదాని చతుష్పదామ్
ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనమ్

చేతులు లేని ప్రాణులు చేతులు ఉన్న ప్రాణులకి ఆహారం.
పాదములు లేని ప్రాణులు పాదములు ఉన్న ప్రాణులకి ఆహరం
ఒక జీవి ఇంకో జీవికి ఆహరం.
నాలుగు కాళ్ళ జంతువులు రెండు కాళ్ళ జంతువుకి ఆహారం. రెండుకాళ్ళ జంతువుల్లో బలీయులకి బలహీనులు ఆహారం. ప్రతీ ప్రాణీ బ్రతికేది ఇంకో దానిమీదే.

తదిదం భగవాన్రాజన్నేక ఆత్మాత్మనాం స్వదృక్
అన్తరోऽనన్తరో భాతి పశ్య తం మాయయోరుధా

స్వదృక్ - తనను తాను చూడగలది తనను తాను తెలియగలది అయినది ఆత్మ మాత్రమే
ఏ తేడాలేనిది తేడా ఉన్నట్టు, తేడా ఉన్నది లేనట్టు కనపడుతుంది. ఇదంతా పరమాత్మ మాయవల్ల.

సోऽయమద్య మహారాజ భగవాన్భూతభావనః
కాలరూపోऽవతీర్ణోऽస్యామభావాయ సురద్విషామ్

కాలరూపుడైన పరమాత్మ కృష్ణుడుగా అవతరించాడు మిగిలిన కొద్ది పనికోసం ఎదురుచూస్తున్నాడు

నిష్పాదితం దేవకృత్యమవశేషం ప్రతీక్షతే
తావద్యూయమవేక్షధ్వం భవేద్యావదిహేశ్వరః

మీరుకూడా ఈ రాజ్యం లో కృష్ణుడు ఉన్నంతవరకే ఉండండి.

ధృతరాష్ట్రః సహ భ్రాత్రా గాన్ధార్యా చ స్వభార్యయా
దక్షిణేన హిమవత ఋషీణామాశ్రమం గతః

దృతరాష్టృడు హిమవత్పర్వతం దగ్గర ఉన్నాడు

స్రోతోభిః సప్తభిర్యా వై స్వర్ధునీ సప్తధా వ్యధాత్
సప్తానాం ప్రీతయే నానా సప్తస్రోతః ప్రచక్షతే

ప్రతీ పూటా గంగాదులలో స్నానం చేస్తూ జలం భుజిస్తూ

స్నాత్వానుసవనం తస్మిన్హుత్వా చాగ్నీన్యథావిధి
అబ్భక్ష ఉపశాన్తాత్మా స ఆస్తే విగతైషణః

జితాసనో జితశ్వాసః ప్రత్యాహృతషడిన్ద్రియః
హరిభావనయా ధ్వస్తరజఃసత్త్వతమోమలః

ప్రాణాయంతో ఆసనాన్ని శ్వాసని జయించాడు త్రిగుణాలని విడిచిపెట్టాడు

విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్య తమ్
బ్రహ్మణ్యాత్మానమాధారే ఘటామ్బరమివామ్బరే

మనసుని బుధ్ధిలో బుధ్ధిని ఆత్మలో ఆత్మని పరమాత్మలో లీనం చేసి ఘటాకాశాన్ని ఆకాశంలో కలిపినట్లు తన ఆత్మని పరమాత్మలో కలపడానికి ప్రయత్నిస్తున్నడు

ధ్వస్తమాయాగుణోదర్కో నిరుద్ధకరణాశయః
నివర్తితాఖిలాహార ఆస్తే స్థాణురివాచలః
తస్యాన్తరాయో మైవాభూః సన్న్యస్తాఖిలకర్మణః

అన్ని ఆహారాలను ఆపుకొని స్థాణువులా ఉన్నాడు. అతనికి నీవు విఘ్నం కలిగించకు

స వా అద్యతనాద్రాజన్పరతః పఞ్చమేऽహని
కలేవరం హాస్యతి స్వం తచ్చ భస్మీభవిష్యతి
దహ్యమానేऽగ్నిభిర్దేహే పత్యుః పత్నీ సహోటజే
బహిః స్థితా పతిం సాధ్వీ తమగ్నిమను వేక్ష్యతి

ఇప్పటికి అయిదవ రోజుకి యోగంతో శరీరాన్ని విడిచిపెడతాడు కుంతితో సహా.

విదురస్తు తదాశ్చర్యం నిశామ్య కురునన్దన
హర్షశోకయుతస్తస్మాద్గన్తా తీర్థనిషేవకః

దుఖశోకాలు తొలగిన విదురుడు తరువాత తీర్థయాత్రలకి బయలుదేరతాడు

ఇత్యుక్త్వాథారుహత్స్వర్గం నారదః సహతుమ్బురుః
యుధిష్ఠిరో వచస్తస్య హృది కృత్వాజహాచ్ఛుచః

ఈ విధంగా చెప్పి నారదుడు తుంబురునితో సహా వెళ్ళిపోయాడు. యుధిష్టిరుడు శోకాన్ని మోహాన్ని విడిచిపెట్టాడు

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పన్నెండవ అధ్యాయం

విమర్శించేవాళ్ళకి విమర్శించడానికి కావలసిన ఆధారాలు చూపడానికి శ్రీ కృష్ణపరమాత్మ స్త్రీలోలుడుగా వారికి అనిపిస్తాడు. నిజానికి ఆయన ఒక్క భక్తులకి మాత్రమే వశమవుతాడు

శౌనక ఉవాచ
అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మశీర్ష్ణోరుతేజసా
ఉత్తరాయా హతో గర్భ ఈశేనాజీవితః పునః
తస్య జన్మ మహాబుద్ధేః కర్మాణి చ మహాత్మనః
నిధనం చ యథైవాసీత్స ప్రేత్య గతవాన్యథా
తదిదం శ్రోతుమిచ్ఛామో గదితుం యది మన్యసే
బ్రూహి నః శ్రద్దధానానాం యస్య జ్ఞానమదాచ్ఛుకః

అశ్వథ్థామ విడిచిన బ్రహ్మశిరోనామకాస్త్రంవల్ల రక్షించబడిన గర్భం పుట్టిననతరువాత ఏమి చేసాడు, ఎలా శరీరం విడిచిపెట్టాడుఓ మీరు చెప్పదలచుకుంటే చెప్పండి.

సూత ఉవాచ
అపీపలద్ధర్మరాజః పితృవద్రఞ్జయన్ప్రజాః
నిఃస్పృహః సర్వకామేభ్యః కృష్ణపాదానుసేవయా

పరీక్షిత్తు జననం కలియుగంలోనే జరిగింది.
అన్ని కామముల మీద కామం లేని ధర్మరాజు కృష్ణపరమాత్మ పాదపద్మములు సేవించడం మీదే మనసు ఉండి

సమ్పదః క్రతవో లోకా మహిషీ భ్రాతరో మహీ
జమ్బూద్వీపాధిపత్యం చ యశశ్చ త్రిదివం గతమ్

ఇక్కడ సంపదలు భార్యలు తమ్ములు జంబూద్వీపం అన్నీ తన ఆధీనంలో ఉన్న ధర్మరాజు కీర్తి స్వర్గంవరకూ పాకింది

కిం తే కామాః సురస్పార్హా ముకున్దమనసో ద్విజాః
అధిజహ్రుర్ముదం రాజ్ఞః క్షుధితస్య యథేతరే

అయిన దేవతల చేత కూడా కోరబడే కోరికలు (సురస్పార్హా ) కూడా ధర్మరాజు మనసు అపహరించలేదు. ఎలా అంటే బాగా ఆకలవుతున్నవాడికి ఇతరభోగములు ఎలా రుచించవో పరమాత్మ మీద మనసు లగ్నమయిన వారికి ఇతరవిషయములు రుచించవు.

మాతుర్గర్భగతో వీరః స తదా భృగునన్దన
దదర్శ పురుషం కఞ్చిద్దహ్యమానోऽస్త్రతేజసా

పరీక్షిత్తు గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం అతన్ని బాధించింది. ఆ బాధలోనే ఆయన ఒక పురుషుణ్ణి చూసాడు.

అఙ్గుష్ఠమాత్రమమలం స్ఫురత్పురటమౌలినమ్
అపీవ్యదర్శనం శ్యామం తడిద్వాససమచ్యుతమ్
శ్రీమద్దీర్ఘచతుర్బాహుం తప్తకాఞ్చనకుణ్డలమ్
క్షతజాక్షం గదాపాణిమాత్మనః సర్వతో దిశమ్
పరిభ్రమన్తముల్కాభాం భ్రామయన్తం గదాం ముహుః


అంగుష్టమాత్రంగా ఉన్న ఆయన, ఎర్రబడిన కనుల కొనలతో, గదపట్టుకోని తిరుగుతూ ఆ గదని తిప్పుతూ మాటిమాటికీ అస్త్రతేజస్సును సూర్యుడు మంచును కరిగించినట్లుగా ద్వంసంచేసాడు

అస్త్రతేజః స్వగదయా నీహారమివ గోపతిః
విధమన్తం సన్నికర్షే పర్యైక్షత క ఇత్యసౌ

ఇలా తన గద తేజస్సుతో అస్త్రతేజస్సుని తొలగించినవాడి గురించి చొట్టూచూచాడు

విధూయ తదమేయాత్మా భగవాన్ధర్మగుబ్విభుః
మిషతో దశమాసస్య తత్రైవాన్తర్దధే హరిః

అలా చూస్తూ ఉండగానే అక్కడే అంతర్ధానమయ్యాడు. అప్పటికే తనకి పది నెలలు నిండాయి.

తతః సర్వగుణోదర్కే సానుకూలగ్రహోదయే
జజ్ఞే వంశధరః పాణ్డోర్భూయః పాణ్డురివౌజసా

అన్ని ఉత్తమకాల గుణాలు చేరినపుడు  ఏ ఏ గ్రహములు ఏ ఏ స్థానాల్లో ఉండాలో అలా ఉన్నప్పుడు పాండువంశాన్ని నిలబెట్టే వాడు పాండుమహారాజు వంటి పరాక్రమవంతుడు అవతరించాడు

తస్య ప్రీతమనా రాజా విప్రైర్ధౌమ్యకృపాదిభిః
జాతకం కారయామాస వాచయిత్వా చ మఙ్గలమ్

కృపాచర్యుడు రాజగురువు. దౌమ్యుడు పురోహితుడు. వారిచేత జాతకర్మలు చేయించాడు

హిరణ్యం గాం మహీం గ్రామాన్హస్త్యశ్వాన్నృపతిర్వరాన్
ప్రాదాత్స్వన్నం చ విప్రేభ్యః ప్రజాతీర్థే స తీర్థవిత్

స తీర్థవిత్ - తనతో సారూప్యమున్నవాడు. ధర్మరాజుకు సారుప్యమున్నవాడు ధర్మం.
ధర్మం తెలిసినవాడు కాబట్టి బ్రాహ్మణులకు గోవులను దానం చేసాడు.

తమూచుర్బ్రాహ్మణాస్తుష్టా రాజానం ప్రశ్రయాన్వితమ్
ఏష హ్యస్మిన్ప్రజాతన్తౌ పురూణాం పౌరవర్షభ

ఆ బ్రాహ్మణులు సంతోషించి పరీక్షిత్తు జాతకాన్ని చెప్తున్నారు

దైవేనాప్రతిఘాతేన శుక్లే సంస్థాముపేయుషి
రాతో వోऽనుగ్రహార్థాయ విష్ణునా ప్రభవిష్ణునా

శుక్లే - అంటే కృష్ణుడు.
కృష్ణావతారం ముగిసిన తరువాత ఆ పరమాత్మ చేత ఇవ్వబడ్డాడు. పరమాత్మ చేత ఇవ్వబడ్డాడు కాబట్టి విష్ణురాతుడని పేరు వస్తుంది.

తస్మాన్నామ్నా విష్ణురాత ఇతి లోకే భవిష్యతి
న సన్దేహో మహాభాగ మహాభాగవతో మహాన్

ఇతను గొప్ప భాగవతోత్తముడవుతాడు

శ్రీరాజోవాచ
అప్యేష వంశ్యాన్రాజర్షీన్పుణ్యశ్లోకాన్మహాత్మనః
అనువర్తితా స్విద్యశసా సాధువాదేన సత్తమాః

మా వంశాన్ని నిలబెడతాడా. తనకంటే ముందు ఉన్న రాజర్షుల కీర్తిని నిలబెడతాడా. అందరి చేతా మెప్పుకోలు పొందుతాడా

బ్రాహ్మణా ఊచుః
పార్థ ప్రజావితా సాక్షాదిక్ష్వాకురివ మానవః
బ్రహ్మణ్యః సత్యసన్ధశ్చ రామో దాశరథిర్యథా

మనువంశంలో ఉన్న ఇక్ష్వాకు వలె ఈయన కీర్తివంతుడవుతాడు. సత్యంలో ధశరధ పుత్రుని వంటివాడు.

ఏష దాతా శరణ్యశ్చ యథా హ్యౌశీనరః శిబిః
యశో వితనితా స్వానాం దౌష్యన్తిరివ యజ్వనామ్

శరణువేడినవాడిని కాపాడతాడు. శిబి చక్రవర్తి వంటి దాత
తనవారికీర్తిని తన కీర్తిని వ్యాపింపజేస్తాడు భరతునివలే

ధన్వినామగ్రణీరేష తుల్యశ్చార్జునయోర్ద్వయోః
హుతాశ ఇవ దుర్ధర్షః సముద్ర ఇవ దుస్తరః

ధనుర్ధారులలో ఇద్దరి అర్జనునివలే అవుతాడు (కార్తవీర్యార్జనుడు, అర్జనుడు).
అగ్నిహోత్రంలాగ ఎవ్వరిచేతా ఆక్రమింపజాలనివాడు. సముద్రంలాగా ఇతన్ని ఎవరు దాటలేరు

మృగేన్ద్ర ఇవ విక్రాన్తో నిషేవ్యో హిమవానివ
తితిక్షుర్వసుధేవాసౌ సహిష్ణుః పితరావివ

పరాక్రమంలో సిమ్హంలాంటివాడు. హిమవంతునివలే అందరిచేతా సేవింపదగినవాడు
భూమిలా ఓర్పు ఉన్నవాడు. తల్లితండ్రులవలే తప్పులని సహించేవాడు.

పితామహసమః సామ్యే ప్రసాదే గిరిశోపమః
ఆశ్రయః సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః

జ్ఞ్యానులలో బ్రహ్మవంటివాడు. అనుగ్రహించడంలో శంకరునివంటివాడు
అందరికీ శ్రీమహావిష్ణువులా ఆశ్రయింపదగినవాడిలా ఉంటాడు

సర్వసద్గుణమాహాత్మ్యే ఏష కృష్ణమనువ్రతః
రన్తిదేవ ఇవోదారో యయాతిరివ ధార్మికః

సద్గుణాల్లో శ్రీకృష్ణునివంటివాడు. ఔదార్యంలో రంతిదేవునివంటివాడు
ధర్మప్రవర్తతంలో యయాతివంటివాడు. దైర్యంలో బలి చక్రవర్తి వంటివాడు

హృత్యా బలిసమః కృష్ణే ప్రహ్రాద ఇవ సద్గ్రహః
ఆహర్తైషోऽశ్వమేధానాం వృద్ధానాం పర్యుపాసకః

సజ్జనులని ఆశ్రయించడంలో ప్రహ్లాదునివంటివాడు
చాల అశ్వమేధయాగాలు చేయిస్తాడు.

రాజర్షీణాం జనయితా శాస్తా చోత్పథగామినామ్
నిగ్రహీతా కలేరేష భువో ధర్మస్య కారణాత్

తనంతవాడిని తాను సృష్టించగలడు.
చెడుదారిన నడిచేవారిని శాసించగలవాడు.
భూదేవికి ధర్మ దేవతకూ హాని కలిగించే కలిని నిగ్రహించగలడు.

తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్
ప్రపత్స్యత ఉపశ్రుత్య ముక్తసఙ్గః పదం హరేః

ఒక ఋషిపుత్రుని శాపంతో తనకి మరణం సంభవిస్తుందని విని పరమాత్మని చేరతాడు

జిజ్ఞాసితాత్మయాథార్థ్యో మునేర్వ్యాససుతాదసౌ
హిత్వేదం నృప గఙ్గాయాం యాస్యత్యద్ధాకుతోభయమ్

ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని తెలియగోరి ప్రాయోపవేశం చేస్తే శుకుడు వచ్చి జ్ఞ్యానం ఉపదేశిస్తాడు
గంగా తీరంలో తన శరీరాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని పొందుతాడు.

ఇతి రాజ్ఞ ఉపాదిశ్య విప్రా జాతకకోవిదాః
లబ్ధాపచితయః సర్వే ప్రతిజగ్ముః స్వకాన్గృహాన్

లబ్ధాపచితయః - దక్షిణలు పొంది వారి ఇంటికి వెళ్ళారు.

స ఏష లోకే విఖ్యాతః పరీక్షిదితి యత్ప్రభుః
పూర్వం దృష్టమనుధ్యాయన్పరీక్షేత నరేష్విహ

పరీక్షితని ఇతను పేరు పొందుతాడు.

స రాజపుత్రో వవృధే ఆశు శుక్ల ఇవోడుపః
ఆపూర్యమాణః పితృభిః కాష్ఠాభిరివ సోऽన్వహమ్

శుక్లపక్ష చంద్రుడిలాగా పరీక్ష్త్తు వృధ్ధిచెందుతూ ఉన్నాడు.

యక్ష్యమాణోऽశ్వమేధేన జ్ఞాతిద్రోహజిహాసయా
రాజా లబ్ధధనో దధ్యౌ నాన్యత్ర కరదణ్డయోః

సకలబంధుక్షయం వలన వచ్చిన పాపముని తొలగించుకోవడానికి ధర్మరాజు అశ్వమేధం చేయసంకల్పించాడు. అన్యత్ర కరదణ్డయోః - దానికి ప్రజలడబ్బుని వినియోగించకూడదు. రాజు తన ధనాన్ని మాత్రమే ఉపయోగించాలి.

తదభిప్రేతమాలక్ష్య భ్రాతరో ఞ్చ్యుతచోదితాః
ధనం ప్రహీణమాజహ్రురుదీచ్యాం దిశి భూరిశః

కృష్ణప్రేరేపణ వల్ల దండయాత్రకు బయలుదేరి ఆయా రాజుల ధనం తీసుకుని.


తేన సమ్భృతసమ్భారో ధర్మపుత్రో యుధిష్ఠిరః
వాజిమేధైస్త్రిభిర్భీతో యజ్ఞైః సమయజద్ధరిమ్

యజ్ఞ్యానికి కావలసిన సామాగ్రి తెచ్చి మూడు యజ్ఞ్యములు చేసారు

ఆహూతో భగవాన్రాజ్ఞా యాజయిత్వా ద్విజైర్నృపమ్
ఉవాస కతిచిన్మాసాన్సుహృదాం ప్రియకామ్యయా

ధర్మరాజు ఎప్పుడు అశ్వమేధయాగం చేయాలన్నా కృష్ణుడిని పిలిచేవాడు. కృష్ణుణ్ణి తనదగ్గర ఉంచుకోవాలని నిరంతరం యజ్ఞ్యములు చేసేవాడు. దానివల్ల కృష్ణుడు ఎక్కువకాలం అక్కడే ఉండేవాడు

తతో రాజ్ఞాభ్యనుజ్ఞాతః కృష్ణయా సహబన్ధుభిః
యయౌ ద్వారవతీం బ్రహ్మన్సార్జునో యదుభిర్వృతః

ఇలా యజ్ఞ్యములు పూర్తి అయ్యాక అర్జనుణ్ణి తీసుకుని ద్వారకకు వెళ్ళాడు.

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదకొండొవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదకొండొవ అధ్యాయం

సూత ఉవాచ
ఆనర్తాన్స ఉపవ్రజ్య స్వృద్ధాఞ్జనపదాన్స్వకాన్
దధ్మౌ దరవరం తేషాం విషాదం శమయన్నివ

ద్వారక పొలిమేరల్లోకి రాగానే ఇంతకాలం తన వియోగంతో బాధపడుతున్న తమవారి మనసులో విషాదాన్ని తొలగించడానికా అన్నట్లు పాంచజన్యాన్ని పూరించాడు.

స ఉచ్చకాశే ధవలోదరో దరోऽప్యురుక్రమస్యాధరశోణశోణిమా
దాధ్మాయమానః కరకఞ్జసమ్పుటే యథాబ్జఖణ్డే కలహంస ఉత్స్వనః

పరమాత్మ కింది పెదవి ఎరుపుదనం అంటుకున్న అరచెయ్యి ఎరుపుతో ప్రకాశించింది (అధరశోణశోణిమా). ఈ రెండు ఎరుపుల (కింది పెదవి అరచెయ్యి ) మధ్య ఉన్న శంఖం, సరసులో పద్మం మధ్య ఉండి తామరతూలిని ఆరగిస్తూ ఆనదిస్తూ ధ్వనిస్తోన్న రాజ హంసలా ఉంది.   హంస తెల్లగా పద్మం ఎర్రగా సరసు నీలంగా ఉంటుంది.  శంఖం పూరిస్తున్న పరమాత్మని సరసులో పద్మం మీద ఉన్న హంసతో పోల్చబడింది.
స ఉచ్చకాశే ధవలోదరో దరోऽపి  శంఖం తెల్లగా ఉన్నా
ఉరుక్రమస్య అధరశోణశోణిమా - పరమాత్మ అధరపు ఎరుపు అంటి
దాధ్మాయమానః కరకఞ్జసమ్పుటే - చేతులనే పద్మగర్భంలో ఉండి
యథా అబ్జఖణ్డే కలహంస ఉత్స్వనః- పద్మసమూహంలో బాగా ధ్వనిస్తున్న కలహంస లాగ భాసించింది

తముపశ్రుత్య నినదం జగద్భయభయావహమ్
ప్రత్యుద్యయుః ప్రజాః సర్వా భర్తృదర్శనలాలసాః

జగద్భయభయావహమ్ - ప్రపంచానికి కలిగే భయానికే భయాన్ని కలిగించే ధ్వనిని విని స్వామిని చూడటానికి వెళ్ళారు

తత్రోపనీతబలయో రవేర్దీపమివాదృతాః
ఆత్మారామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా

ఉపనీతబలయో - స్వామిని పూజించి కానుకలు ఇచ్చారు. రవేర్దీపమివాదృతాః సూర్యునికి దీపమును చూపించినట్లుగా
ఆయన నిత్య పూర్ణుడు,

ప్రీత్యుత్ఫుల్లముఖాః ప్రోచుర్హర్షగద్గదయా గిరా
పితరం సర్వసుహృదమవితారమివార్భకాః

ప్రీత్యుత్ఫుల్లముఖాః  - సంతోషంతో వారి ముఖం వికసించింది.
హర్షగద్గదయా గిరా - ఆనందంతో గొంతుపూడుకపోయింది,
ఎలాగంటే తండ్రిని చూచిన సంతానం ఎలా ఐతే గొంతు గద్గదమై మాట్లాడతారు సకల జనులక్షేమాని కోరే పరమాత్మతో మాట్లాడుతున్నారు

నతాః స్మ తే నాథ సదాఙ్ఘ్రిపఙ్కజం విరిఞ్చవైరిఞ్చ్యసురేన్ద్రవన్దితమ్
పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం న యత్ర కాలః ప్రభవేత్పరః ప్రభుః

బ్రహ్మచేత, బ్రహ్మసంతానం చేత నమస్కరించబడే నీ పాదపద్మాలకు మేమందరమూ నమస్కారం చేస్తున్నం,  భగవతుండు ఇచ్చిన వివేకాన్ని కాపాడుకోవాలని కోరుకున్న వారికి సర్వోత్తమైన ఆధరమైన నీకు నమస్కరిస్తున్నము. నీవు తప్ప సకలప్రాణులూ కాలప్రభావానికి లొంగినవాడే.

భవాయ నస్త్వం భవ విశ్వభావన త్వమేవ మాతాథ సుహృత్పతిః పితా
త్వం సద్గురుర్నః పరమం చ దైవతం యస్యానువృత్త్యా కృతినో బభూవిమ

విశ్వభావన - సకల చరాచర జగతూను కాపాడే వాడా నీవు మా రక్షణగ ఉండు (భవాయ నస్త్వం భవ )
త్వమేవ మాతాథ సుహృత్పతిః పితా - నీవే మాతా అర్థం పితా పతి అన్నీ నీవే
త్వం సద్గురుర్నః పరమం చ దైవతం -నీవే మాకు ఉత్తమగురువు పరదైవం
యస్యానువృత్త్యా కృతినో బభూవిమ - నిన్ను సేవిస్తేనే మా జన్మ సార్ధకమవుతుంది

అహో సనాథా భవతా స్మ యద్వయం త్రైవిష్టపానామపి దూరదర్శనమ్
ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణాననం పశ్యేమ రూపం తవ సర్వసౌభగమ్

మేము కేవలం ధన్యులం అనట్లేదు, మేము రక్షణ కలవారము. స్వర్గంలో ఉండేవారికి కూడా నీ దర్శనం లభించదు. .
ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణాననం - పరమాత్మ చూపులో ప్రేమ, అరనవ్వు, స్నేహం ఈ మూడు తొణికిసలాడే మొహంలో శోభిస్తున్న స్వర్గంలో కూడా కలగని దర్శనం మాకు కలిగింది.
సర్వసౌభగమ్ - అన్ని రకముల సౌందర్యాలకు నిలయం నీ సౌందర్యం,

యర్హ్యమ్బుజాక్షాపససార భో భవాన్కురూన్మధూన్వాథ సుహృద్దిదృక్షయా
తత్రాబ్దకోటిప్రతిమః క్షణో భవేద్రవిం వినాక్ష్ణోరివ నస్తవాచ్యుత

యర్హ్యమ్బుజాక్షాపససార భో భవాన్, క్రూన్, మధూన్వాథ సుహృద్దిదృక్షయా
లౌకికములైన వృత్తి అనుసరించడానికి బంధువులను చూడటానికి వెళ్ళావు.
నిను చూడని తృటి మాకు క్షణమవుతుంది. ఈ వియోగంలో జరిగే ఒక్కొక్క క్షణము కోటిసంవత్సరాలతో సమానం ఎలాగంటే సుర్ర్యుడులేని కళ్ళకు వలె.
 
కథం వయం నాథ చిరోషితే త్వయి ప్రసన్నదృష్ట్యాఖిలతాపశోషణమ్
జీవేమ తే సున్దరహాసశోభితమపశ్యమానా వదనం మనోహరమ్

ఇతి చోదీరితా వాచః ప్రజానాం భక్తవత్సలః
శృణ్వానోऽనుగ్రహం దృష్ట్యా వితన్వన్ప్రావిశత్పురమ్

ఇలా ప్రజలచేత పలకబడిన పలుకులను విన్న భక్తవత్సలుడు తన చూపుతోటే అనుగ్రహాన్ని వారిక్ అందిస్తూ నగరాన్ని ప్రవేశించాడు.

మధుభోజదశార్హార్హకుకురాన్ధకవృష్ణిభిః
ఆత్మతుల్యబలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ

నాగులతో పాతాళలోకం ఉన్నట్లుగా ఈ ఆనర్త రాజ్యంలో మధు భోజ దశార్హ కుకుర అంధక వృష్ణి ఆరు రకముల క్షత్రియవీరుల అధిపతి అయిన కృష్ణుడు. నాగులతో ఉన్న భోగవతీ నగరంలా ఉంది.

సర్వర్తుసర్వవిభవపుణ్యవృక్షలతాశ్రమైః
ఉద్యానోపవనారామైర్వృతపద్మాకరశ్రియమ్

అన్ని ఋతువుల చెట్లూ పూలు అక్కడే ఉన్నాయి. ఆ శోభలతో ఉంది. అన్ని ఉద్యానాలు (అందరికీ పనికొచ్చేదాన్ని ఉద్యానం), ఆరామాలు (కొందరికి మాత్రమే పనికొచ్చేదాన్ని ఆరామం అంటారు),

గోపురద్వారమార్గేషు కృతకౌతుకతోరణామ్
చిత్రధ్వజపతాకాగ్రైరన్తః ప్రతిహతాతపామ్

కృష్ణాగమనాన్ని తెలుసుకున్న వారు పుష్పాలు తోరణాలు ధ్వజములు కట్టారు. అన్తః ప్రతిహతాతపామ్ - స్వామికి ఎండతగలకుండా కట్టారు.

సమ్మార్జితమహామార్గ రథ్యాపణకచత్వరామ్
సిక్తాం గన్ధజలైరుప్తాం ఫలపుష్పాక్షతాఙ్కురైః

సమ్మార్జితమహామార్గ - దారినంతా ఊడ్చి సుగంధములు కలిగిన అత్తరు జల్లారు (సిక్తాం గన్ధజలై)
ఫలములు అక్షతాలు పళ్ళు వేశారు దారిలో

ద్వారి ద్వారి గృహాణాం చ దధ్యక్షతఫలేక్షుభిః
అలఙ్కృతాం పూర్ణకుమ్భైర్బలిభిర్ధూపదీపకైః

ప్రతీ ద్వారం ముందు పెరుగు అక్షతలు పళ్ళు చెరుకు రసం ఉంచారు.
ప్రతీ ఇంటిముందరా పూర్ణ కుంభములు ఉంచబడినవి.

నిశమ్య ప్రేష్ఠమాయాన్తం వసుదేవో మహామనాః
అక్రూరశ్చోగ్రసేనశ్చ రామశ్చాద్భుతవిక్రమః
ప్రద్యుమ్నశ్చారుదేష్ణశ్చ సామ్బో జామ్బవతీసుతః
ప్రహర్షవేగోచ్ఛశితశయనాసనభోజనాః

దేవకీ వసుదేవులు అకౄఉరుడు మొదలైన వారందరూ కృష్ణ పరమాత్మ వస్తున్నడన్న వారత విని వారు చేస్తున్న పని వదిలిపెట్టి బయలుదేరారు (శయన ఆసన భోజనా)

వారణేన్ద్రం పురస్కృత్య బ్రాహ్మణైః ససుమఙ్గలైః
శఙ్ఖతూర్యనినాదేన బ్రహ్మఘోషేణ చాదృతాః
ప్రత్యుజ్జగ్మూ రథైర్హృష్టాః ప్రణయాగతసాధ్వసాః

గజేంద్రుని ముందు పెట్టుకుని మంగళకరములైన మంత్రములతో శంఖములు మంగళవాద్యాలతో ఎదుర్కొన్నారు. ప్రేమతో వచ్చిన తొట్రుపాటుతో ఎదుర్కొన్నారు (సాధ్వసాః).

వారముఖ్యాశ్చ శతశో యానైస్తద్దర్శనోత్సుకాః
లసత్కుణ్డలనిర్భాతకపోలవదనశ్రియః
నటనర్తకగన్ధర్వాః సూతమాగధవన్దినః
గాయన్తి చోత్తమశ్లోకచరితాన్యద్భుతాని చ

వందిమాగదులు పరమాత్మను స్తోత్రం చేసారు.

భగవాంస్తత్ర బన్ధూనాం పౌరాణామనువర్తినామ్
యథావిధ్యుపసఙ్గమ్య సర్వేషాం మానమాదధే
ప్రహ్వాభివాదనాశ్లేషకరస్పర్శస్మితేక్షణైః
ఆశ్వాస్య చాశ్వపాకేభ్యో వరైశ్చాభిమతైర్విభుః

తనను ఎదుర్కోవడానికి వచ్చిన బంధువుల ప్రేమను ఆర్తిని చూపుతో నమస్కారంతో ఆలింగనంతో (ఆశ్లేష), వంగి (ప్రహ్వా) స్వీకరించాడు.
ఆశ్వపాకేభ్య - చండాలుర వరకూ వరైశ్చాభిమతైర్విభుః అందరినీ ఓదార్చాడు మన్నించాడు.
చిన్న పెద్ద తేడాలేకుండా అందరినీ మన్నించాడు.

స్వయం చ గురుభిర్విప్రైః సదారైః స్థవిరైరపి
ఆశీర్భిర్యుజ్యమానోऽన్యైర్వన్దిభిశ్చావిశత్పురమ్

వృధ్ధులు బ్రాహ్మణులు యోగులు ఆశీర్వదించారు. అవి తీసుకుని నగరంలోకి ప్రవేశించాడు (అభిశ్చావిశత్పురమ్)

రాజమార్గం గతే కృష్ణే ద్వారకాయాః కులస్త్రియః
హర్మ్యాణ్యారురుహుర్విప్ర తదీక్షణమహోత్సవాః

ద్వారకలో ఉన్న కులస్త్రీలు ప్రాసాదం ఎక్కి వరుసగా నిల్బడ్డారు.

నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌకసామ్
న వితృప్యన్తి హి దృశః శ్రియో ధామాఙ్గమచ్యుతమ్

శ్రియో ధామ అఙ్గం అచ్యుతమ్ - చూచేవారిని తను చూచినవారని జారనీయని వాడు

శ్రియో నివాసో యస్యోరః పానపాత్రం ముఖం దృశామ్
బాహవో లోకపాలానాం సారఙ్గాణాం పదామ్బుజమ్

అమ్మవారికి ఆయన వక్షస్థలం నివాసం, ఆయన ముఖం మనకి పాన పాత్రం, ఆయన బాహువులు అఖిలలోక పాలకులకు ఆశ్రయం, భక్తులకు (సారఙ్గాణాం - తుమ్మెదలు - పరమాత్మ యొక్క ఏకాంత భక్తులు) పరమాత్మ పాదపద్మాలే పానపాత్రలు

సితాతపత్రవ్యజనైరుపస్కృతః ప్రసూనవర్షైరభివర్షితః పథి
పిశఙ్గవాసా వనమాలయా బభౌ ఘనో యథార్కోడుపచాపవైద్యుతైః

సితాతపత్రవ్యజనైరుపస్కృతః తెల్లని గొడుగు ద్వజములు, పూలవర్షం కుర్పించారు
పిశఙ్గవాసా - పసుపు బట్టలు పీతంబరం కట్టుకుని
వనమాలయా  - అన్నిరంగుల పూలమాల, వనమాల.
ఇవి అన్నీ కలిపితే - ఘన:  యథా అర్క ఉడుప చాప వైద్యుతైః  సూర్యుడు చంద్రుడు ఇంధ్రధనస్సు మెరుపు తీగలతో కూడి ఉన్న మబ్బులా ఉన్నాడు. (దీన్ని అభూత ఉపమాలంకారం )
మబ్బు - స్వామి
నక్షత్రాలు - పుష్పాలు
చంద్రుడు - సితాతపత్రం
మెరుపుతీగలు - వనమాల

ప్రవిష్టస్తు గృహం పిత్రోః పరిష్వక్తః స్వమాతృభిః
వవన్దే శిరసా సప్త దేవకీప్రముఖా ముదా

తల్లులకి నమస్కారం చేసారు (ఏడుగురు పట్టపురాణులు వసుదేవునికి ). తల్లులు కృష్ణున్ని ఆలింగనం చేసుకున్నారు.

తాః పుత్రమఙ్కమారోప్య స్నేహస్నుతపయోధరాః
హర్షవిహ్వలితాత్మానః సిషిచుర్నేత్రజైర్జలైః

ఒడిలో కుర్చోబెట్టుకుని ఆనందబాష్పాలతో స్నానం చేయించారు

అథావిశత్స్వభవనం సర్వకామమనుత్తమమ్
ప్రాసాదా యత్ర పత్నీనాం సహస్రాణి చ షోడశ

అందరికీ నమస్కరించి తన భవనానికి వెళ్ళాడు. పదుహారువేల ఎమిది ప్రాసాదాలున్న భవనానికి వెళ్ళాడు

పత్న్యః పతిం ప్రోష్య గృహానుపాగతం విలోక్య సఞ్జాతమనోమహోత్సవాః
ఉత్తస్థురారాత్సహసాసనాశయాత్సాకం వ్రతైర్వ్రీడితలోచనాననాః

భర్తను చూడగానే వారికి మనసులో మరొక కొత్త పండుగ ఆవిర్భవించింది.
సహసాసనాశయాత్సాకం - ప్రొషితవ్రతం (భర్త ఇంటిదగ్గరలేనప్పుడు అలంకారదులు చేసుకోకుండా ఉండటం, భర్త క్షేమం కోరి బ్రాహ్మణులని ఆరాధిస్తూ, త్రికాలం స్నానం చేస్తూ దేహం మీద భోగ్య బుధ్ధి కలగకుండా ఉండి) ఈ వరతం నుండి అలాగే లేచి వచ్చారు. వ్రీడితలోచనాననాః చిన్న సిగ్గు ముఖములో పోడసూపింది.

తమాత్మజైర్దృష్టిభిరన్తరాత్మనా దురన్తభావాః పరిరేభిరే పతిమ్
నిరుద్ధమప్యాస్రవదమ్బు నేత్రయోర్విలజ్జతీనాం భృగువర్య వైక్లవాత్

ఇక్కడ మూడురకాలుగా ఆలింగనం చేసుకున్నారు 1. పుత్రుల ద్వార 2. కన్నుల ద్వార 3. అంతరాత్మతో ఆలింగనం చేసుకున్నరు.
ఆనందం పెల్లుబికి ఆనంద బాష్పాలుగ బైటకువచ్చే కన్నీళ్ళు ఎంత బలవంతంగా ఆపిన అవి వచ్చేశాయి

యద్యప్యసౌ పార్శ్వగతో రహోగతస్తథాపి తస్యాఙ్ఘ్రియుగం నవం నవమ్
పదే పదే కా విరమేత తత్పదాచ్చలాపి యచ్ఛ్రీర్న జహాతి కర్హిచిత్

ఎప్పుడూ వారి దగ్గరే ఉన్నా ఆయన్ ఎప్పుడూ నిత్యనూతనం
ఎప్పుడూ తిరిగే చంచలమైన శ్రీలక్ష్మి అమ్మవారు కూడా ఈయన పాదాలను ఏ క్షణమైనా ఎప్పుడూ వదిలిపెట్టదు.

ఏవం నృపాణాం క్షితిభారజన్మనామక్షౌహిణీభిః పరివృత్తతేజసామ్
విధాయ వైరం శ్వసనో యథానలం మిథో వధేనోపరతో నిరాయుధః

ఆయుధం జోలికి పోకుండా పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యాన్ని ధ్వంసం చేసాడు. ఆయుధాలు ఉన్న వారికి వైరం పుట్టించాడు. భూమికి బరువుకల్గించడానికే పుట్టిన రాజులను సైన్యంతో కలిపి నాశనం చేసాడు.
తాను ఎవరినీ చంపకుండా, వారిలో వారే చంపుకునేట్లు చేసాడు (మిథో వధే).

స ఏష నరలోకేऽస్మిన్నవతీర్ణః స్వమాయయా
రేమే స్త్రీరత్నకూటస్థో భగవాన్ప్రాకృతో యథా

ఈ పరమాత్మ తన మాయతో మానవలోకంలో అవతరించాడు
నరునిగా అవతరించాడు కాబట్టి, మనవ ప్రలోభాలకి దూరంకాకూడదు కాబట్టి పామరుడిలాగ స్త్రీలతో రమించాడు. స్త్రీలంపటుడు ఎలా వ్యవహరిస్తాడో అలాగే వ్యవహరించాడు.

ఉద్దామభావపిశునామలవల్గుహాస
వ్రీడావలోకనిహతో మదనోऽపి యాసామ్
సమ్ముహ్య చాపమజహాత్ప్రమదోత్తమాస్తా
యస్యేన్ద్రియం విమథితుం కుహకైర్న శేకుః

భగవంతుని తమ వశం చేసుకోవాలని ప్రతీ ఒక్కరు కృష్ణుని మీద ఇవన్నీ ప్రయోగించారు
ఉద్దామమైన భావం, దాన్ని సూచించే చిరునవ్వు, వల్గు (వంకర ) హాసం, కడగంటి చూపు, కనుబొమలు కిందకీ మీదకి ఆడించుట, తలకాస్త వంచీ వంచనట్లు ఊపుతూ ఇలా 16000 వేల మంది భార్యలు ప్రయోగించారు,
ఇవన్నీ చూచి మన్మధుడే మొహం చెంది ధనుర్బాణాలు విసిరి పారిపోయాడు.
ఇంత మంది ఇంతగా ప్రయత్నించినా పరమాత్మ మనసుని చలింపచేయలేకపోయారు

తమయం మన్యతే లోకో హ్యసఙ్గమపి సఙ్గినమ్
ఆత్మౌపమ్యేన మనుజం వ్యాపృణ్వానం యతోऽబుధః

ఇలాంటి పరమాత్మను ఈ లోకం నిస్సంగుడైనా స్త్రీసంగుడని చెప్పుకుంటారు
ఎవరికి వారు వారితో పోల్చుకుని (ఆత్మౌపమ్యేన ) పరమాత్మని పోల్చుకోలేకపోతున్నారు

ఏతదీశనమీశస్య ప్రకృతిస్థోऽపి తద్గుణైః
న యుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయా

దీన్నే ఈశత్వం అంటారు. ఇదే ఆయన శాసకత్వం. ప్రకృతిలోనే ఉండి ప్రకృతి గుణములతో అంటుకోబడడు.
ఎలా ఐతే ఆత్మకు ఎలాంటి గుణాలు అంటవో.  మహత్ ప్రకృతి తత్వాలకు పైన ఉండే పరమాత్మకు ఏ గుణాలు అంటవు

తం మేనిరేऽబలా మూఢాః స్త్రైణం చానువ్రతం రహః
అప్రమాణవిదో భర్తురీశ్వరం మతయో యథా

స్వామిని స్త్రీలోలుడని తన భర్త యొక్క ప్రమాణం తెలియక అనుకున్నారు. మన బుధ్ధితో ప్రవృత్తితో పరమాత్మను ఎలా భావిస్తామో కృష్ణ పరమాత్మను భార్యలు కూడా అలాగే భావించారు.

Sunday, November 25, 2012

అంతరాదిత్య ఉపాసన

కిరణములతోనే అందరిలో ఉంటాడు కాబట్టి - గోవిష్ఠ అని సూర్యునికి పేరు. వైకుంఠంలో ఉన్న పురుషుడే సూర్యుడిలో ఉన్నాడు. అదే పురుషుడు మన కంటిలో ఉన్నాడు. ఆయన్ను ఉపాసించడమే అంతరాదిత్య ఉపాసన. మన కంటిలోనే ఉన్నవాడే పరమాత్మ అనే భావన. ఉపనిషత్తుల్లో ఉన్న 32 విద్యల్లో ఈ అంతరాదిత్య ఉపాసన ఒకటి.
అలాగే శ్రోత్రంలో ఉన్న ఆకాశం వైకుంఠంలో ఉన్న ఆకాశం ఒకటే. అలా మనం కూర్చుని ఒక్కొక్క ఇంద్రియములో మనం ధ్యానం చేసి అందులో ఉన్న పరమాత్మని ధ్యానం చెయ్యడం ఒక విధానం. మన శరీరంలో ఉన్న అవయవాల్లోనే పరమాత్మ అధిష్టించి ఉన్నాడు అనే భావన చెయ్యాలి.

Saturday, November 24, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదవ అధ్యాయం

శౌనక ఉవాచ
హత్వా స్వరిక్థస్పృధ ఆతతాయినో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః
సహానుజైః ప్రత్యవరుద్ధభోజనః కథం ప్రవృత్తః కిమకారషీత్తతః

ధర్మ పరిపాలించడంలో శ్రేష్టుడైన ధర్మరాజు ఆతతాయులైన వారిని సంహరించి తమ్ములతో కలిసి రాజ్యానుభవాన్ని భోగానుభవాని తిరస్కరించినవాడు (ప్రత్యవరుద్ధభోజనః ) రాజుగా ఎలా పరిపాలించాడు

సూత ఉవాచ
వంశం కురోర్వంశదవాగ్నినిర్హృతం సంరోహయిత్వా భవభావనో హరిః
నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరో యుధిష్ఠిరం ప్రీతమనా బభూవ హ

వెదురు బొంగుల వనంలో పుట్టిన అగ్ని (వంశ దవాగ్ని నిర్హృతం )లాగ కాలబడిన కురువంశాన్ని నిర్వంశం కాకుండా కాపాడి మొలకెత్తింపచేసి (సంరోహయిత్వా )  సంసారాన్ని ఉత్పన్నం చేసే హరి (భవభావనో హరిః)
యుధిస్టిరున్ని రాజ్యంలో నియమించి సంతోషించాడు

నిశమ్య భీష్మోక్తమథాచ్యుతోక్తం ప్రవృత్తవిజ్ఞానవిధూతవిభ్రమః
శశాస గామిన్ద్ర ఇవాజితాశ్రయః పరిధ్యుపాన్తామనుజానువర్తితః

బీష్ముని మాటని కృష్ణుని మాటని విని కలిగిన జ్ఞ్యానంతో విభ్రమాలు తొలగి (ప్రవృత్తవిజ్ఞానవిధూతవిభ్రమః)
ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలించినట్లుగా కృష్ణున్ని ఆశ్రయించి తమ్ములు అనుసరించి ఉండగా పరిపాలించాడు.

కామం వవర్ష పర్జన్యః సర్వకామదుఘా మహీ
సిషిచుః స్మ వ్రజాన్గావః పయసోధస్వతీర్ముదా

ధర్మరాజు ధర్మగా పరిపాలించడనడానికి గుర్తుగా కోరినప్పుడల్లా వర్షం కురిసేది. నెలకు మూడువానలే కాకుండా కావలసినప్పుడు కూడా వర్షం వచ్చేది. భూమి కూడా కోరినదన్ని ఇస్తూ ఉన్నది (సర్వకామదుఘా మహీ). ఏ పంట కావాలంటే ఆ పంట.
ఆవులు కూడు పాలునిండిన పొదుగుతో తమ పాలతో ప్రజలందరినీ తడిపేవి. ఈ మూడు ధర్మబద్దంగా రాజు ఉంటే వస్తాయి

నద్యః సముద్రా గిరయః సవనస్పతివీరుధః
ఫలన్త్యోషధయః సర్వాః కామమన్వృతు తస్య వై

ఏ ఏ ఋతువులో ఏ ఏ పళ్ళు కాయలు పంటలు పండాలో ఆయా ఋతువులకు అనుగుణంగా ఉండేవి.

నాధయో వ్యాధయః క్లేశా దైవభూతాత్మహేతవః
అజాతశత్రావభవన్జన్తూనాం రాజ్ఞి కర్హిచిత్

మాన్సిక చింతలూ వ్యాధులు బాధలూ లేవు. (రాముడు బాధపడతాడని అయోధ్యవాసులు తమలో తాము పేచీ పెట్టుకోలేదు). ఆధ్యాత్మక ఆదిదైవిక ఆదిబూత తాపత్రయాలు లేవు
రాజు యందు ప్రజలకు ప్రీతి కలిగింది


ఉషిత్వా హాస్తినపురే మాసాన్కతిపయాన్హరిః
సుహృదాం చ విశోకాయ స్వసుశ్చ ప్రియకామ్యయా
ఆమన్త్ర్య చాభ్యనుజ్ఞాతః పరిష్వజ్యాభివాద్య తమ్
ఆరురోహ రథం కైశ్చిత్పరిష్వక్తోऽభివాదితః

తన చెల్లెలకు ప్రీతి కలిగించడానికి (స్వసుశ్చ ప్రియకామ్యయా), మిత్రుల ప్రీతి కొరకూ ఉన్న కృష్ణుడు ధర్మరాజాదుల అనుమతి పొంది, కొంతమందికి నమస్కారం చేసి (ధర్మరాజు భీముడు మొ), కొంతమందికి ఆశీర్వదించి కొంతమందిని ఆలింగనం చేసుకుని రధం ఎక్కాడు

సుభద్రా ద్రౌపదీ కున్తీ విరాటతనయా తథా
గాన్ధారీ ధృతరాష్ట్రశ్చ యుయుత్సుర్గౌతమో యమౌ
వృకోదరశ్చ ధౌమ్యశ్చ స్త్రియో మత్స్యసుతాదయః
న సేహిరే విముహ్యన్తో విరహం శార్ఙ్గధన్వనః

ఇన్నాళ్ళు ఉన్నా మాళ్ళి బయలుదేరుతుంటే (సుభద్ర దరుపతి కుంతి ఉత్తర గాంధారి దృతరాష్టుడు మొ వాళ్ళు) పరమాత్మ యొక్క విరహాన్ని భరించలేక

సత్సఙ్గాన్ముక్తదుఃసఙ్గో హాతుం నోత్సహతే బుధః
కీర్త్యమానం యశో యస్య సకృదాకర్ణ్య రోచనమ్

సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యం వల్ల వచ్చిన పాపం పోయి. భగవంతుని తనలో ఉంచుకుని, భగవంతుడు తనలో ఉన్నాడు అని తెలుస్కున్న వాడు సత్. వాడే ఉన్నవాడు. దుస్సంగాన్ని వదిలించే సత్సంగాన్ని జ్ఞ్యాని వదిలిపెట్టడు (నోత్సహతే బుధః). ఒక్కసారి విన్నంత మాత్రానే మళ్ళి అదే వినాలి అనిపించే భగవానుని కీర్తి

తస్మిన్న్యస్తధియః పార్థాః సహేరన్విరహం కథమ్
దర్శనస్పర్శసంలాప శయనాసనభోజనైః

ఎవరి కథను గానం చేస్తేనే వింటేనే ఇంకా వినాలని అనుకుంటామో అలాంటి మహనుభావుని విరహాన్ని ఎల సహిస్తారు. పక్కన కూర్చుండి, ముట్టుకుని, భుజుంచి...

సర్వే తేऽనిమిషైరక్షైస్తమను ద్రుతచేతసః
వీక్షన్తః స్నేహసమ్బద్ధా విచేలుస్తత్ర తత్ర హ

ఇన్ని రకాల అనుబంధాన్ని పెంచుకున్న స్వామి వెళ్తుంటే రెప్ప వెయ్యడం మర్చిపోయి అనిమిషులయ్యారు
వీరి మనసులు ఆయనయందే పరిగెడుతోంది. తమలో తామే పరితపిస్తూ ఉన్నారు

న్యరున్ధన్నుద్గలద్బాష్పమౌత్కణ్ఠ్యాద్దేవకీసుతే
నిర్యాత్యగారాన్నోऽభద్రమితి స్యాద్బాన్ధవస్త్రియః

రాబోతున్న నీళ్ళను నిగ్రహించుకుని, సాంప్రదాయం కాదని కులస్త్రీలు (రాజ స్త్రీలు)సాగనంపడానికిరాకూడదని బలవంతంగా ఇద్దరూ ఆపుకున్నారు

మృదఙ్గశఙ్ఖభేర్యశ్చ వీణాపణవగోముఖాః
ధున్ధుర్యానకఘణ్టాద్యా నేదుర్దున్దుభయస్తథా

మంగళ వాద్యాలు దుంధుబులు మోగాయి

ప్రాసాదశిఖరారూఢాః కురునార్యో దిదృక్షయా
వవృషుః కుసుమైః కృష్ణం ప్రేమవ్రీడాస్మితేక్షణాః
సితాతపత్రం జగ్రాహ ముక్తాదామవిభూషితమ్
రత్నదణ్డం గుడాకేశః ప్రియః ప్రియతమస్య హ

అర్జునుడు చత్రాన్ని పట్టుకున్నాడు. గుడాకేశ - నిద్రను తన వశంలో ఉంచుకున్నవాడు అర్జనుడు

ఉద్ధవః సాత్యకిశ్చైవ వ్యజనే పరమాద్భుతే
వికీర్యమాణః కుసుమై రేజే మధుపతిః పథి

ఉధ్ధవ సాత్యకులు రెండు పక్కలా నిల్బడారు చామరాలతో. రాజమార్గం లో పూలు జల్లుతుంటే హరి ప్రకాశంతో శొభిస్తున్నాడు

అశ్రూయన్తాశిషః సత్యాస్తత్ర తత్ర ద్విజేరితాః
నానురూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః

బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్నారు. తగిన మంగళాశాసనాలు తగని ఆశీర్వాదాలు (నానురూపానురూపాశ్చ ) విని పరమాత్మ ఆమోదించాడు. మనం చేసే ప్రతీ దాన్ని పరమత్మ ప్రేమతో స్వీకరిస్తాడు

అన్యోన్యమాసీత్సఞ్జల్ప ఉత్తమశ్లోకచేతసామ్
కౌరవేన్ద్రపురస్త్రీణాం సర్వశ్రుతిమనోహరః

కృష్ణుడు ఎక్కడా తన దివ్యత్వాన్ని మరుగుపరుచుకోడు.  అందుకే అక్కడ ఉన్న స్త్రెలు ఈ విధంగా అన్నారు

స వై కిలాయం పురుషః పురాతనో య ఏక ఆసీదవిశేష ఆత్మని
అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్నిశి సుప్తశక్తిషు

ఈయన పురాణ పురుషుడు. ఎలాంటి విశెషాలు లేకుండా తనలో తానే ఒక్కడుగా పడుకుని ఉన్నాడు. ప్రకృతి అహంకారం మహత్ - సత్వ రజ తమ గుణాలు ఇవన్నీ ఉత్పన్నం కాకముందు వాటి శక్తులన్నీ నిద్రించి ఉన్నప్పుడు ఎవ్వడైతే ఉన్నాడో ఆయనే ఈ కృష్ణుడు.

స ఏవ భూయో నిజవీర్యచోదితాం స్వజీవమాయాం ప్రకృతిం సిసృక్షతీమ్
అనామరూపాత్మని రూపనామనీ విధిత్సమానోऽనుససార శాస్త్రకృత్

అలాంటి పరమాత్మే తన శక్తితోటి ప్రేరేపించబడి యోగమాయగా ఉన్న ప్రకృతిని సృష్టించాలని కోరిక గలగజేసి నామ రూపాలు లేని ప్రకృతికి, సృష్టిని కోరుతున్న, నామరూపలు లేని ప్రకృతికి నామరూపలు సృష్టించి శాస్త్రానుగుణంగా (బ్రహమను సృష్టించి వేదానుగుణంగా ప్రకృతిని సృష్టించాడు)

స వా అయం యత్పదమత్ర సూరయో జితేన్ద్రియా నిర్జితమాతరిశ్వనః
పశ్యన్తి భక్త్యుత్కలితామలాత్మనా నన్వేష సత్త్వం పరిమార్ష్టుమర్హతి

ఎవరి స్థానాన్ని (యత్పదమత్ర ) ఇంద్రియజయం కలిగి ప్రాణవాయువు నిర్జించి కలిగినవారు భక్తితో పరిశుద్దమైన మనసుకలిగినవారు ఏ లోకాన్ని చూడగలరో ఆయన ఈయనే(స్ వా) కదూ. ఈయన మా కష్టాన్ని తొలగించాలి

స వా అయం సఖ్యనుగీతసత్కథో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః
య ఏక ఈశో జగదాత్మలీలయా సృజత్యవత్యత్తి న తత్ర సజ్జతే

పరమరహస్యమైన వేదములో గానం చేసే కధలు ఈయనవే. ఇతను తన లీలతో సకల చరాచర జగత్తుని సృష్టించి రక్షించి సంహరిస్తున్నాడు కాని అసలు దానిలో ఈయన చిక్కుకోడు  (న తత్ర సజ్జతే)

యదా హ్యధర్మేణ తమోధియో నృపా జీవన్తి తత్రైష హి సత్త్వతః కిల
ధత్తే భగం సత్యమృతం దయాం యశో భవాయ రూపాణి దధద్యుగే యుగే

జగత్తు మొత్తాన్ని సృష్టించి కాపాడి సంహరించేవాడు ఇక్కడెందుకు ఉన్నాడు? ఎలా అయితే తామసమైన బుధ్ధి కలిగిన రాజులు అధర్మంతో కలుషితం చేసారు అక్కడ ఈ పరమాత్మ శరీరాన్ని (భగం ) ధరిస్తాడు. సత్యం ఋతం దయ కీర్తి అనే నాలుగు తీసుకుని, ప్రపంచం నిలుచుటకు (భవాయ ) ప్రతీయుగంలో రూపం ధరించి వస్తాడు.

అహో అలం శ్లాఘ్యతమం యదోః కులమహో అలం పుణ్యతమం మధోర్వనమ్
యదేష పుంసామృషభః శ్రియః పతిః స్వజన్మనా చఙ్క్రమణేన చాఞ్చతి

ఇంతకాలానికి యదువంశం ధన్యమైంది, మధురా నగరం ధన్యమైంది. ఎందుకంటే ఈ శ్రియ: పతి, పురుషోత్తముడు తన పుట్టుకతో నడవడితో (చఙ్క్రమణేన ) యదువంశాన్ని మధురానగరాన్ని మన్నించడు పావనం చేసాడు (చాఞ్చతి)

అహో బత స్వర్యశసస్తిరస్కరీ కుశస్థలీ పుణ్యయశస్కరీ భువః
పశ్యన్తి నిత్యం యదనుగ్రహేషితం స్మితావలోకం స్వపతిం స్మ యత్ప్రజాః

వైకుంఠపు కీర్తిని చిన్నబోయినట్లుగా చేసిన నగరం కుశస్థలీ (ద్వారక). భూమికి కీర్తి పెంచేది.
పరమాత్మ దయతో ఆవిర్భవించిన పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తున్నారు పశ్యంతి నిత్యం (సదా పశ్యంతి సూరయ:).

నూనం వ్రతస్నానహుతాదినేశ్వరః సమర్చితో హ్యస్య గృహీతపాణిభిః
పిబన్తి యాః సఖ్యధరామృతం ముహుర్వ్రజస్త్రియః సమ్ముముహుర్యదాశయాః

రతములు స్నానములు పూజలు యజ్ఞ్యములు వాటితో వారు బాగా ఆరాధించి ఉంటారు . ఇది నిశ్చయం (నూనం ) చేతులతో గట్టిగా పట్టుకుని స్వామి అధరామృతాన్ని పానం చేసిన గోపికలు ఎన్ని పూజలు చేసారో.
దేవతలు మూర్చపోయేట్లు చేసారు వీరు (సమ్ముముహుర్యదాశయాః). ఇటువంటి పుణ్యాన్ని ఎవరూ చేసి ఉండరు

యా వీర్యశుల్కేన హృతాః స్వయంవరే ప్రమథ్య చైద్యప్రముఖాన్హి శుష్మిణః
ప్రద్యుమ్నసామ్బామ్బసుతాదయోऽపరా యాశ్చాహృతా భౌమవధే సహస్రశః
ఏతాః పరం స్త్రీత్వమపాస్తపేశలం నిరస్తశౌచం బత సాధు కుర్వతే
యాసాం గృహాత్పుష్కరలోచనః పతిర్న జాత్వపైత్యాహృతిభిర్హృది స్పృశన్

స్వయంగా చిన్న సందేశం పంపితే వచ్చితీసుకుని పోయాడు. కాని సకలలోకాలను పీడిస్తున్న నరకాసురున్ని చంపి అతను బంధించిన స్త్రీలను తీసుకుని వచ్చాడు. ఇందులో ఎవరు అదృష్టవంతులు? రుక్మిణి సందేశం పంపింది. ఈ పదహారువేలమంది కబురు కూడా పంపలేదు. వారెంత అదృష్టవంతులో. మాటిమాటికీ వారు కృష్ణుణ్ణే చూస్తారు.  యాసాం గృహాత్పుష్కరలోచనః పతి: - పుష్కరం అంటే పద్మం. పుండరీకాక్షుడు. ఆహృతిభిర్హృది స్పృశన్ - ఎప్పుడూ వారి హృదయంలోనే ఉండి వారి ఇంటినే అంటిపెట్టుకుని ఉంటాడు.

ఏవంవిధా గదన్తీనాం స గిరః పురయోషితామ్
నిరీక్షణేనాభినన్దన్సస్మితేన యయౌ హరిః

ఇలా మాట్లాడుతున్న వారి మాటలని వింటూ క్రీగంటి చూపుతో చూస్తు చిరునవ్వుతో అభినందిస్తూ బయలుదేరాడు

అజాతశత్రుః పృతనాం గోపీథాయ మధుద్విషః
పరేభ్యః శఙ్కితః స్నేహాత్ప్రాయుఙ్క్త చతురఙ్గిణీమ్

చతురంగ సైన్యాన్ని అతని వెంట ప్రేమతో పంపాడు ధర్మరాజు

అథ దూరాగతాన్శౌరిః కౌరవాన్విరహాతురాన్
సన్నివర్త్య దృఢం స్నిగ్ధాన్ప్రాయాత్స్వనగరీం ప్రియైః

వారు చాల దూరం వెంట వచ్చారిని వెనక్కి పంపించి వారు పడుతున్న బాధని చిరునవ్వుతో తొలగించాడు.

కురుజాఙ్గలపాఞ్చాలాన్శూరసేనాన్సయామునాన్
బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్సారస్వతానథ

ఆయ దేశలను దాటుకుంటూ

మరుధన్వమతిక్రమ్య సౌవీరాభీరయోః పరాన్
ఆనర్తాన్భార్గవోపాగాచ్ఛ్రాన్తవాహో మనాగ్విభుః

ఆనర్తాన్ - ద్వారకానగరమున్న దేశంపేరు ఆనర్తదేశం. శూర్సేనుడు పరిపాలించే దేశం.
గుఱ్ఱాలు కూడా కాస్త అలిసి ఉన్నాయి

తత్ర తత్ర హ తత్రత్యైర్హరిః ప్రత్యుద్యతార్హణః
సాయం భేజే దిశం పశ్చాద్గవిష్ఠో గాం గతస్తదా

అక్కడి వరకూ వచ్చే మార్గ మధ్యంలో ఆయా దేశరాజులు మర్యాద చేసారు. ఇలా సాయంకాలానికి గవిష్టుడు (సూర్యుడు)  గాం (పశ్చిమ) దిక్కుకు వెళ్ళే సమయానికి చేరుకున్నాడు
కిరణములతోనే అందరిలో ఉంటాడు కాబట్టి - గోవిష్ఠ అని సూర్యునికి పేరు. వైకుంఠంలో ఉన్న పురుషుడే సూర్యుడిలో ఉన్నాడు. అదే పురుషుడు మన కంటిలో ఉన్నాడు. ఆయన్ను ఉపాసించడమే అంతరాదిత్య ఉపాసన. మన కంటిలోనే ఉన్నవాడే పరమాత్మ అనే భావన. ఉపనిషత్తుల్లో ఉన్న 32 విద్యల్లో ఈ అంతరాదిత్య ఉపాసన ఒకటి.
అలాగే శ్రోత్రంలో ఉన్న ఆకాశం వైకుంఠంలో ఉన్న ఆకాశం ఒకటే. అలా మనం కూర్చుని ఒక్కొక్క ఇంద్రియములో మనం ధ్యానం చేసి అందులో ఉన్న పరమాత్మని ధ్యానం చెయ్యడం ఒక విధానం. మన శరీరంలో ఉన్న అవయవాల్లోనే పరమాత్మ అధిష్టించి ఉన్నాడు అనే భావన చెయ్యాలి.

Friday, November 23, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

 శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

సూత ఉవాచ
ఇతి భీతః ప్రజాద్రోహాత్సర్వధర్మవివిత్సయా
తతో వినశనం ప్రాగాద్యత్ర దేవవ్రతోऽపతత్

ఎంతో మందికి ద్రోహం చేసాను నా పాపాన్ని తొలగించుకోలెనని భయపడుతున్న ధర్మరాజు దేవవ్రతుడు (బీష్ముడు) పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు.

తదా తే భ్రాతరః సర్వే సదశ్వైః స్వర్ణభూషితైః
అన్వగచ్ఛన్రథైర్విప్రా వ్యాసధౌమ్యాదయస్తథా

వ్యాసుడు దౌమ్యుడు (పురోహితుడు) అర్జునితో కూడిన కృష్ణుడు అక్కడికి వచ్చి,

భగవానపి విప్రర్షే రథేన సధనఞ్జయః
స తైర్వ్యరోచత నృపః కువేర ఇవ గుహ్యకైః
దృష్ట్వా నిపతితం భూమౌ దివశ్చ్యుతమివామరమ్
ప్రణేముః పాణ్డవా భీష్మం సానుగాః సహ చక్రిణా
తత్ర బ్రహ్మర్షయః సర్వే దేవర్షయశ్చ సత్తమ
రాజర్షయశ్చ తత్రాసన్ద్రష్టుం భరతపుఙ్గవమ్
పర్వతో నారదో ధౌమ్యో భగవాన్బాదరాయణః
బృహదశ్వో భరద్వాజః సశిష్యో రేణుకాసుతః
వసిష్ఠ ఇన్ద్రప్రమదస్త్రితో గృత్సమదోऽసితః
కక్షీవాన్గౌతమోऽత్రిశ్చ కౌశికోऽథ సుదర్శనః
అన్యే చ మునయో బ్రహ్మన్బ్రహ్మరాతాదయోऽమలాః
శిష్యైరుపేతా ఆజగ్ముః కశ్యపాఙ్గిరసాదయః

అందరూ బీష్మునికి నమస్కరిచారు
వారే కాకుండా బ్రహ్మర్షులు దేవర్షులు కూడా వచ్చారు (పరశురాముడు అత్రి మొదలైన వారందరూ  )

తాన్సమేతాన్మహాభాగానుపలభ్య వసూత్తమః
పూజయామాస ధర్మజ్ఞో దేశకాలవిభాగవిత్

తనకు ఎలాంటి శక్తీ లేకున్నా దేశమూ కాలమూ తెలిసినవాడు.  ఆయనను పూజించారు

కృష్ణం చ తత్ప్రభావజ్ఞ ఆసీనం జగదీశ్వరమ్
హృదిస్థం పూజయామాస మాయయోపాత్తవిగ్రహమ్

కృష్ణుడి ప్రభావం బీష్ముడికి తెలుసు. అలాంటి కృష్ణుడు ఒక పక్కగా కూర్చున్నాడు. ఇతన్ని పూజించడానికి అఖిల భూతాంతర్యామి అయిన స్వామిని పూజించి. బయట ఉన్న ఆకారం కేవలం యోగమాయతో ధర్మరక్షణకు తీసుకున్న ఆకారం.

పాణ్డుపుత్రానుపాసీనాన్ప్రశ్రయప్రేమసఙ్గతాన్
అభ్యాచష్టానురాగాశ్రైరన్ధీభూతేన చక్షుషా

వినయంతోనూ ప్రేమతోను కలవడానికి వచ్చిన పాండవులని చూచి

అహో కష్టమహోऽన్యాయ్యం యద్యూయం ధర్మనన్దనాః
జీవితుం నార్హథ క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాః

ధర్మస్వరూపులు మీరు ఇన్ని కష్టాలతో బ్రతికారు. విప్రధర్మాన్ని, కృష్ణపరమాత్మను ఆశ్రయించారు. అయినా కష్టాలు పడ్డారు

సంస్థితేऽతిరథే పాణ్డౌ పృథా బాలప్రజా వధూః
యుష్మత్కృతే బహూన్క్లేశాన్ప్రాప్తా తోకవతీ ముహుః3

సంస్థితేऽతిరథే పాణ్డౌ - మీరు చిన్న వాళ్ళుగానే ఉన్నప్పుడు పాండుమహరాజు స్వర్గానికి వెళ్ళాడు. మిమ్ములను పెంచడానికి మీ తల్లి కుంతి ఎన్ని కష్టాలో పడింది.

సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియమ్
సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలిః

ఈ కష్టాలన్ని కాలం వల్ల వచ్చినవి. మబ్బులెలా గాలి ఆధీనంలో ఉంటాయో సకల లోక పాలకులు కూడా ఆ కాలం వశంలో నే ఉంటారు

యత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్వృకోదరః
కృష్ణోऽస్త్రీ గాణ్డివం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్

ఇదంతా కాలాధీనమండానికి మీరే ఉదాహరణం: ధర్మసుతుడైన రాజు, గదాపాణి అయిన భీముడు, గాండీవం పట్టుకున్న అర్జునుడు, కృష్ణుడు మిత్రుడు. ఇన్ని వుండికూడా అన్నీ ఆపదలే.

న హ్యస్య కర్హిచిద్రాజన్పుమాన్వేద విధిత్సితమ్
యద్విజిజ్ఞాసయా యుక్తా ముహ్యన్తి కవయోऽపి హి

ఈయన ఎమి చెయ్యాలనుకుంటాడో ఎవరికీ తెలీదు.
పరమాత్మ చెయ్యదలచుకున్నది తెలుసుకుందామని ప్రయతించినవారందరూ జ్ఞ్యానులతో సహా మోహంలో మునిగిపోయారు

తస్మాదిదం దైవతన్త్రం వ్యవస్య భరతర్షభ
తస్యానువిహితోऽనాథా నాథ పాహి ప్రజాః ప్రభో

కాబట్టి ఇదంతా దైవతంత్రమని తెలుసుకో మనచేతిలో ఎమీ లేదు
అలాంటి పరమాత్మ ఇచ్చిన అవకాశాన్ని తీసుకో. అనాధులకి నాధుడివి అవ్వు, ప్రజలను పరిపాలించు

ఏష వై భగవాన్సాక్షాదాద్యో నారాయణః పుమాన్
మోహయన్మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు

ఈ కృష్ణుడు నారాయణుడు ఆదిపురుషుడు. సకలలోకాలను తన మాయతో మోహింపచేస్తూ యాదవ వంశంలో సంచరిస్తున్నాడు కానీ ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే

అస్యానుభావం భగవాన్వేద గుహ్యతమం శివః
దేవర్షిర్నారదః సాక్షాద్భగవాన్కపిలో నృప

ఈయన మాహత్మ్యం పరమశివునికి కొంత అర్థమవుతుంది, నారదునికి కొంత, కపిలునికి కొంత అర్థమవుతుంది.

యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమమ్
అకరోః సచివం దూతం సౌహృదాదథ సారథిమ్

మేనమామ కొడుకు మాకు మిత్రుడు సారధిగా మంత్రిగా దూతగా ఏర్పాటుచేసుకున్నావు

సర్వాత్మనః సమదృశో హ్యద్వయస్యానహఙ్కృతేః
తత్కృతం మతివైషమ్యం నిరవద్యస్య న క్వచిత్

కృష్ణుడు మావాడని నీకు ఉన్నది కానీ ఆయన సర్వాత్మన  - అందరికీ ఆత్మ. అందరినీ సమానంగా చూసేవాడు ఎందుకంటే అద్వయస్య - ఆయనకు ద్వయమే లేదు. అలాంటివాడికి, ఏదీ అంటని వాడికి (నిరవద్య) మీ మీద ప్రేమా వారిమీద ద్వేషం ఉండదు.

తథాప్యేకాన్తభక్తేషు పశ్య భూపానుకమ్పితమ్
యన్మేऽసూంస్త్యజతః సాక్షాత్కృష్ణో దర్శనమాగతః

తనను నమ్మిన వారి మీద స్వామికి ఎంత దయో చూడు. మరికొద్దిసేపట్లో ప్రాణాలను విడవబోతున్న నాకు సాక్షత్ కృష్ణుడు దర్శనమిచ్చాడు.

భక్త్యావేశ్య మనో యస్మిన్వాచా యన్నామ కీర్తయన్
త్యజన్కలేవరం యోగీ ముచ్యతే కామకర్మభిః

ఎలాంటి మహానుభావున్ని భక్తి నిండిన మనసుతో ధ్యానిస్తూ శరీరాన్ని విడిచిపెట్టీయోగి  మోక్షానికి పోతారో అటువంటి పరమాత్మ నా ఎదురుగా వచ్చాడు.

స దేవదేవో భగవాన్ప్రతీక్షతాం కలేవరం యావదిదం హినోమ్యహమ్
ప్రసన్నహాసారుణలోచనోల్లసన్ముఖామ్బుజో ధ్యానపథశ్చతుర్భుజః

అటువంటి పరమాత్మ నేను శరీరం విడిచిపెట్టే దాక ఇక్కడే ఉండి ఎదురుచూచుగాక
ప్రసన్నమైన చిరునావు, దయ, విశాలనేత్రాలు, ఆ నేత్రాలతో ప్రకాశించే అందమైన ముఖపద్మములు కలిగి నా ధ్యాన పధంలో చతుర్భుజుడుగా ఉన్నాడు. కనులతో కూడా ఆనందంగా చూచే అదృష్టాన్ని కలిగించనీ


సూత ఉవాచ
యుధిష్ఠిరస్తదాకర్ణ్య శయానం శరపఞ్జరే
అపృచ్ఛద్వివిధాన్ధర్మానృషీణాం చానుశృణ్వతామ్

ఋషులందరూ వింటుండగా అన్ని ధర్మాలను అడిగాడు. (ఇవే ఒకటి శాంతి పర్వం ఇంకోటి అనుశాసన పర్వం - 29000 శ్లోకాలు. కథకు యెటువంటి సంభందమూ లేక కేవలం ధర్మాల గురించే వుంది. ఆపధర్మాలు రాజ స్త్రీ మిత్ర మోక్ష ధర్మాలు శాంతి పర్వం, వేద పురాణ ఆత్మ దేహ స్వరూప ధర్మాలు అనుశాసనిక పర్వంలో. దేహసంబంధం లేనప్పుడు ఆత్మ ఎలా విహరిస్తుంది. దేహం వచ్చిన తరువాత మనసుకి బుధ్ధికి దోషం అంటకుండా సంచరించే విధానం. అన్ని ధర్మాలు ఆపద లేనప్పుడు. ఆపద వచ్చినపుడు మార్పులు చేసుకోవచ్చు. ఇవన్నీ ధర్మాలు ధర్మరాజు చేత అడిగించి చెప్పాడు. శరీరానికి బాధ కలిగితే కష్టం కాదు, ఆత్మకి ఇబ్బంది కలిగితే అది కష్టం. )

పురుషస్వభావవిహితాన్యథావర్ణం యథాశ్రమమ్
వైరాగ్యరాగోపాధిభ్యామామ్నాతోభయలక్షణాన్

దానధర్మాన్రాజధర్మాన్మోక్షధర్మాన్విభాగశః
స్త్రీధర్మాన్భగవద్ధర్మాన్సమాసవ్యాసయోగతః

ఇలా ధర్మ విభాగం చేసి చెప్పాడు. కొన్ని సంక్షేపంగా కొన్ని విస్తృతంగా చెప్పాడు

ధర్మార్థకామమోక్షాంశ్చ సహోపాయాన్యథా మునే
నానాఖ్యానేతిహాసేషు వర్ణయామాస తత్త్వవిత్

ధర్మార్థ కామమోక్షాలను పొందటానికి ఉపాయలని చెప్పాడు.
ధర్మాలని ధర్మాలగానే కాకుండా కథా దుష్టాంతంతో చెప్పాడు
ఉదాహరణకు సులబా జనక సంవాదం

ధర్మం ప్రవదతస్తస్య స కాలః ప్రత్యుపస్థితః
యో యోగినశ్ఛన్దమృత్యోర్వాఞ్ఛితస్తూత్తరాయణః

ఇలా చెప్తుండగా ఆ కాలం వచ్చింది. ఉత్తరాయణ కాలాన్ని కోరుకున్నాడు. ఆ కాలం వచ్చింది

తదోపసంహృత్య గిరః సహస్రణీర్విముక్తసఙ్గం మన ఆదిపూరుషే
కృష్ణే లసత్పీతపటే చతుర్భుజే పురః స్థితేऽమీలితదృగ్వ్యధారయత్

అంతవరకూ మాట్లాడిన వేల వేల మాటలను ఉపసంహరించి మనసులో కోరికలనూ దూరం చేసి
పట్టుపీతాంబరలాను కట్టుకున్న, చతుర్భుజుడైన ఆదిపురుషుడైన కృష్ణున్ని కనులు తెరిచి అతన్నే చూస్తూ, బుధ్ధి మనసు ఆయనలో లీనం చేసి
(ఇక్కడ బంగారమంటే వ్యామోహం, అలాంటి బంగరంతో చేసిన పీతంబరాన్ని కట్టుకున్నాడు, బంగారం వ్యామోహానికి సంకేతం. మనకు ప్రకృతిమీద ఉన్న వ్యామోహాన్ని తొలగించడానికి ఆ పీతంబరం )

విశుద్ధయా ధారణయా హతాశుభస్తదీక్షయైవాశు గతాయుధశ్రమః
నివృత్తసర్వేన్ద్రియవృత్తివిభ్రమస్తుష్టావ జన్యం విసృజఞ్జనార్దనమ్
 పరమాత్మలోనే మనసుబుధ్ధి దారణ చేసి పాపాలు తొలగించుకొని. ఇంతవరు కనుబొమ్మలనుంచి బొటనవేలి వరకూ ఉన్న బాణాల బాధ తొలగింది
సర్వేంద్రియ వృత్తులు అన్నీ తమ తమ పనులను మానేసి, సకల ప్రపంచ సృష్టి వికారమునకు కారణమైన జనార్థనున్ని (సకాలంలో మృత్యువిచ్చి బంధాలను తొలగించి కాపాడే వాన్ని ) స్తుతిస్తూ

శ్రీభీష్మ ఉవాచ
ఇతి మతిరుపకల్పితా వితృష్ణా భగవతి సాత్వతపుఙ్గవే విభూమ్ని
స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవప్రవాహః

సంసారికి విషయభోగంలో ఉన్నమనకి పరమాత్మ యందు మనసు లగ్నం అవ్వాలంటే ప్రాపంచిక విషయాలమీద అన్నిరకములు ఆశలు వీడిన బుధ్ధి పరమాత్మ ఏర్పరచాలి.ఆ బుధ్ధి పరమాత్మ ఏరపర్చినదే. ఆ భగవానుడే సాత్వతపుంగవుడు - జ్ఞ్యానులలో శ్రేష్టుడు. జ్ఞ్యానులందరికీ ఆశ్రయము. విభూమ్ని - ప్రపంచంలో అందరికంటే శ్రేష్టుడు సర్వ వ్యాపకుడు. ప్రతీ అణువులో ఉన్నాడు కాబట్టి విభూమ్ని. స్వసుఖముపగతే  - ఇన్ని చోట్లా ఉండి ఇన్ని మార్పులు చేస్తూ కూడా ఆయన ఆత్మా రాముడు. ఎవరివలనా తాను కొత్తగా అనందం పొందవలసిన పని లేని వాడు.
క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి - అంతర్యామిగా ఉన్నవాడు మన ముందు ఎందుకు కనపడుతున్నాడు. స్వామి కాస్త విహరించడానికి వచ్చాడు.
యద్భవప్రవాహః - ఆ పరమాత్మ యొక్క సంకల్పమే ఈ అఖండమైన సంసార ప్రభావం.
అటువంటి పరమాత్మ యందు నా మనసు ఆశలేని బుధ్ధి లగ్నమై ఉండుగాక

త్రిభువనకమనం తమాలవర్ణం రవికరగౌరవరామ్బరం దధానే
వపురలకకులావృతాననాబ్జం విజయసఖే రతిరస్తు మేऽనవద్యా

త్రిభువనకమనం తమాలవర్ణం - త్రిభువనాలవారికి కోరికలు రేకెత్తించే వాడు. నల్లని వర్ణం కలవాడు.
మనకి కావలసింది నిరంతరమూ మన మనసు పరమాత్మయందు లగ్నమయి ఉండాలి.
రవికరగౌరవరామ్బరం  - పరమాత్మ వస్త్రం బంగారు వర్ణం. సూర్యకిరణములవంటి రంగు కల వస్త్రం
దధానే
వపు: అలక కులావృతా ఆననాబ్జం - ముంగురులంతా ఆవరించిన ముఖముగల కృష్ణుని యందు నా మనసు ఉండని

యుధి తురగరజోవిధూమ్రవిష్వక్కచలులితశ్రమవార్యలఙ్కృతాస్యే
మమ నిశితశరైర్విభిద్యమాన త్వచి విలసత్కవచేऽస్తు కృష్ణ ఆత్మా

గుఱ్ఱముల డెక్కలదుమ్ము స్వామి మొహం మీద పడి పడినదుమ్ము చెమటకి (శ్రమవారి) తగలడంతో ఇంక మనోహరంగా కనిపించి
అదే సమయంలో భీష్ముడు చాలా అస్త్రాలు వేశాడు. ణెను వేసిన తీస్ఖణమైన బాణములతో కవచము పోయి చీలిన శరీరంకలవాడై

సపది సఖివచో నిశమ్య మధ్యే నిజపరయోర్బలయో రథం నివేశ్య
స్థితవతి పరసైనికాయురక్ష్ణా హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు

మిత్రునియొక్క (అర్జుని) మాటలు విని రెండు సైన్యముల మధ్య నిలిపి నీ కంటితో వారందరి ఆయుష్షుని హరించిన్ పార్థుని సఖుని యందు నా మనసు  ఉండని
ఇక్కడ భక్త జన వాత్సల్యాన్ని చెప్పాడు

వ్యవహితపృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా
కుమతిమహరదాత్మవిద్యయా యశ్చరణరతిః పరమస్య తస్య మేऽస్తు

దూరముగా ఉన్న సైన్య సమూహాన్ని చూసి దోషబుధ్ధితోటి తనవారిని చంపడానికి విముఖుడైన అర్జునుని దోష బుధ్ధిని ఆత్మ విద్యతో తొలగించావు అలాంటి పరమాత్మ పాద పద్మముల యందు నాకు ప్రీతి కలగనీ

స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుమవప్లుతో రథస్థః
ధృతరథచరణోऽభ్యయాచ్చలద్గుర్హరిరివ హన్తుమిభం గతోత్తరీయః

నీ ప్రతిజ్ఞ్యను కూడా వదిలిపెట్టి (స్వనిగమమపహాయ ) (
అప్పుడప్పుడు కృష్ణున్ని కొట్టే బీష్ముడు ఆరోజు పూర్తిగా అర్జనున్నే కొట్టాడు. విల్లు తీసేఅవకాశంకూడా లేకుండా అర్జనుడు ఉన్నప్పుడూ) నా ప్రతిజ్ఞ్య నిజం చెయ్యడానికి రథం నుంచి దూకి రధ చక్రాన్ని తీసుకుని వస్తుంటే (అందరూ  భయపడ్డారు బీష్ముడు తప్ప) ఏనుగును చంపడానికి సిమ్హం వస్తున్నట్లుగా ఈ దేహాన్ని చంపడానికి భూమి అదిరేంత (అభ్యయాత్ చలత్ గుహు:, )ఆవేశంతో వస్తుంటే ఉత్తరీయం జారిపోతుంటే(పైనున్న పచ్చని పటముజార).
 అభ్యగాత్ చలత్ గుహు అన్నదానికి సకలలోకాలు కంపించేట్టు అని కూడా అర్థం వస్తుంది.

బీమ్ష్మాచార్యుని ఈ స్తుతి ద్వయమంత్రం అని ఉక్తి
గతోత్తరీయః అభ్యయాత్ - ఇది శ్రీమన్నార్యణ
చలత్ గుహు: అంటే విశ్వరూపుడు (సకల లోకాలను కడుపులో దాచుకున్నవాడు)
యిమం హంతుం - శరణం (ఈ శరీరాం నుంచి విడుదల చేస్తాను)
అభ్యయాత్ - ప్రపద్యే
స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుమవప్లుతో రథస్థః - తన ప్రతిజ్ఞ్యని కాదని నా ప్రతిజ్ఞ్య నెరవేర్చుటకు. మనం ఏమి చేసినా ఆయన కొరకే... అందుకే ఇది శ్రీమతే నారాయణాయ

శితవిశిఖహతో విశీర్ణదంశః క్షతజపరిప్లుత ఆతతాయినో మే
ప్రసభమభిససార మద్వధార్థం స భవతు మే భగవాన్గతిర్ముకున్దః

నాచే ప్రయోగించబడిన వాడి అయిన బాణములతో గాయలు కలిగిన వాడు, చీలిపొఇన కవచం కలవాడై, శరీరం రక్తంతో తడిసిపోయి, శత్రువుగా ఉండి (ఆతతాయి - ఇక్కడ ఆతతాయి అంటే సృష్టి స్థితి లయ కారకుడని వ్యంగ్యార్థం)
ఇక్కడ ముకుంద అంటే మోక్షం ఇచ్చేవాడు
నన్ను చంపడానికి వేగంగా చంపడానికి వచ్చినవాడే నాకు రక్షకుడగుగాక
స్థిరచిత్తుని స్థితి ఇది. బీష్ముడు ధర్మాత్ముడు, కృష్ణుని భక్తుడు. ఈ బీష్ముడు కృష్ణ భగవానునికి భక్తుడై తన చేత బాల్యమ్నుండి పెంచబడినవాడైన అర్జునుడు ఎదురుగా యుధ్ధంలో ఉండగా దేనికీ చలించకుండా ఉన్నాడు.

విజయరథకుటుమ్బ ఆత్తతోత్రే ధృతహయరశ్మిని తచ్ఛ్రియేక్షణీయే
భగవతి రతిరస్తు మే ముమూర్షోర్యమిహ నిరీక్ష్య హతా గతాః స్వరూపమ్

నా మనసు కూడా ఆ పరమాత్మ యందే లగ్నమయి ఉండాలి. ఎలాంటి ఆకారంతో ధ్యానం చెయాలి? పరమాత్మ యొక్క భక్త పరాకాష్ట ఏ ఆకారంతో బాగా వ్యక్తమయిందో ఆ ఆకారన్ని ధ్యానించాలి. - విజయ రథం ఇతని కుటుంబం (కుటుంబం అంటే రక్షణ), ఒక చేత్తో కొరడా, ఇంకో చేత్తో పగ్గాలు పట్టుకున్నాడు. అవి పట్టుకుని రధాన్ని నడపడానికి సిధ్ధమయిన పరమాత్మ శోభతో చూడదగి ఉన్నటువంటి పరమాత్మ యందు మరణించాలనుకుంటున్న (మరణాన్ని కోరుతున్న) నాకు కోరిక, రక్తి, ప్రీతి ఉండని. ఏ మహానుభావున్ని చూచి చనిపొయినవాళ్ళందరూ స్వారూప్యాన్ని పొందారు నకు కూడా అలాంటి స్థితి లభించని

లలితగతివిలాసవల్గుహాస ప్రణయనిరీక్షణకల్పితోరుమానాః
కృతమనుకృతవత్య ఉన్మదాన్ధాః ప్రకృతిమగన్కిల యస్య గోపవధ్వః

కృష్ణపరమాత్మ ఏమిచేస్తే గోపికలూ అవే చేసారు (రాసక్రీడలో కృష్ణ విరహాన్ని తట్టుకోలేక గోపికలు కృష్ణలీలలను తాదాత్మ్యంతో అభిన్యైంచారు). ఇలాంటి వాటితో అధికగౌరవాన్ని పొందినవారు. నడక దరహాసం చూపులు ఇలాంటివాటితో చాల అభిమానాన్ని పెంచుకున్నారు (కల్పితోరుమానాః)
పరమాత్మ అంతర్ధానమైతే వాటిని తాము అభినయించి (కృతమనుకృతవత్య) గుడ్డివారిలాగ కృష్ణుని ప్రేమలోపిచ్చివారై దేశ కాలాల్లో కృష్ణుడూ తప్ప మరేదీ గుర్తులేక (ఉన్మదాన్ధాః )ఉన్న అలాంటి గోపికలు ఏ పరమాత్మను అనుకరించి అనుసరించి ధ్యానించి అభిమానించి అర్పించుకొని పరమాత్మని చేరిన గోపికలు ఎవరి వల్ల మోక్షం పొందారో అటువంటి పరమాత్మ నాకు మోక్షమిచ్చుగాక

మునిగణనృపవర్యసఙ్కులేऽన్తః సదసి యుధిష్ఠిరరాజసూయ ఏషామ్
అర్హణముపపేద ఈక్షణీయో మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా

రాజసూయ యాగంలో ఏ మహనుభావుడు అగ్రపూజ పొందాడో  (అగ్రపూజ పొందమన్న బీష్ముని ప్రార్థనను మన్నించి ) ఆ మహానుభావుని యందు నా మనసు ఉండుగాక. రాజసూయానికి మునిగణాలందరికీ వచ్చారు. అలాగే రాజులు కూడా వచ్చారు. సభామధ్యమున వచ్చిన వారందరికీ కన్నుల పందువచేసిన స్వామి యందు నా మనసు నిలుచు గాక.

రజసూయాన్ని విజయ సారధ్యాన్ని గోపికల భక్తినీ తలుచుకున్నాడు. కృష్ణవతారంలో అద్భుతమైన ఘట్టాలను తలుచుకున్నాడు. కృష్ణావతారంలో ఉన్న పది అద్భుతదృష్యాలను పది ఉపనిషత్తులని అంటారు. పార్ధసారధ్యం బృహధారకమని పేరు.

తమిమమహమజం శరీరభాజాం హృది హృది ధిష్ఠితమాత్మకల్పితానామ్
ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోऽస్మి విధూతభేదమోహః
   
ఇది చాందోగ్యమని పేరు. సూర్యుడు ఒకడే ఉండి చూసే వారికి వేరువేరుగా కనపడినా ఏకత్వం దెబ్బతినదు. ఈ కృష్ణుడు కూడా అంతే. పరమాత్మ కూడా ఎన్ని జీవరాశులున్నాయో అన్ని జీవుల్లోనూ వారి హృదయాల్లో ఉంటాడు. ఆ జీవుల శరీరాలన్ని పరమాత్మ సంకల్పంతో కల్పించబడినవే.
ఒక్కొక్క కంటికి ఒకే సూర్యుడు పలువిధాలుగా కనపడుతున్నట్లుగా పరమాత్మ కూడా ఒక్కొక్కడిలో ఒక్కొక్కడిగా కనపడుతున్న పరమాత్మను నేను పట్టుకున్నాను.

అజం (పుట్టుకలేని వాడు అయి ఉండి) శరీరభాజాం హృది హృది ధిష్ఠితం - జీవులయొక్క ఒక్కొక్కరి హృదయంలో ఉంటాడు. ఆ శరీరాలన్నీ పరమాత్మ సంకల్పంచేత కల్పించబడినవి (ఆత్మకల్పితానామ్)
ప్రతిదృశమివ నైకధార్కమేకం - ప్రతి ఒక్క కన్నుకు ఒక్కొక్క సూర్యుడు భాసించినట్లుగా.
సమధిగతోऽస్మి  - అటువంటి స్వామిని నేను పట్టుకున్నాను ఎందుకంటే విధూతభేదమోహః - భేదమనే భావం పోయింది. ఇందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ ఒక్కడే అన్న విషయాన్ని పట్టుకున్నాను. పరమాత్మయొక్క ఏకత్వాన్ని సర్వభూత అంతర్యామిత్వాన్ని చూడగలిగాను


సూత ఉవాచ
కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః
ఆత్మన్యాత్మానమావేశ్య సోऽన్తఃశ్వాస ఉపారమత్

ఈ రీతిలో మనసుతోటి వాక్కుతోటి చూపుతోటి ఇంద్రియ వృత్తులతోటి ఆ పరమాత్మ యందు ఆత్మను ఆత్మలో ఉంచి శ్వాసను లోపలనుంచి విరమింపచేసుకున్నాడు

సమ్పద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే
సర్వే బభూవుస్తే తూష్ణీం వయాంసీవ దినాత్యయే

కళారహితమయిన పరమాత్మ సాయుజ్యముని పొందాడని తెలుసుకున్న ధర్మరాజు మొదలైన వాళ్ళందరు మౌనంగా వహించారు. సూర్యాస్తమం కాగానే పక్షులు గూళ్ళకు చేరి మౌనం దాల్చినట్లుగా (సూర్యుడు బీష్ముడు పక్షులు పాండవులు)

తత్ర దున్దుభయో నేదుర్దేవమానవవాదితాః
శశంసుః సాధవో రాజ్ఞాం ఖాత్పేతుః పుష్పవృష్టయః

బీష్ముడు పుట్టినప్పుడు దుందుభులు మోగాయి ప్రతిజ్య్ణ చేసినప్పుడు మోగాయి. ఆలగే ఇప్పుడు కూడా దుందుభులు మోగాయి. పరమాత్మలో జేరినప్పుడు దేవతలూ మనవులూ దుందుభులు మ్రోగించారు. ఆకశం నుండి పుష్ప వృష్టి కురిసింది

తస్య నిర్హరణాదీని సమ్పరేతస్య భార్గవ
యుధిష్ఠిరః కారయిత్వా ముహూర్తం దుఃఖితోऽభవత్

దహన సంస్కారాలన్నీ అయిన తరువాత ముహూర్తకాలం దు:ఖం అనుభవించి తరువాత కార్యాలని ధర్మరాజు చేసాడు

తుష్టువుర్మునయో హృష్టాః కృష్ణం తద్గుహ్యనామభిః
తతస్తే కృష్ణహృదయాః స్వాశ్రమాన్ప్రయయుః పునః

రహస్యనామాలతో బీష్ముడు చేసిన స్తోత్రాన్ని విని పరమాత్మ ఇల స్తోత్రం చెయ్యలి అని తెల్సుకున్న వారు పరమాతను స్తోత్రం చేసారు. పరోక్ష ప్రియా: దేవతా: అని ఊక్తి. దేవతలు పరోక్షంగా స్తోత్రం చేస్తే ప్రీతి పొందుతారు. ఋషులందరు బీష్మునికి మోక్షం ప్రసాదించిన కృష్ణున్ని గుహ్యనామాలతో స్తోత్రం చేసారు

తతో యుధిష్ఠిరో గత్వా సహకృష్ణో గజాహ్వయమ్
పితరం సాన్త్వయామాస గాన్ధారీం చ తపస్వినీమ్

కృష్ణున్ని స్తోత్రం చేసి అందరు వారి వారి స్వస్థానాలకు వెళ్ళారు
ధర్మరాజు కృష్ణునితో కలిసి హస్తినాపురం వెళ్ళి  బీష్ముడు దృతరాష్ట్ర గాంధారులను ఓదార్చాడు

పిత్రా చానుమతో రాజా వాసుదేవానుమోదితః
చకార రాజ్యం ధర్మేణ పితృపైతామహం విభుః

బీష్ముణి ఉపదేశం వలన కృష్ణ దృతరాష్ట్ర అనుమతి తీసుకుని రాజ్యాన్ని ధర్మబద్దం గా పరిపాలించాడు

Thursday, November 22, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

సూత ఉవాచ
అథ తే సమ్పరేతానాం స్వానాముదకమిచ్ఛతామ్
దాతుం సకృష్ణా గఙ్గాయాం పురస్కృత్య యయుః స్త్రియః

ఎవరెవరు తర్పణ జలాన్ని కోరుతున్నారో వారందరికీ తర్పణం ఇచ్చారు. (12వ రోజున జలం ఇవ్వాలి - దశ ఇంద్రియాలు మనసు బుధ్ధి వాటి స్థానం చేరాయి, 16వ రోజు  - 10ఇంద్రియములు 5 భూతములు మనసు వాటిస్థానం చేరుతాయి. 29వ రోజు - వీటియొక్క ప్రవృత్తి నివృత్తి మార్గాలు 32 వీటిలో గుణత్రయం యొక్క విముక్తి అయ్యింది కాబట్టి 29 వ రోజు. 45వ రోజు - గుణత్రయమూ తాపత్రయం 15 * 3 = 45. 59 వ రోజు వీటికి ధర్మార్ధ కామాలు అనే పురుషార్ద బంధాలను తొలగించినప్పుడు 45 +14 = 59 వ రోజు ).
(పితృదేవతలకు 12 రోజులలోపు గంగా జలాన్ని ఇవ్వాలి. ఆ జలం వల్ల తాపత్రయాలు నిర్మూలింపబడతాయి. మనసుకుండే సంస్కారం శరీరంపొయినా ఉంటుంది. భూవాతావరణంలో ఆ మనసు ఉంటే దాన్ని ప్రేత అంటారు. పితృలోకానికి వెళ్తే దాన్ని పితృదేవతలూ అంటారు. వైకుంఠానికి వెళ్తే ముక్తాత్మ అంటాం.
ఏ ఇంటికివెళ్ళినా మనం మారనట్లు ఏ శరీరానికి వెళ్ళినా మన మన్సులో ఉండే సంస్కారాలను బట్టి మన అలవాట్లు ఉంటాయి.)
ఆడవారిని ముందుబెట్టుకుని తర్ప

తే నినీయోదకం సర్వే విలప్య చ భృశం పునః
ఆప్లుతా హరిపాదాబ్జరజఃపూతసరిజ్జలే

తే నినీయోదకం సర్వే - వారు ఉదకాన్ని ఇచ్చి, విలపించి పరమాత్మ పాదం నుంచి పుట్టిన గంగా నదిలో మునిగారు

తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజమ్
గాన్ధారీం పుత్రశోకార్తాం పృథాం కృష్ణాం చ మాధవః

ఇరువైపులా చాల మంది చనిపోయారు. కురుపాండవులను ఓదార్చాడనికి అక్కడ ఉన్న కృష్ణుడు ఓదార్చాడు.

సాన్త్వయామాస మునిభిర్హతబన్ధూఞ్శుచార్పితాన్
భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియామ్

కృష్ణుడే కాకుండా అక్కడున్న ఋషులు కూడా ఓదార్చారు. ప్రాణులలో కాలం యొక్క గమనాన్ని (భూతేషు కాలస్య గతిం) మనం ఎమి చేసీ మార్చలేము. 

సాధయిత్వాజాతశత్రోః స్వం రాజ్యం కితవైర్హృతమ్
ఘాతయిత్వాసతో రాజ్ఞః కచస్పర్శక్షతాయుషః

కపటవైరుల చేత అపహరించబడిన రాజ్యాన్ని ధర్మరాజుకు ఇచ్చాడు. సిగను ముట్టుకోవడంవల్ల తరిగిన ఆయుష్యు కలిగిన వాళ్ళను (కచస్పర్శక్షతాయుషః) చంపించాడు. పతివ్రత కేశములు చక్రంకంటే శూలం కంటే యమ వరుణ పాశంకంటే మహా వేగములు. స్త్రీకేశముల వలన భర్తయొక్క క్షేమం పెరుగుతుంది. ఒక్క సారి జుట్టు ముడివేసుకోకపోవడం వల్ల దితికి ఒక్కడు పుట్టాల్సింది 49 మరుత్తులు పుట్టారు (ఇంద్రుడు గర్భంలో ఉన్నవాడిని 7 సార్లు నరికి. మళ్ళి ఒక్కక్కరిని మళ్ళీ ఏడు  సార్లు నరికాడు)

యాజయిత్వాశ్వమేధైస్తం త్రిభిరుత్తమకల్పకైః
తద్యశః పావనం దిక్షు శతమన్యోరివాతనోత్

అత్యుత్తములైన మూడు అశ్వమేధములు చేయించాడు. ఇంద్రునికీర్తితో సమానంగా కీర్తిని వ్యాపింపచేసాడు.

ఆమన్త్ర్య పాణ్డుపుత్రాంశ్చ శైనేయోద్ధవసంయుతః
ద్వైపాయనాదిభిర్విప్రైః పూజితైః ప్రతిపూజితః

ఉద్దవ సాత్యకులతో కలిసి వెళ్ళడానికి పాండుపుత్రులను కోరి. వ్యాస పరాశరులు మొదలైన మహర్షులు మొదలీవారిని కృష్ణుడు మొదటపూజించాడు తరువాత కృషున్ని వారు పూజైంచారు (పూజితైః ప్రతిపూజితః)

గన్తుం కృతమతిర్బ్రహ్మన్ద్వారకాం రథమాస్థితః
ఉపలేభేऽభిధావన్తీముత్తరాం భయవిహ్వలామ్

రధం ఎక్కుదామని అనుకుంటున్న సమయంలో భయవిహ్వలై వచ్చింది

ఉత్తరోవాచ
పాహి పాహి మహాయోగిన్దేవదేవ జగత్పతే
నాన్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యుః పరస్పరమ్

ఒకరినొకరు చంపుకుంటున్న ఈ లోకంలో నీ కన్నా వేరే రక్షకులు లేరు

అభిద్రవతి మామీశ శరస్తప్తాయసో విభో
కామం దహతు మాం నాథ మా మే గర్భో నిపాత్యతామ్

బాగా కాల్చిన ఉక్కులాంటి ఈ  బాణం నా మీదకు వస్తోంది. నేను ప్రార్ధించేది నా గర్భం కొరకు

సూత ఉవాచ
ఉపధార్య వచస్తస్యా భగవాన్భక్తవత్సలః
అపాణ్డవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత

అపాణ్డవమనే అస్త్రాన్ని అశ్వధ్ధామ ప్రయోగించాడని తెలుసుకున్నడు (అబుధ్యత)

తర్హ్యేవాథ మునిశ్రేష్ఠ పాణ్డవాః పఞ్చ సాయకాన్
ఆత్మనోऽభిముఖాన్దీప్తానాలక్ష్యాస్త్రాణ్యుపాదదుః

అదే సమయంలో మరో అయిదు బాణాలు పాండవులవైపు వెళ్ళాయి

వ్యసనం వీక్ష్య తత్తేషామనన్యవిషయాత్మనామ్
సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాద్విభుః

తనయందు తప్ప మరి ఎవ్వరిమీద మనసుపెట్టని వారి ఆపద చూసి తన అస్త్రమైన సుదర్శనాన్ని పంపించాడు.

అన్తఃస్థః సర్వభూతానామాత్మా యోగేశ్వరో హరిః
స్వమాయయావృణోద్గర్భం వైరాట్యాః కురుతన్తవే

సర్వభూత అంతర్యామి ఐన పరమాత్మ విరాటరాజు కుమార్తె గర్బస్థ శిశువుని కాపాడటానికి కురువంశాన్ని కాపాడటానికి తానే వెళ్ళాడు

యద్యప్యస్త్రం బ్రహ్మశిరస్త్వమోఘం చాప్రతిక్రియమ్
వైష్ణవం తేజ ఆసాద్య సమశామ్యద్భృగూద్వహ

అమోఘమైన ప్రతిక్రియ లేని బ్రహ్మాస్త్రం వైష్ణవతేజస్సుని చూసి చల్లారిపొయింది.

మా మంస్థా హ్యేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయే ఞ్చ్యుతే
య ఇదం మాయయా దేవ్యా సృజత్యవతి హన్త్యజః

సర్వాశ్చర్యమయమైన స్వామి సృష్టి స్థితిలయాలను యోగమాయతో చేస్తాడు

బ్రహ్మతేజోవినిర్ముక్తైరాత్మజైః సహ కృష్ణయా
ప్రయాణాభిముఖం కృష్ణమిదమాహ పృథా సతీ

బ్రహ్మతేజస్సుతోటి  వస్తున్న అస్త్రాన్నుంచి రాక్షించిన కృష్ణునితో కుంతి ఇలా అంది

కున్త్యువాచ
నమస్యే పురుషం త్వాద్యమీశ్వరం ప్రకృతేః పరమ్
అలక్ష్యం సర్వభూతానామన్తర్బహిరవస్థితమ్

నీవు ఆది పురుషుడివి, అందరినీ శాసించే వాడివి, ఇంత చేసి ఎవ్వడికీ కనపడవు (అలక్ష్యం) ఐనా లోపలా బయటా ఉంటావు, ప్రకృతికంటే అవతల ఉన్నావు

మాయాజవనికాచ్ఛన్నమజ్ఞాధోక్షజమవ్యయమ్
న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా

ఎందుకు కనపడవంటే మాయా యవనికా అనే తెర ఉంటుంది. అజ్ఞ్య అధోక్షజం - జ్ఞ్యానంలేనివారి ఇంద్రియములను కిందగా జేసేవాడు. ఇంత ఉండి కూడా కనపడవు ఎందుకంటే విషయం తెలీనివాడు నటున్ని నటుడిగానే గుర్తుపట్టి వారి నిజమైన రూపాన్ని మర్చిపోయినట్లుగా. మనం ఆ పాత్ర గురించి మాట్లాడతాం గాని ఆ వ్యక్తిగురించి మాటాడటం. పాత్రని చూసి నటున్ని చూడకపోవడం మూఢదృశా

తథా పరమహంసానాం మునీనామమలాత్మనామ్
భక్తియోగవిధానార్థం కథం పశ్యేమ హి స్త్రియః

నీవు ఉన్నది పరమహంసుల (సన్యాసులు  - సత్ న్యాస - తమవన్నీ పరమాత్మలో ఉంచినవారు. ప్రపంచంలో ఉన్న మురికిని వేరుచేసి చూస్తారు కాబట్టి వారు హంసలు). అలాంటివారికి కనపడే నీవు మాకు కనపడ్డావు. మాకు అర్థం కావు

కృష్ణాయ వాసుదేవాయ దేవకీనన్దనాయ చ
నన్దగోపకుమారాయ గోవిన్దాయ నమో నమః

నీవు వసుదేవ దేవకులకు పుట్టావు. వసుదేవుడు (వసు - ధనం దేవ - భగవంతుడు) జ్ఞ్యానం, దేవకి అంటే భక్తి. జ్ఞ్యానభక్తులకే అందేవాడివి. జగత్తు పరమాత్మ వశంలో ఉంటుంది పరమాత్మ మంత్రలో వశమై ఉంటాడు. ఆ మంత్రం గురువు అధీనంలో ఉంటుంది. జ్ఞ్యానముండి ఆవిర్భవించిన నీవు నందగోపుడి కుమారుడివి (నందగోపుడు అంటే - మనని ఆనందింపచేస్తాడు, అరిష్టములనుండి దాచిపెడతాడు. అలాగే దుష్టులకు పరమాత్మ అందకుండా కాపాడేవాడివి నీవు. అందుకే గురువు పేరు నందగోపుడివి ). నీవు గోవిందుడివి - వాక్కులకి అందేవాడివి.

నమః పఙ్కజనాభాయ నమః పఙ్కజమాలినే
నమః పఙ్కజనేత్రాయ నమస్తే పఙ్కజాఙ్ఘ్రయే

కల్పములలో వరాహ పద్మ కల్పాలు ఉన్నాయి. పద్మకోశమంటే అనంతభువనకోశం. పద్మం ప్రపంచమునకు నమూనా. భువనకోశం అంటారు . కోశమంటే మధ్య ఉన్న పుప్పొడి. అదే పద్మానికి రేకులకి మూలస్తంభం. ఇలా విశ్వమంతా నాభిలో దాచుకున్న వాడు పంకజ నాభాయ, ప్రపంచం రజోరాగాత్మకం. తమస్సు రజస్సు కలిస్తే బురద. పంకజం అంటే బురదలోంచి పుట్టిన జీవులు. జీవులన్నీ హారముగా వేసుకున్నవాడు. అలా వేసుకుని వారి దోషములు హరించే వాడు. పంకజ మాలిని అంటే దోషభోగ్యుడు.

ఈశ్వరస్యచ సౌహార్దం , య్దృచ్చా సుకృతం (పరమాత్మ సంకల్పంతో పుణ్యం) ,విష్ణో: కటాక్ష:, అద్వేష: (పరమాత్మ భక్తులయను వైముఖ్యం పోతుంది ), అనుకూలయం (భక్తుల యందు), సాత్వికై: సంభాషణం (పరమాత్మ భక్తులతో సంభాషణం )
షడ్ యేతాని ఆచార్య ప్రాప్య హేతవ: ఈ ఆరు ఆచార్యుడు ప్రాప్తిస్తున్నాడనడానికి సంకేతాలు
జీవూల్యందు నిరంతరమూ కట్టక్షం ప్రసరించే వాడు గనుక పంకజ నేత్రాయ. కటాక్షించి ఆయన చేర్చుకునేది ఆయన పాదాలవద్దకే కనుక పంకజాంఘ్రియే

ఈ స్తోత్రాన్ని కలిపితే సృష్టి స్థితి సమ్హారం వస్తుంది

యథా హృషీకేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధాతిచిరం శుచార్పితా
విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్

హృషీకానాం ఈశ: ఇంద్రియ అధిష్టానములైన దేవతలను శాసించేవాడు,  దుర్మార్గుడైన కంసునిచేత చెరసాలలో బంధింపబడిన నీ తల్లి దేవకిని దు:ఖము నుండి విడిపించావు. ఆమెనే కాదు నన్ను కూడా కాపాడావు. నన్నే కాకుండా నా పుత్రులని కూడా కాపాడావు. మాటిమాటికీ వస్తున్న ఆపదల సమూహమ్నుండి నన్ను దేవకినీ కాపాడావు


విషాన్మహాగ్నేః పురుషాదదర్శనాదసత్సభాయా వనవాసకృచ్ఛ్రతః
మృధే మృధేऽనేకమహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేऽభిరక్షితాః

మొదలు విషంవలన, తరువాత అగ్ని వలన, హిడింబాసురుడు వంటి రాక్షసుల నుండి, దుర్మార్గుల సభనుండి, వనవాసములోను, ప్రతీయుధ్ధంలోనూ, అనేక మహారధులు

విపదః సన్తు తాః శశ్వత్తత్ర తత్ర జగద్గురో
భవతో దర్శనం యత్స్యాదపునర్భవదర్శనమ్

ఎప్పుడూ మాటిమాటికీ అన్నివేళలా మాకు ఆపదలే రాని
అవి మాకు వస్తేనే మోక్షముని ప్రసాదించే నీ దర్శనం వస్తుంది.

జన్మైశ్వర్యశ్రుతశ్రీభిరేధమానమదః పుమాన్
నైవార్హత్యభిధాతుం వై త్వామకిఞ్చనగోచరమ్

జన్మ అయిశ్వర్య(శాసించగల వంశంలో పుట్టడం) విద్య సంపద - అనే నాలుగు మదాలలో యే ఒక్కటి ఉన్నా నిన్ను జ్ఞ్యాపకంచేసుకోలేము. ఈ మదం పెరిగితే నీ పేరే పలకలేడు

నమోऽకిఞ్చనవిత్తాయ నివృత్తగుణవృత్తయే
ఆత్మారామాయ శాన్తాయ కైవల్యపతయే నమః

అకించనవిత్తం - ఏ కోరికా లేని వారికి ఆయన ధనం..
నివృత్త గుణ వృత్తయే: పరమాత ప్రకృతిజీవునికంటే విలక్షణుడు. (జీవులు బధ్ధ ముక్త నిత్యం. సంసారంలో ఉండేవారు, సంసారన్ని దాటి స్వమిని చేరిన వారు, ఎల్లప్పుడు స్వామి దగ్గరే ఉండేవారు - వీరందరికన్నా పరమాత్మ విలక్షణుడు). వృత్తులంటే కామక్రోధాదులు గుణవృత్తులు (సత్వ రజో తమ గుణవృత్తులు). ఈ గుణవృత్తులులేని వాడు పరమాత్మ.
కైవల్య అధిపతి అనడం వల్ల అనడం వల్ల నిత్య సూరులకంటే విలక్షణుడు
శాంతాయ అనడం వలన - ముక్తులకంటే విలక్షణుడు
ఆత్మా రామాయ - బద్దులకంటే విలక్షణుడు
నివృత్తగుణవృత్తయే - ప్రకృతి కంటే విలక్షణుడు
సర్వ వైల్క్ష్యంతో బాటు సౌలభ్యం ఉన్నవాడు.

మన్యే త్వాం కాలమీశానమనాదినిధనం విభుమ్
సమం చరన్తం సర్వత్ర భూతానాం యన్మిథః కలిః

ఒక చెట్టు ఒక్కో కాలంలో ఒక్కోలాగ ఉంటుంది. ప్రకృతిలో వికారం కలిగించేది కాలం. ఒకే చెట్టుకు ఉన్న పిందె కాయ పండు అనే మార్పులు కాలం వల్ల వస్తాయి. అన్ని వికారాలకి కాలం మూలం. నీవు ఆ కాల స్వరూపుడివి. నీమీద ఆ కాల ప్రభావం ఉండదు ఎందుకంటే నీవే కాలం. విభుం - అంటే సర్వ వ్యాపి. అనాదినిధనం - ఆద్యంతములు లేనిది కాలం (పరమాత్మకు జీవాత్మకు ప్రకృతికి ఆది అంతము ఉండదు). సమం చరన్తం సర్వత్ర - కాలం అందరి విషయంలో సమానంగా వ్యవహరించినట్లు పరమాత్మ కూడా అలాగే అందరిలో సమానంగా సంచరిస్తాడు. అందరికీ ఆధారమవుతూ కూడా తనలో ఎలాంటి మార్పు కలగడానికి అవకాశం లేనిది కాలం. అన్నివికారాలకి యేది మూలమో అది కూడా నీలో ఎలాంటివికారాలని కలగచెయ్యలేదు. అందరిలో సమంగా ఉంటావు. నీవు ఉన్న వారిలో కలిగే భావాలతో నీకు సంబంధంలేదు.

పరస్పరం ఒకరిని చూచి ఒకరు వధించుకుంటున్నారంటే దానితో నీకు సంబంధంలేదు. ప్రకృతిలో జీవులలో కలిగే ఎలాంటి భావాలకు పరమాత్మ బాధ్యుడు కాడు, అయిన మనలో కలిగించే ప్రవృత్తులకు కారణం ఆయనే. కానీ అవి ఏమీ ఆయనకు అంటవు.

న వేద కశ్చిద్భగవంశ్చికీర్షితం తవేహమానస్య నృణాం విడమ్బనమ్
న యస్య కశ్చిద్దయితోऽస్తి కర్హిచిద్ద్వేష్యశ్చ యస్మిన్విషమా మతిర్నృణామ్

మానవులతో నీవుండి నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో ఎవర్రికీ తెలీదు. పూతన తృణావర్తుడు మొదలైన రాక్షసులని వధించి వారికి మోక్షాన్ని ఇచ్చావు. నువ్వేమనుకుంటున్నావో ఎమిచేస్తావో ఎవరికీ తెలీదు.
నీకు ఒక మిత్రుడు లేదా శత్రువు అని ఎవరూలేరు. కానీ నీవంటే ఎవరికీ పడదు.

జన్మ కర్మ చ విశ్వాత్మన్నజస్యాకర్తురాత్మనః
తిర్యఙ్నౄషిషు యాదఃసు తదత్యన్తవిడమ్బనమ్

ఎమీ చెయ్యని నీవు అన్ని కర్మలూ చేస్తున్నవు. యే జన్మా లేని నీవు జన్మించావు
పుట్టుకలేని నీవు తిర్యక్ గా నరునిగా యాదసుగా (నీటిలో ఉండేవి మత్స్య కూర్మ వరాహ). ఋషిగా పుట్టావు. ఇదంతా నీకు ఆట (విడంబనం)

గోప్యాదదే త్వయి కృతాగసి దామ తావద్యా తే దశాశ్రుకలిలాఞ్జనసమ్భ్రమాక్షమ్
వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్బిభేతి


నీవు నీ ఇంట్లో వెన్న దొంగతనం చేసావు. కట్టడానికి తాడు పట్టుకువచ్చిన తల్లిని చూచి కపటపు కన్నీరు కారుస్తున్న నీవు, నోరు దగ్గరకు తీసుకుని (వక్త్రం నినీయ) ఉన్నప్పుడు భయానికే భయమేసింది.

కేచిదాహురజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే
యదోః ప్రియస్యాన్వవాయే మలయస్యేవ చన్దనమ్

పుట్టుకలేని నీవు ఎందుకుపుట్టావో ఎవరికీ తెలీదు. నీ భక్తుల కీర్తి పెంచుకోవాలని పుట్టావని కొంతమంది నీ కీర్తి పెంచుకోవాలని పుట్టావని కొంతమంది, యగువంశాన్ని ఉద్దరించడానికి పుట్టావని కొంతమంది అంటారు

అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోऽభ్యగాత్
అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషామ్

మరికొందరు దేవకీ వసుదేవులు తపస్సు చేస్తే వారికోరిక తీర్చడానికి పుట్టావు అని కొంతమంది రాక్షసులను సంహరించడానికని అంటారు

భారావతారణాయాన్యే భువో నావ ఇవోదధౌ
సీదన్త్యా భూరిభారేణ జాతో హ్యాత్మభువార్థితః

భూభారాన్ని తగ్గించడానికి అని కొంతమంది అన్నారు. బ్రహ్మగారి ప్రార్థన మీద భూభారాన్ని తగ్గించడానికి వచ్చావని కొంతమంది అంటారు

భవేऽస్మిన్క్లిశ్యమానానామవిద్యాకామకర్మభిః
శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన

అవిద్యచేతా కోరికచేతా పనులచేతా ఈ ప్రపంచములో బాధపడుతున్నవారు నీ కీర్తిని విని పాడుకొనడానికి నీవు పుట్టావు. నీ కథలు చదువుటకు చెప్పుటకు వినుటకు నీవు పుట్టావు అని కొందరంటారు. వినదగినవి స్మరణ చెయడానికి తగినవి అయిన కర్మలు చేసావు (సామాన్యులు చెప్పుకోవడానికి పామరులు కూడా యే పనులు తలుచుకుంటారో ఆపనులు చేసావు - పండితులు నీ మహిమను తలుచుకుంటారు పామరులు నీ అల్లరిని తలుచుకుంటారు)

శృణ్వన్తి గాయన్తి గృణన్త్యభీక్ష్ణశః స్మరన్తి నన్దన్తి తవేహితం జనాః
త ఏవ పశ్యన్త్యచిరేణ తావకం భవప్రవాహోపరమం పదామ్బుజమ్

నీ గురించి ఎవరు వింటారో పాడతారో అంటారో వారు సంసారప్రవాహాన్ని తగ్గించే నీ పాదపద్మాలు చేరతారు. కొందరు నీ చేష్టలను నీ సంకల్పాన్ని తలుచుకుంటారు. వారు నీ పాదపద్మాలను తలుచుకుని సంసారాన్ని దాటుతారు (భవప్రవాహోపరమం )

అప్యద్య నస్త్వం స్వకృతేహిత ప్రభో జిహాససి స్విత్సుహృదోऽనుజీవినః
యేషాం న చాన్యద్భవతః పదామ్బుజాత్పరాయణం రాజసు యోజితాంహసామ్

నీవు చేసినది నీకే అర్థమవుతుంది మాకు కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఇక్కడ ఉన్న నీవాళ్ళను వదిలి వెళ్తున్నట్లు ఉంది. వీరందరికి నీ పాదములు తప్ప వేరే దిక్కులేదు. వీరు రాజులని చంపిన పాపముగలవారు (రాజసు యోజితాంహసామ్).

కే వయం నామరూపాభ్యాం యదుభిః సహ పాణ్డవాః
భవతోऽదర్శనం యర్హి హృషీకాణామివేశితుః

నీవులేకుంటే మాకు పేరే లేదు. పాండవులు యాదవులు నువ్వు ఉండబట్టే ఈ పేరు. మనసులేకుంటే ఇంద్రియములు ఎలా నిర్వీర్యములో నీవులేని యాదవపాండవులు కూడా వ్యర్థమే

నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర
త్వత్పదైరఙ్కితా భాతి స్వలక్షణవిలక్షితైః

నీవులేకుంటే ఈ భూమి గతి ఏమిటి. ఈ సామ్రాజ్యం అంతా నీ పాద గుర్తులే.

ఇమే జనపదాః స్వృద్ధాః సుపక్వౌషధివీరుధః
వనాద్రినద్యుదన్వన్తో హ్యేధన్తే తవ వీక్షితైః

ఇక్కడి చెట్లు వనాలు నీ దృష్టితో పెరుగుతాయి. మేము నిన్ను చూసేట్లు చూడు.

అథ విశ్వేశ విశ్వాత్మన్విశ్వమూర్తే స్వకేషు మే
స్నేహపాశమిమం ఛిన్ధి దృఢం పాణ్డుషు వృష్ణిషు

ఆ చూపువలన పాండవులమీద యాదవుల మీద మమకారం తగ్గేలా చూడు
నా బుధ్ధి నీ యందే అనన్యంగా ఉండాలి.

త్వయి మేऽనన్యవిషయా మతిర్మధుపతేऽసకృత్
రతిముద్వహతాదద్ధా గఙ్గేవౌఘముదన్వతి

అన్ని మధువులకూ నీవే పతివి కాబట్టి మా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు. గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రంలో కలుస్తుంది,  , మా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా చివరకూ నిన్నే కలిసేట్లు చూడు
 ఇతరములని తాకని బుధ్ధి మరొకవైపు వెళ్ళకుండా నీయందే ఉండాలి.

శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభావనిధ్రుగ్రాజన్యవంశదహనానపవర్గవీర్య
గోవిన్ద గోద్విజసురార్తిహరావతార యోగేశ్వరాఖిలగురో భగవన్నమస్తే

అపరిమితానందస్వరూపా (కృష్ణా ) (భారతంలో అయిదుగురు కృష్ణులు వున్నారు : వ్యాసుడు అర్జున శుక విధురుడు కృష్ణుడు  - ఐదుగురు కృష్ణరాయబారానికి కలిసారు ), కృష్ణ సఖా - అర్జుని సఖుడా. వృష్ణి - (కార్తవీర్యార్జుని తండ్రి హైహైయ మహారాజు.  హైహైయుని మహారాజు తండ్రి వీతిహోత్రుడు. వీతిహోత్రుడి తమ్ముడు వృష్ణి. కార్తవీర్యార్జుని చిన్న తాతగారు వృష్ణి. కార్తవీర్యార్జుని  ఒక కొడుకు నందుడు. అతని కుమార్డు స్థితికంటుడు. అతని కుమార్డు ఆహూకుడు. అతని కుమార్డు శూరసేనుడు. అతని కుమార్డు వసుదేవుడు. అతని కుమార్డు కృష్ణుడు. వృష్ణి ఆరవతరం)
పరమాత్మ యదువంశాన్ని ఉద్దరించడానికి రెండుకారణాలు. యదువుకి యయాతి శాపం వల్ల వచ్చిన మురికి పోగొట్టాలి. హైహైయునికి కార్తవీర్యార్జునికి బ్రాహ్మణ శాపం ఉంది (జమదగ్ని - పరశురాముడు), ఈ దోషాన్ని పోగొట్టాలి. ఈ రెంటివల్ల కలిగిన కళంకాన్ని పోగొట్టాలి. కృష్ణుడు యే రాజ్యానికి రాజు కాడు. 
శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభా - ఇది మనకు పరిత్రాణాయ సాధూనాం అన్న దానికి అన్వయం
అవనిధ్రుగ్రాజన్యవంశదహనా -  భూమికి ద్రోహం చేసే (అవనిధ్ర్క్) రాజూ వంశాలను దహించినవాడా.
అనపవర్గవీర్య - మోక్షము కోరనీ, సంసరాం మేదే దృష్టి ఉన్న వారి బుధ్ధిని మార్చడానికి కావల్సిన పరాక్రమం గలవాడా.
గోవిన్ద - ఆవులనీ పరిపాలించే వాడు వేదాలను, రాజులను, ధర్మాలను పరిపాలించే వాడు. గోశబ్దానికి ఆవులని, స్వర్గమును అందిచేవాడు, శరమును అనుసంధానం చేసేవాడు, వేదాములనుకాపాడే వాడు వజ్రమును ప్రసాదించేవాడు, కిరణాలను ఇచ్చేవాడు, నేత్రములు ఇచ్చేవాడు, వర్షమూ ఇచ్చేవాడు, జ్ఞ్యానమూ ఇచ్చేవాడు. ఇవన్నీ గోశబ్దానికి అర్థాలే
గోద్విజసురార్తిహరావతార - గోబ్రాహ్మణదేవతలకూ ఎవరు బాధ కలిగిస్తారో వారిని కలుపులాగ తీయడానికి అవతరించినవాడా
యోగేశ్వరాఖిలగురో భగవన్నమస్తే- యోగులందరికీ ఈశ్వరుడు, గురువులందరికీ మొదటి గురువు, జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సనే ఆరు గుణములు గల మహానుభావా నీకు నమస్కారం

సూత ఉవాచ
పృథయేత్థం కలపదైః పరిణూతాఖిలోదయః
మన్దం జహాస వైకుణ్ఠో మోహయన్నివ మాయయా

ఈ రీతిగా కుంతి పరమాత్మ సకల వైభవాన్ని స్తోత్రం చేస్తే (పరిణూతాఖిలోదయః) పెదవి విప్పీ విప్పంట్లుగా మోహం చేసేట్టుగా చిన్నగా నవ్వాడు . 

తాం బాఢమిత్యుపామన్త్ర్య ప్రవిశ్య గజసాహ్వయమ్
స్త్రియశ్చ స్వపురం యాస్యన్ప్రేమ్ణా రాజ్ఞా నివారితః

పాండవుల అభ్యర్థం మేరకు కృష్ణుడు అక్కడే కొన్నాళ్ళు ఉన్నాడు

వ్యాసాద్యైరీశ్వరేహాజ్ఞైః కృష్ణేనాద్భుతకర్మణా
ప్రబోధితోऽపీతిహాసైర్నాబుధ్యత శుచార్పితః

ఋషులందరూ బోధించినా, కృష్ణపరమాత్మ బోధించినా కూడా ధర్మ రాజు తెలుసుకోలేకపోయాడు, ధుఖవశుడయ్యాడు (ఢుఖానికి అర్పించుకున్నాడు - శుచార్పితః)

ఆహ రాజా ధర్మసుతశ్చిన్తయన్సుహృదాం వధమ్
ప్రాకృతేనాత్మనా విప్రాః స్నేహమోహవశం గతః

ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా వారు చెప్పినమాటలు వింటూ కూడా తన మిత్రుల బంధువుల వధ గురించే ఆలోచిస్తూ, స్నేహంతో మోహంతో పామరమనసుతో బ్రాహ్మణులతో

అహో మే పశ్యతాజ్ఞానం హృది రూఢం దురాత్మనః
పారక్యస్యైవ దేహస్య బహ్వ్యో మేऽక్షౌహిణీర్హతాః

నాలో ఉన్న ఈ పాపాన్ని మీరు చూచార. 18 అక్షౌహిణీలసైన్యాన్ని పరుల సొమ్ముకావలసిన శరీరంకోసం (పారక్యస్యైవ - ప్రపంచంలో ఎవరి శరీరం తమ కోసం కాదు, పుట్టేది బ్రతికేదీ చనిపోయేదీ ఏది మన కోసం కాదు. ఎవరికీ దేనికీ లొంగకుండా అనుకున్నది అనుకున్నట్లు నిక్కచ్చిగా ఎవరూ చెయ్యలేరు  )

బాలద్విజసుహృన్మిత్ర పితృభ్రాతృగురుద్రుహః
న మే స్యాన్నిరయాన్మోక్షో హ్యపి వర్షాయుతాయుతైః

అన్నిరకాల వారికి ద్రోహమ తప్ప ఏమీ చెయ్యలేదు
పదివేల వేల కోట్ల సంవత్సరాలు గడిచినా నాకు స్వర్గం రాదు

నైనో రాజ్ఞః ప్రజాభర్తుర్ధర్మయుద్ధే వధో ద్విషామ్
ఇతి మే న తు బోధాయ కల్పతే శాసనం వచః

ధర్మయుద్ధం చెయ్యడం రాజుకు దోషంకాదని మీరు చెప్తున్నా నా మనసుకు సంతృప్తిని ఇచ్చుట లేదు.

స్త్రీణాం మద్ధతబన్ధూనాం ద్రోహో యోऽసావిహోత్థితః
కర్మభిర్గృహమేధీయైర్నాహం కల్పో వ్యపోహితుమ్

నావలన చంపబడిన బంధువులని వారి విలాపాన్ని చూస్తుంటే నేను ఎంతమందికి ద్రోహంచేసాను. దానికి పరిష్కారం ఏది. గృహస్తాశ్రమంలో పనులుచేస్తూ ఆ పాపాన్ని నేను పోగొట్టుకోలేను,

యథా పఙ్కేన పఙ్కామ్భః సురయా వా సురాకృతమ్
భూతహత్యాం తథైవైకాం న యజ్ఞైర్మార్ష్టుమర్హతి

బురదను బురదతో కడగలేనట్లు మద్య పాత్రను మద్యపాత్రతో శుధ్ధిచేసుకోలేనట్లు, ప్రాణిహత్యను మరొకప్రాణి హత్యతో (యజ్ఞ్యంతో ) పోగొట్టుకోవచ్చా?